Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జగన్, అవ్వ ముచ్చట...ఎర్రోడిని చేసిందిగా...
posted on: Dec 5, 2017 3:06PM
.jpg)
ప్రజాసంకల్పం పేరుతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే కదా. చాలా కష్టాలు పడుతూ.. మధ్య మధ్యలో గ్యాప్ తీసుకుంటూ... ఏదో లాక్కొస్తున్నాడు. అయితే ఈ పాదయాత్రలో ఓ అవ్వ జగన్ కు దిమ్మతిరిగే షాకిచ్చినట్టు తెలుస్తోంది. ఇక అవ్వ ఇచ్చిన షాక్ కు జగన్ ఎర్రిమొహం పెట్టుకోవాల్సి వచ్చిందట. ఇంతకీ ఆ అవ్వ ఇచ్చిన షాకేంటంటారా.. ఆ షాక్ ఏంటో తెలుసుకోవాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే.
పాదయాత్రలో భాగంగా జగన్ కర్నూలు జిల్లా ఎర్రగుడి చేరుకున్నారు. ఇక ఆ ఊరి చివరికి వెళ్లిన జగన్ ఓ అవ్వ కనిపించింది. జగన్ ఆ అవ్వ దగ్గరికి వెళ్లాడు. ఇక ఎప్పటిలాగే జగన్ తన మేనరిజాన్ని చూపించబోయాడు. అదేనండి.. తలపై ముద్దు పెట్టుకోబోయాడు. కానీ అవ్వ పక్కకు జరిగి....తన సంచిలో ఉన్న వేరు శనగకాయలు ఇచ్చింది. ఆ తరువాత స్టోరీ చూడండి.
జగన్.. ఆ శనగకాయలు తింటూ జగన్ ఏంటి అవ్వా శనగకాయలు కొన్నావా అని అడిగాడు.
అవ్వ.. కాదయ్యా.. అవి మా చేలోవే అంది.
జగన్.. బాగా పండిందా మీ చేను అని అడిగాడు
అవ్వ.. అవునయ్యా.. బాగా పండింది. ఈ యేడు పుట్లు పుట్లు పండాయి
జగన్.. వానల్లేవుగా.. ఇంత బాగా ఎలా పండింది
అవ్వ.. వానెందుకయ్యా పట్టిసీమ నీళ్లొస్తే.. కాలువ నిండా నీళ్లుంటే..
జగన్.. ఏందవ్వా.. నేనేమైనా పిచ్చోడ్నా.. యాడ పట్టిసీమ..? యాడ ఎర్రగుడిపాడు.. ఎలా వస్తాయమ్మా పట్టిసీమ నీళ్లు
అవ్వ.. దానికి అవ్వ.. ఓరి పిచ్చినాయనా..? పట్టిసీమ ఎక్కడుందో నీకు తెలవకపోవచ్చు.. కానీ రాయలసీమ మొత్తానికీ.. ప్రతి బిడ్డకీ తెలుసు.. సీమకు నీళ్లు ఎలా వచ్చాయో? కాలువలు ఎలా పారుతున్నాయో..? కాస్త తెలివి తెచ్చుకో నాయనా.. ఇంకో ఊళ్లో ఎక్కడా ఇలా అడగమాకు.. జనం తిరగబడతారు. ఇక జాల్లో నడూ నడూ అని చెప్పిందట.
దీంతో అవ్వ చెప్పిన సమాధానానికి జగన్ నోటి మాట రాలేదట. చంద్రబాబు నిర్మించిన పట్టిసీమపై జగన్ ఎప్పటినుండో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాగే అవ్వ ముందు కూడా అలానే అన్నాడు బుక్ అయ్యాడు. నిజానికి పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకే నీళ్లు వస్తాయి. అయితే కృష్ణా డెల్టాకు కృష్ణా నది నుండి వచ్చే వాటా నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు తరలిస్తున్నారు. పోతిరెడ్డి ద్వారా రాయలసీమకు గతంలో ఎప్పుడు లేని విధంగా నీరు అందుతుంది. దీనిపై గతంలో వారి పేపర్ ద్వారా స్టోరీలు కూడా రాశారు. మరి ఇంత చేసీ కూడా జగన్ ఈ చిన్న లాజిక్ ఎందుకు మర్చిపోయాడో ఏంటో. కనీసం అవ్వకు తెలిసినంత కూడా తెలియడం లేదు. జగన్ ది తెలియనితనమా? లేక అమాయకత్వమా? అని అనుకోవాలో కూడా అర్ధంకావట్లేదు. ఏంటీ జగన్ ఇది.. దిస్ ఈజ్ టూ మచ్..


.jpg)
.jpg)


