Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బెంగళూరును వదిలేస్తున్న ఐటీ?
posted on: Mar 29, 2026 11:34AM

దేశ ఐటీ రాజధానిగా దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న బెంగళూరు ఇప్పుడు ఆ ప్రాభవాన్ని కోల్పోతోంది. ఒక్కటొక్కటిగా ఐటీ కంపెనీలు బెంగళూరును వీడుతున్నాయి. గత ఐదేళ్లలోనే వందల కంపెనీలు తమ ప్రధాన కార్యాలయాలను బెంగళూరు నుంచి ఇతర రాష్ట్రాలకు తరలించేశాయి. అధికారిక లెక్కల ప్రకారమే ఐద ఐదేళ్లలో 629 కంపెనీలు కర్నాటకను వీడి వెళ్లాయి. ఈ కంపెనీలలో అత్యధికం హైదరాబాద్, విశాఖలను తమ ప్రత్యామ్నాయాలుగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
ఇక పోతే ఐటీ కంపెనీలు కర్నాటకలో కొనసాగే విషయాన్ని తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు ఈ గణాంకాల ఆధారంగా తేటతెల్లమౌతోంది.
చక్ బళ్లాపూర్ ఎంపీ కేసుధాకర్ ప్రశ్నకు కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా లోక్ సభ వేదికగా ఇచ్చిన సమాధానం మేరకు గడిచిన ఐదు సంవత్సరాల్లో అంటే 2020 నుంచి 2025 వరకు మొత్తం 629 కంపెనీలు కర్ణాటకను వీడి వెళ్ళాయి. కంపెనీల చట్టం 2013 ప్రకారం వ్యాపార విస్తరణ, పరిపాలనా పరమైన వెసులుబాటు కోసం ఈ సంస్థలు తమ కార్యాలయాలను మార్చుకున్నాయి. ఇక ఆయన ఇచ్చిన సమాధానం మేరకు సంవత్సరాల వారీగా కర్నాటకు గుడ్ బై చెప్పిన కంపెనీల సంఖ్య ఇలా ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 129 కంపెనీలు, 2021-22లో 126 సంస్థలు, 2022-23లో 88 కంపెనీలు కర్నాటకు గుడ్ బై చెబితే.. ఆ తరువాతి రెండేళ్లూ అంటే 2034- 24, 2024 - 25 సంవత్సరాలలో వరుసగా 119, 167 సంస్థలు కర్నాటకను వీడి వెళ్లాయి. గత ఐదేళ్లతో పోలిస్తే గత ఏడాది కర్నాకట వదిలేసిన సంస్థల సంఖ్య ఎక్కువగా ఉండటం కర్నాటకలో ఐటీకి గడ్డు పరిస్థితి దాపురించిందనడానికి నిదర్శనంగా నిలుస్తోంది.
ఇక ఇందుకు మౌలిక సదుపాయాల కొరతతో పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఇబ్బందులు,అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలు కంపెనీలకు ఇస్తున్న ప్రోత్సాహకాలు ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను కర్నాటకేతర ప్రాంతాలను ఎంచుకోవడానికి కారణంగా కనిపిస్తున్నాయి.
అయితే కర్నాటక మాత్రం దీనికి ఖండిస్తోంది. మౌలిక సదుపాయాల సమస్యల వల్ల కంపెనీలు వెళ్లడం లేదని, ఇది కేవలం కంపెనీల అంతర్గత నిర్ణయమని కర్నాటక సర్కార్ చెబుతోంది. చేస్తోంది. గడిచిన మూడేళ్లలో రాష్ట్రానికి 5.1 లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులకు అనుమతులు ఇచ్చి, వేల ఎకరాల భూమిని కేటాయించామని ప్రభుత్వంచెబుతోంది.
అలాగే బెంగళూరుపై ఒత్తిడి తగ్గించేందుకు మైసూరు, మంగుళూరు వంటి నగరాల్లో ఐటీ కంపెనీలకు తమ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించిందని సీఎం సిద్దరామయ్య చెప్పారు. ఇవన్నీ ఒకెత్తయితే.. ప్రధాన ఐటీ కంపెనీలు తమ వ్యాపార విస్తరణ కోసం ఇతర రాష్ట్రాల వైపు దృష్టి సారించడానికి ట్రాఫిక్ కష్టాలు సహా పలు కారణాలున్నాయని అంటున్నారు. కంపెనీల వలసలు ఇలాగే కొనసాగితే సమీప భవిష్యత్ లో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు దారుణంగా దెబ్బతింటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.


.webp)



