Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...‘జబర్దస్త్’ టీమ్ పత్తిత్తులా?
posted on: Dec 22, 2014 12:17PM

ఈటీవీలో ప్రసారమయ్యే ‘జబర్దస్త్’ కామెడీ షోలో ఈమధ్య ఓ ఎపిసోడ్‌లో గౌడ మహిళను కించపరిచే విధంగా చూపించారు. దానికి స్పందించిన గౌడ యువకులు అందులో నటించిన వేణు అనే కమెడియన్‌ని చావబాదారు. దాంతో కొంతమంది సినీ, టీవీ నటీనటులు నిరసన కార్యక్రమం చేపట్టారు. వేణు మీద దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జబర్దస్త్ టీమ్‌లో వున్నవారైతే ‘‘మేం నవ్విస్తుంటే మమ్మల్ని కొడతారా? ఇదెక్కడి న్యాయం’’ అని ఆవేదనగా ప్రశ్నించారు. ఒక కమెడియన్ మీద ఇలా దాడి చేసి కొట్టడం తప్పు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అలాగే మరోవైపు జబర్దస్త్ ప్రోగ్రాంలోని విచ్చలవిడితనం మీద కూడా విమర్శలు వినిపిస్తున్నాయి.
ఒకప్పుడు ఈటీవీ అంటే ప్రజల్లో ఒక గౌరవమైన అభిప్రాయం వుండేది. ఆ అభిప్రాయాన్ని మార్చుకునేలా చేసిన ఘనత జబర్దస్త్ ప్రోగ్రాం దక్కించుకుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జబర్దస్త్ ప్రారంభంలో మెల్లమెల్లగా మొదలైన బూతులు, ద్వంద్వార్థాలు ఈమధ్యకాలంలో బాగా పెరిగిపోయాయన్న విమర్శలున్నాయి. జబర్దస్త్‌లోని టీమ్‌లో నవ్వించడం కోసం ఒకరిని మించి మరొకరు బూతులు బాగా ఉపయోగిస్తూ కుటుంబ సమేతంగా చూడలేని పరిస్థితి తెచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జబర్దస్త్‌లోని టీమ్‌లో బూతులు, డబుల్ మీనింగ్‌లు మాట్లాడినప్పుడు ఈ ప్రోగ్రాంకి యాంకర్‌గా వున్న యువతి, జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్న నాగబాబు, రోజా కూడా పగలబడి నవ్వుతూ వుంటారు. వాళ్ళమీద బూతు జోకులు వేసినా కూడా ఇహిహి అని ఇకిలిస్తూ వుంటారు. ఈ ఇకఇకలు పకపకలు జబర్దస్త్‌లో బూతుల ధోరణి పెరిగిపోయిందన్న విమర్శలున్నాయి.
‘నవ్వించడమే నేరమా?... మేం నవ్విస్తుంటే మమ్మల్ని కొడతారా?’ అని ఇప్పుడు జబర్దస్త్ టీమ్ అమాయకంగా ప్రశ్నిస్తోంది. అయితే వాళ్ళు కొట్టడం కంటే ఎక్కువ నష్టాన్ని చేస్తున్నారన్న విషయాన్ని మరచిపోతున్నారు. నవ్వించే నెపంతో సమాజంలోని ఎన్నో వర్గాలను వాళ్ళు కించపరుస్తూ స్కిట్లు రూపొందిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పిల్లలు చూసే ప్రోగ్రాములో వాళ్ళు గుప్పిస్తున్న బూతులు సమాజానికి ఎంత నష్టం చేస్తాయో వాళ్ళు గ్రహించాలని పలువురు అంటున్నారు. సినిమాలకి సెన్సార్ అనేది ఒకటి వుంటుంది. టీవీలకు అలాంటిది లేకపోవడం వల్ల జబర్దస్త్‌లో ఎంతటి బూతు అయినా చూపించేస్తున్నారు. ఏ వర్గం ప్రజల్ని అయినా అవమానించేలా స్కిట్లు రూపొందిస్తున్నారు. మొత్తమ్మీద కమెడియన్ వేణును కొట్టడం ఎంత తప్పో, జబర్దస్త్ ప్రోగ్రామ్‌లో బూతులు, ఇతరులను కించపరిచే స్కిట్లు ప్రసారం చేయడం కూడా అంతే తప్పన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.


.jpg)
.jpg)


