Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆపరేషన్ ఖమేనీ.. లేడీ స్పై క్యాథరీన్ ను ప్రయోగించిన ఇజ్రాయెల్
posted on: Mar 21, 2026 4:27PM

ఇజ్రాయిల్ నిఘా సంస్థ ముసాద్. ఈ పేరు వింటే చాలు శత్రు దేశాల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అసాధ్యం, అనితరసాధ్యమన్న రీతిలో ఆ నిఘా సంస్థ వ్యూహాలు ఉంటాయి. తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా ఇజ్రాయిల్ జరిపిన మెరుపు దాడి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ దాడిలో ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దూరం వేల కిలోమీటర్లు. అయినా సరే ఇరాన్ లో ఖమేనీ ఎక్కడ ఉన్నారన్నది కచ్చితంగా గుర్తించి మట్టుబెట్టిందంటే స్పయింగ్ విషయంలో ముసాద్ సామర్ధ్యం, ప్రతిభ, నైపుణ్యం ఎంతటివో ఇట్టే అవగతమౌతాయి. ఇంతకీ ఖమేనీని మట్టుబెట్టడానికి ముసాద్ చేపట్టిన భారీ ఆపరేషన్ సక్సెస్ వెనుక క్యాథరీన్ అనే మహిళా స్పై కీలక పాత్ర పోషించింది. ఖమేనీ హతమైన క్షణం నుంచీ ప్రపంచ వ్యాప్తంగా ఈ లేడీ స్పై క్యాథరిన్ చుట్టూనే ప్రపంచ దేశాలలో చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరీ క్యాథరీన్.. ఏమా ముసాద్ వ్యూహం.. తెలుగు వన్ ప్రత్యేక కథనం..
గత దశాబ్ద కాలంగా ఇరాన్ లోని అగ్రశ్రేణి అణు శాస్త్రవేత్తలను, కీలక అధికారులను ఇజ్రాయిల్ వరుసగా ఏరివేస్తూ వస్తోంది. 2018లో ఇరాన్ అణు పత్రాలను దొంగిలించడం నుంచి, 2020లో శాటిలైట్ కంట్రోల్డ్ గన్ తో ఫక్రీజాదాను అంతం చేయడం వరకు ముసాద్ ప్రతి అడుగు సంచలనమే. అయితే ఖమేనీని చేరుకోవడానికి ముసాద్ వేసిన ప్లాన్ మాత్రం అత్యంత క్లిష్టమైనది. ఖమేనీని అంతం చేయడం కోసం ముసాద్ క్యాథరిన్ అనే గూఢచారిణిని ఏళ్ల క్రితమే రంగంలోకి దింపింది.
ఫ్రాన్స్ లో జన్మించిన క్యాథరిన్, ముసాద్ శిక్షణలో ఆరితేరిన యోధురాలు. అందం, తెలివితేటలతో ఇరాన్ అత్యున్నత వర్గాల్లోకి క్యాథరిన్ అలవోకగా చొచ్చుకుపోయింది. ఇస్లాం మతాన్ని స్వీకరించి, ఒక ముస్లిం యువకుడిని వివాహం చేసుకుని, పక్కా షియా ముస్లిం వనితగా తన రూపాన్ని మార్చుకుంది. జర్నలిస్ట్ గా, పొలిటికల్ అనలిస్ట్ గా కెరీర్ ప్రారంభింఛి, ఏకంగా ఇరాన్ సుప్రీం లీడర్ అధికారిక వెబ్ సైట్ లో వ్యాసాలు రాసే స్థాయికి ఎదిగింది.
ఈ క్రమంలో ఆమె ఇరాన్ లోని సుమారు 100 మంది కీలక అధికారులతో ముతా అంటే తాత్కాలిక వివాహ ఒప్పందం చేసుకుంది. తద్వారా వారి వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించింది. వారి ద్వారా ఇరాన్ రక్షణ వ్యవస్థకు సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని సేకరించింది. సేకరించడమే కాదు.. ఆ రహస్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు ముసాద్ కు చేరవేసింది. చివరకు సుప్రీం లీడర్ ఖమేనీని నేరుగా కలిసే అవకాశాన్ని దక్కించుకుంది.
ఇన్నీ చేసి క్యాథరిన్ 2022లో ఇరాన్ వదిలి వెళ్ళిపోయింది. అయితే తాను ఇరాన్ లో స్పయింగ్ చేసి నంత కాలం ఏర్పరుచుకున్న నెట్ వర్క్ ఇరాన్ కు కళ్లూ, చెవులుగా మారింది. ఇరాన్ లో చీమ చిటుక్కు మంటే ఇజ్రాయెల్ కు తెలిసి తీరాల్సిందే అన్నట్లుగా ముసాద్ ఇరాన్ లో తన నెట్ వర్క్ ను ఏర్పరుచుకోగలిగింది. ఇందుకు లేడీ స్పై క్యాథరిన్ కారణం. అంతే కేదు.. ముసాద్ ఇరాన్ కీలక అధికారుల దంతాల్లో మైక్రో ట్రాకింగ్ చిప్పుల అమర్చిందంటారు. ఇంకా ఆపరేషన్ల ద్వారా శరీరంలో నిఘా పరికరాలను ఉంచడం వంటివి ముసాద్ అత్యంత నైపుణ్యంతో అమర్చిందంటారు. ఇలా అందిన పక్కా సమాచారంతోనే ఇజ్రాయెల్ ఖమేనీని క్షణాల్లో హతం చేయగలిగింది అంటే అతిశయోక్తి కాదు. ఏది ఏమైనా ఖమేనీని హతం చేయడంలో ఇంతటి నిఘా నైపుణ్యాలు ఇజ్రాయెల్ కనబరిచినా.. ఇరాన్ రక్షణ వ్యవస్థలోపాల కారణంగానే ముసాద్ విజయం సాధించిందన్న వాదనా లేకపోలేదు.






