రైతుల ప‌క్ష‌పాతి కాదు.. క‌క్ష‌పాతి!

అధికారంలోకి రావ‌డానికి ముందు ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో జ‌గ‌న్ ఎన్నో ప్ర‌మాణాలు చేశారు. ముఖ్యం గా రైతాంగానికి వెన్నుద‌న్నుగా వుంటాన‌ని, రైతుల‌కు సంబంధించిన ప‌థ‌కాల‌తో వారిని ఆదుకుంటానని పాద‌యాత్ర‌ల్లో, బ‌హిరంగ స‌భల్లో  ప్ర‌స్తావించి రైతాంగాన‌కి ఆశ‌లు క‌ల్పించారు.  తీరా అధికారంలోకి వ‌చ్చి న త‌ర్వాత వారి గోడు విన‌డం మానేశారు. పంట‌ల భీమా ప‌థ‌కం యావ‌త్తు లోప‌భూయిష్ట‌మ‌ని  విప‌క్షాలు మండిప‌డుతున్నాయి. ప‌థ‌కాలు, వాటి అమ‌ల్లో కూడా లోపాలు వున్నాయ‌ని తెలుగు దేశం ఎమ్మెల్సీ  బీ టెక్  ర‌వి  ప్ర‌భుత్వం పై విరుచుకుప‌డ్డారు. 

ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ జగనే  ఒక ఇన్సూరెన్స్ కంపెనీని సృష్టించాడని దాని కి అర్హత, ఆథరైజే షన్ వ్యాలిడిటీ  ఏమీ లేవని వ్యాఖ్యానించారు. జగన్  రైతులకు పంటల బీమా ప్రీమియం ఎంత  కట్టారో తెలపాలని డిమాండ్ చేశారు. పంటల బీమా పథకంతో రైతులు నష్టపోయి, పార్టీ నాయ కులు, మద్దతు దారులు లాభపడుతున్నారని తెలిపారు. లేని ఇన్సూరెన్స్ కంపెనీని  సృష్టించి రైతులను  మోసం చేస్తు న్నారని ఆయన మండిపడ్డారు.

అధికంగా పంటలు వేసిన ప్రాంతానికి పంటల బీమా చెల్లించకపోవడం దారుణమని అన్నారు. ఎక్కువ విస్తీ ర్ణంలో సాగుచేసిన పంటకు తక్కువ బీమా ఇవ్వడం అన్యాయమన్నారు. ప్రజాధనాన్ని, రాష్ట్ర ఆదా యాన్ని తన మద్దతుదారులకు పంటల బీమా రూపంలో దోచిపెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నారు. 

గతంలో ఉన్న ధరల స్థిరీకరణ పథకానికి రెక్కలొచ్చాయన్నారు. జగన్  రైతుల పక్షపాతి కాదు.. కక్షపాతి అని విమర్శించారు. అమ్మఒడి పథకానికి  లేనిపోని నిబంధనలు పెట్టి అవకతవకలకు పాల్పడుతున్నా రని బీటెక్ రవి ఆగ్రహం వ్యక్తం చేశారు.