షర్మీలపై జగన్ కు పీకే సలహా.. జగన్ లాజిక్ కు పీకే షాక్..

 

జగన్ స్వభావం గురించి అందరికీ తెలిసిందే. నేను మోనార్కుని.. ఎవరి మాట వినను అనే మెంటాలిటీ జగన్ ది. ప్రస్తుతం జరుగుతున్న పార్టీ ఫిరాయింపులే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకూ 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ ని  వీడి అధికార పార్టీ లోకి జంపు అయ్యారు. ఇంకా పలువురు..లిస్ట్ లో ఉన్నారు కూడా. అయితే పార్టీ నుండి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ.. జగన్ వైఖరి నచ్చలేదని.. ఆయన అస్సలు పట్టించుకోవడంలేదన్న పాట పాడిన వారు. అంతేకాదు ఇంత మంది పార్టీ మారుతున్నా... జగన్ మాత్రం నిమ్మకు నీరెత్తన్న్టటు ఉన్నాడంటేనే అతనికి ఉన్న గర్వం ఏంటో అర్ధమవుతుంది. అయినా సొంత కుటుంబసభ్యులనే పట్టించుకోని జగన్.. బయటవాళ్లను మాత్రం పట్టించుకుంటాడు అనుకోవడం.. హాస్యాస్పదం. ఇక తన చెల్లి షర్మీల అయితే తనకు ఎక్కడ పోటీ వస్తుందో అని ఆమెను పక్కన పెట్టాడు.

 

అయితే ఇన్ని రోజులు వినిపించని షర్మిల పేరు తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది. అది కూడా వైసీపీ ఎన్నికల ప్రచార వ్యహకర్త ప్రశాంత్ కిషోర్ వల్ల. అసలు కథ ఏంటంటే.. జగన్ పై అవినీతి ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే కదా. మొత్తం 11 కేసులు ఉన్న నేపథ్యంలో.. ఏ కేసులో అయినా జైలుకు వెళ్లాల్సి వస్తే.. దానికి ప్రత్యామ్నయంగా పార్టీ పగ్గాలు అందుకోవడానికి పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవి షర్శిలకు ఇవ్వాలని ప్రశాంత్ కిషోర్ సలహా ఇచ్చారట. షర్మిలకు పార్టీ ప్రధాన కార్యదర్సి పదవి ఇచ్చి ప్రచారానికి వాడుకోవాలని సూచన చేశారట. అయితే ప్రశాంత్ కిషోర్ చేసిన ఈ సూచనకు ముందు జగన్ ఖంగు తిన్నా... తరువాత తేరుకొని ఆలోచించి చెబుతా అని అన్నారట. అంతేకాదు... ప్రశాంత్ కిషోర్ కు అర్దంకాని ఓ తొక్కలో లాజిక్ కూడా చెప్పారట. నేను తీసుకునే నిర్ణయాలు అన్నీ ఏకపక్షంగానే, అప్పటికప్పుడే ఉంటాయి. ఇద్దరి స్వభావం ఒకటే..ఇద్దరూ ఒకే నిర్ణయాలు తీసుకుంటే ప్రమాదం అని చెప్పారట. ఇక జగన్ చెప్పిన సమాధానం అర్ధంకానీ పీకే... మళ్లీ అడుగగా.. జగన్ మళ్లీ అదే సమాధానం చెప్పాడట.

 

అయితే గతంలో జగన్ జైలుకు వెళ్లినప్పుడు షర్మిలానే పాదయాత్ర చేసింది. అయితే జైలు నుండి బయటకు వచ్చిన తరువాత జగన్ సొంత చెల్లి అని కూడా చూడకుండా ఆమెను పక్కకు నెట్టేశారు. అంతేనా ఆమె ఎంపీ సీటు ఆశించినా అది కూడా జగన్ ఇవ్వలేదు. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా ఆమెకు సీటు ఇచ్చే అవకాశం లేదన్న సంగతి తెలిసిపోతుంది. మొత్తానికి జగన్ కు షర్మిల అంటే బాగనే భయం ఉన్నట్టు కనిపిస్తోంది. ఎక్కడ తనకు బాధ్యతలు ఇస్తే.. తన పవర్ ఎక్కడ తగ్గిపోతుందో అని భయపడి.. సొంత చెల్లిని కూడా పైకి రానివ్వడంలేదు. ఇంక మిగిలిన వారిని రానిస్తాడా..?