Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఫ్రోజెన్ బఠానీలు తింటున్నారా? ఇవి తినడం మంచిదా కాదా? అసలు నిజాలివి..!
posted on: Feb 11, 2026 1:37PM

శీతాకాలంలో మార్కెట్ లో పచ్చి బఠానీలు అందుబాటులోకి వస్తాయి. భారతీయ కూరలు, మసాలా రైస్, వెజిటబుల్ రైస్, కూరగాయలు అన్నీ కలిపి వండే కూరలు, గ్రేవీలు, సూపుల నుండి స్నాక్స్ వరకు బఠానీలు ప్రతి వంటకం రుచిని పెంచుతాయి. కానీ శీతాకాలం ముగియగానే తాజా పచ్చి బఠానీలు మార్కెట్ లో కనిపించవు. ఇలాంటి సందర్భాలలో ప్రజలు తెలివిగా ఆలోచిస్తారు. డీప్ ఫ్రిజ్ లో ఫ్రీజ్ చేసిన బఠానీలను ఆశ్రయిస్తారు. వీటినే ఫ్రోజెన్ బఠానీలు అని అంటారు. అయితే, చాలా మంది ఫ్రోజెన్ బఠానీలు ఆరోగ్యానికి మంచివా కాదా అనే విషయం ఆలోచించరు. అలాగే తాజా బఠానీల లాగా ఫ్రోజెన్ బఠానీలు ప్రయోజనకరంగా ఉంటాయా లేదా అని కూడా తెలుసుకోరు. కానీ ఆరోగ్యం మీద స్పృహ ఉన్న కొద్దిమంది మాత్రం ఫ్రోజెన్ బఠానీ ల గురించి అయోమయంలో ఉంటారు. అసలు ఫ్రోజెన్ బఠానీలు పచ్చి బఠానీలలాగా ఆరోగ్యానికి మేలు చేస్తాయా? దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..
బఠానీలలో పోషకాలు..
శాకాహారులకు పచ్చి బఠానీలు ప్రోటీన్ పరంగా అద్భుతమైన వనరు. వాటిలో ప్రోటీన్‌తో పాటు అనేక ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం సాధారణ ఆహారంలో బఠానీలను చేర్చుకోవడం వల్ల పోషకాహార లోపాలను అధిగమించవచ్చు. అందుకే సీజన్ ముగిసిన తర్వాత ఫ్రోజెన్ బఠానీలను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు.
ఫ్రోజెన్ బఠానీ ప్రాసెస్..
ఫ్రోజెన్ బఠానీలు పూర్తిగా పండినప్పుడు వాటిని సేకరిస్తారు. వాటిని దాదాపు -18 డిగ్రీల సెల్సియస్ వద్ద స్తంభింపజేస్తారు. ఈ తక్కువ ఉష్ణోగ్రత వద్ద వాటిని నిల్వ చేయడం వల్ల సూక్ష్మజీవుల పెరుగుదల లేదా జీవసంబంధమైన మార్పులు నిరోధించబడతాయి, అవి ఎక్కువ కాలం పచ్చి బఠానీల లాగా ఉంటాయి.
ఆరోగ్యపరంగా..
ఫ్రోజెన్ బఠానీలు అనారోగ్యకరమైనవని, అనారోగ్యానికి కారణమవుతాయని ప్రజలు తరచుగా అనుకుంటారు. అయితే నిపుణులు దీనిని తోసిపుచ్చుతున్నారు. ఫ్రోజెన్ బఠానీలు తాజా పచ్చి బఠానీల మాదిరిగానే ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయని పోషకాహార నిపుణులు అంటున్నారు.
తాజా బఠానీ, ఫ్రోజెన్ బఠానీ మధ్య తేడా..
నిపుణుల అభిప్రాయం ప్రకారం తాజా బఠానీలు, ఫ్రోజెన్ బఠానీల పోషక విలువలో గణనీయమైన తేడా లేదు. ఒక అధ్యయనం రెండు సంవత్సరాల పాటు బఠానీలతో సహా తాజా, ఫ్రోజెన్ కూరగాయలను పోల్చింది. ఈ అధ్యయనంలో రెండింటి పోషక విలువలు దాదాపు ఒకేలా ఉన్నాయని తేలింది. ఇంకా, అనేక ఇతర అధ్యయనాలు కూడా ఘనీభవించిన కూరగాయలు తాజా కూరగాయల మాదిరిగానే ప్రయోజనకరంగా ఉంటాయని చూపించాయి.
ఫ్రిజర్వేటివ్స్..
కొంతమంది ఫ్రోజెన్ బఠానీల లైఫ్ స్పాన్ పెంచడానికి వాటికి ప్రిజర్వేటివ్‌లు లేదా రసాయనాలు కలుపుతారని అనుకుంటారు. అయితే, పోషకాహార నిపుణులు ఇది నిజం కాదని చెబుతున్నారు. -18 డిగ్రీల సెల్సియస్ వద్ద బఠానీలను గడ్డకట్టించడం వల్ల అవి సురక్షితంగా ఉంటాయి. దీనికోసం రసాయనాలు అవసరం లేదు. అయితే, తాజా, ఫ్రోజెన్ బఠానీల మధ్య రుచిలో మాత్రం తేడా ఉంటుంది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...






