Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...గాలి కూడా కంట్రోల్లో... వాళ్లే మనుషులా..
posted on: Nov 28, 2017 2:52PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ హైదరాబాద్ వచ్చేసింది. గత వారం రోజులు నుండి చేస్తున్న హడావుడికి కాస్త తెర దిగింది. ఇక ఇవాంక ట్రంప్ వస్తున్నందుకు గాను హైదరాబాద్ ను అందంగా ముస్తాబు చేశారు. బెగ్గర్స్ ఫ్రీ చేశారు.. ఎక్కడా దోమలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఎక్కడిక్కడ రోడ్లని శుభ్రంగా.. చిన్న కాగితం ముక్క కూడా లేకుండా చేశారు. ఇది కూడా ఇవాంక ట్రంప్ ఎక్కడ పర్యటిస్తుందో అక్కడ మాత్రమే లెండి. ఇక భారీ ఎత్తున ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు.. ఎన్నో జాగ్రత్తలు చేశారు. ఇక ఇవాంకాకు డిన్నర్ ఫలక్ నామా ప్యాలెస్ లో ఏర్పాటు చేశారు. ఇక ఆమెకు ఇవ్వాల్సిన బహుమతులు కూడా కేసీఆర్ దగ్గరుండి మరి సెలెక్ట్ చేశారు. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా ఇప్పుడు ఇవాంకాకు స్వచ్ఛమైన గాలిని ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. దీనికి చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలకు వార్నింగ్ కూడా ఇచ్చారట. వారం రోజుల పాటు పరిశ్రమలపై ఆంక్షలు విధించారు. హద్దూపద్దు లేకుండా పొగ వదిలితే కఠినమైన చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు పరిశ్రమల యాజమాన్యాలకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కాలుష్య నియంత్రణ మండలి పరిశ్రమలపై ప్రత్యేకంగా నిఘా పెట్టినట్లు సమాచారం. ఐడిఎ బొల్లారం పారిశ్రామికవాడ నుంచి పొగ వెలువడకుండా చూసే బాధ్యతను కాలుష్య నియంత్రణ మండలి భుజాన వేసుకుంది.
అంటే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే... ఇవాంక వచ్చిందని మన ప్రభుత్వ పెద్దలు అంత జాగ్రత్తగా.. గాలి కూడా స్వచ్చంగా ఇవ్వాలని చూస్తున్నారు. మరి ఎన్నో ఏళ్ల నుండి ఆ పొగలోనే బ్రతుకుతున్న సామాన్య ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో.. కనీసం ఒక్కసారైనా ఆలోచించలేకపోయారు. ఏనాడు వారి సమస్యను పట్టించుకొని.. తగిన చర్యలు తీసుకోవడానికి చేతులు రాలేదు కానీ.. ఇప్పుడు ఇవాంక వస్తున్నందుకు గాను... ఏకంగా వారం రోజుల నుండి పొగ అనేది రాకుండా పరిశ్రమలకు వార్నింగులు ఇచ్చారు. ఆమె అమెరికా అధ్యక్షుడు కూతురు కనుక.. మనకు అమెరికాతో చాలా అవసరం ఉంది కనుక.. ఇవ్వడంలో తప్పులేదు. కానీ వాళ్లు మాత్రమే మనుషులు.. ఇక్కడ ఉన్నవాళ్లు మనుషులు కాదా వారి దృష్టిలో. అంటే నగరం శుభ్రంగా ఉండాలంటే బయట దేశాల నుండి ఎవరైనా రావాలా..వాళ్లు వచ్చినప్పుడే ఓట్లు కావాలంటే మాత్రం ప్రజలు కావాలి... కానీ.. ఇలాంటి విషయాల్లో మాత్రం ప్రజలు పనికిరారు. ఈ ప్రభుత్వ విధానాలు ఎప్పుడు మారతాయో మరి..


.gif)



