Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జగన్ వైఖరిపై వైసీపీ ఎమ్మెల్యే బలే చెప్పాడుగా...
posted on: Jan 12, 2018 11:22AM
.jpg)
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీరు అందరికీ తెలిసిందే. పార్టీలో తను చెప్పిందే వేదం..కనీసం ఎవరి మాట కూడా వినకుండా.. తానో మోనార్క్ అన్నట్టు వ్యవహరిస్తుంటాడు. అసలు పార్టీలో ఇంతమంది అధికార పార్టీ అయిన టీడీపీలోకి జంప్ అవ్వడానికి సగం కారణం జగన్ వైఖరే. బయటకు వచ్చిన నేతలు చెప్పింది కూడా జగన్ తీరు నచ్చకే పార్టీ వీడుతున్నామని చెప్పినవాళ్లే చాలామంది ఉన్నారు. ఇక ఇప్పుడు తాజాగా మరోసారి జగన్ తీరు గురించి చెప్పుకుంటూ అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది.
ప్రజాసంకల్పం పేరుతో జగన్ పాదయాత్ర మొదలు పెట్టి ప్రస్తుతం చిత్తూరు చేరుకున్నారు. ఇక ఈ పాదయాత్రలో భాగంగా జగన్ చంద్రబాబు సొంత జిల్లాలో కూడా పాదయాత్ర చేశారు. దీంతో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ పాదయాత్రలో చిత్తూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే కూడా ఒకరు పాల్గొన్నారు. పాదయాత్ర మధ్యలో భోజనాలు చేయడానికి అని ఓ తోటలో కాసేపు సేదతీరారు. అయితే అక్కడ సీఎం సొంత జిల్లాలో జగన్ పాదయాత్రపై టాపిక్ చర్చకు వచ్చిందట. అంతే సదరు ఎమ్మెల్యే గారు జగన్ తీరు గురించి ఆఫ్ ద రికార్డ్ కొన్ని వ్యాఖ్యలు చేశారట. అదేంటంటే... టీడీపీలో కంటే వైసీపీలో ఉంటేనే తాము నాలుగు రూపాయలు సంపాదించుకునే స్వేచ్ఛ ఉంటుందని.. కానీ జగన్ తో వచ్చిన చిక్కల్లా ఏంటంటే.. ఆయన ఏ పనిలోనూ క్లారిటీ ఉండదు.. ముందు అతనేం చేయాలనుకుంటున్నాడో అతనికే తెలియదు... ఇంకా మాకు ఎలా తెలుస్తుంది.. మాకు అంతకంటే తెలియదు... ఆఖరి నిమిషం వరకూ ఏం చేయాలో మాకు తెలియదు అంటూ తన మనసులో ఉన్న మాటలని బయటపెట్టారట.
అంతేకాదు దీనికి కొన్ని ఉదాహరణలు కూడా చర్చకువచ్చాయట. ఓ రోజు అసెంబ్లీలో చర్చ జరగుతున్నప్పుడు జగన్ సడెన్ గా లేచి వెళ్లిపోయాడట. అయితే ఏదో వాష్ రూమ్ కి వెళ్లారనుకొని మిగతా ఎమ్మెల్యేలు లోపలే కూర్చొని ఉన్నారట. ఇక జగన్ ఎంతసేపటికి రాకపోవడంతో ఒక మనిషిని పంపించడంతో.. ఆయన ఉగ్రరూపం దాల్చారట. నేను వాకౌట్ చేస్తే మీరంతా లోపల ఎందుకు కూర్చున్నారని సీరియస్ అయ్యారట. దానికి వారు మాకు చెప్పలేదు కదా సార్ అని అడిగితే.. చెప్పాలా.. ఆమాత్రం తెలియకపోతే ఎలా అని మండిపడ్డారట. ఆ తరువాత మరొక రోజు..అసెంబ్లీలో అధికార పార్టీతో వాగ్యాదం జరిగిన తరువాత.. జగన్ మళ్లీ లేచి బయటకు వెళ్లాడట. పాపం ఇంతకు ముందు జరిగిన ఘటన గుర్తు పెట్టుకొని... ఎమ్మెల్యేలు పొలో మంటూ జగన్ వెనుక వెళ్లారట. అయితే రివర్స్ లో జగన్ నా వెనుక ఎందుకు వస్తున్నారు... కనీసం రెస్ట్ రూమ్ కి వెళ్లనివ్వరా అని విసుక్కున్నాడట. దీంతో ఖంగు తిన్న ఎమ్మెల్యేలు సైలెంట్ వెళ్లి తమ సీట్లలో కూర్చున్నారట. ఇదే అతనితో వచ్చిన తంటా... ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు... అతని నిర్ణయాలు అలానే ఉంటాయని చెప్పుకున్నారట. మొత్తానికి జగన్ తీరు చూసి పార్టీలో నేతలే బాగానే విసిగిపోతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ మాటలు కనుక జగన్ చెవిన పడితే... వారి పరిస్థితి ఏంటో మరి..



.jpg)


