పెద్దల సభకు గులాబీ బాస్? కేసీఆర్ ఢిల్లీకి మకాం మారుస్తారా?

రాజ్యసభకు కేసీఆర్ .. ఏంటి అవాక్కయ్యారా? అయినా మీరు వింటున్నది నిజమే.ఢిల్లీకి మకాం మార్చక తప్పని అనివార్య పరిస్థితులు లేదా అర్జెంటుగా ప్రగతి భవన్ ఖాళీ చేయక తప్పని వత్తిళ్ళ నేపధ్యంలో, ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యసభకు వెళ్ళే ఆలోచన చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారంగా పరిశీలకులు పేర్కొంటున్నారు. జాతీయ రాజేకీయాల్లో తెరాస కీలక భూమిక పోషిస్తుందని గత కొంత కాలంగా ముఖ్యమంత్రి పదే పడే ప్రస్తావిస్తున్న నేపధ్యంలో, రాష్ట్ర బాధ్యతలను వారసుడు కేటీఆర్’కు అప్పగించి కేసీఆర్ ఢిల్లీ రాజకీయాలకు షిఫ్ట్’అవుతారని రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా తెరాస వర్గాల్లో చాలా కాలంగా చర్చ జరుగుతోంది. అందుకు ఇప్పుడు పరిస్థితుల ప్రభావం కూడా తోడైందని అందుకే కేసీఆర్ ఢిల్లీకి  మకాం మార్చేందుకు మానసికంగా సిద్డమయ్యారని, అందులో రాజ్యసభకు  వెళ్ళే అలోచన చేస్తునారని అంటున్నారు.     

ఎవరు అవునన్నా,ఎవరు కాదన్నా గత కొంత కాలంగా ముఖ్యంగా తెరాస రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, రాష్ట్రంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. మరో వంక , అంతర్గత కుమ్ములాటలు ఇతరేతర కారణాలవలన  పరిపాలన కోడా పట్టాలు తప్పింది, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది ..ఈ అన్నిటినీ మించి పార్టీలో, అంతకంటే ఎక్కువగ్ ఫామిలీలో అంతర్గత కుమ్ములాటలు రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.ఇంటి ఆడబిడ్డ గడప తొక్కలేని స్థితికి  పరిస్థితి చేజారిపోయింది. ఒక విధంగా చూస్తే ఇప్పటికే పార్టీ మీద, ప్రభుత్వ వ్యవహారాల్లో, కుటుంబ రాజకీయ వ్యవహరాల్లో పెద్దాయన పట్టు తప్పిందని అంటున్నారు.ఇతరుల విషయం ఎలా ఉన్నా, ముఖ్యమంత్రిని ఏదో తెలియని భయం వెంట్డుతోందని ఏ దిక్కు చూసినా అష్టమ దిక్కే కనిపిస్తోందనే భావన బలపడుతోందని సన్నిహిత వర్గాలు అంటున్నాయి.  

అదలా వుంటే మరో వంక రాష్ట్రంలో ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రతిష్ట కూడా రోజు రోజుకు దిగజారుతోందని అంటున్నారు. వరిసాగు, ధాన్యం సేకరణ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం మీద ఎంతగా విరుచుకు పడినా, బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకులను ఎంతగా తిట్టిపోసినా,పడిపోయిన ప్రతిష్ట పైకిలేవడం లేదు. కోటి ఎకరాల్లో వరి వేసినా, ఐ యాం హ్యాపీ’ కొనే సత్తా రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని శాసన సభలో చెప్పి ఇప్పుడు అందుకు అందుకు విరుద్ధంగా మాట్లాడడం వంటి ద్వంద వైఖరితో ముఖ్యమంత్రి వ్యక్తిగత  ప్రతిష్ట దిగజారుతోందని,  ప్రజల్లో ఆయన పట్ల  విశ్వాసం సన్నగిల్లుతోందని  అంటున్నారు. 
మరో వంక అయన గురిచూసి వేసిన ప్రతి బాణం తిరిగొచ్చి  ఆయనకే గుచ్చుకుంటోంది. పాత వీడియోలు ప్రూఫ్ గా సోషల్ మీడియాలో ఆయన్ని ఆయనే ఆయన నోటితోనే దూషించుకోవడం చూసి, నెట్టింట అందరూ నవ్వుకుంటున్నారు. ఆ నవ్వులు ఆయన్నీ, చేరుతున్నాయి, ఆయన్ను ఇంకాస్త, ఫ్రస్ట్రేషన్’లోకి నెట్టేస్తున్నాయని అంటున్నారు. నిజాలు ఎలా ఉన్నా, హుజూరాబాద్ ఓటమి మొదలు ఒకదాని వెంట ఒకటిగా చేదు అనుభవాలే ఎదురవుతున్నాయనే అనే అభిప్రాయం అయితే, అంతటా వినవస్తోంది.   

అంతకు మించి, హుజూరాబాద్ ఓటమి పక్కలో బల్లెంలా, కదిలినా మెదిలినా కడుపులో గుచ్చుకుంటోంది. హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితాలు వచ్చి నిండా నెలరోజులు అయినా, ఈటల చేసిన గాయం మాత్రం మానడం లేదు. ఇన్ని రోజుల్లో, ఎన్నిసార్లు మీడియా ముందుకు వచ్చినా ఒక్క సారైనా ముఖ్యమంత్రి హుజూరాబాద్ ప్రస్తావన చేయలేదు.ఈటల పేరు కూడా  ప్రస్తావించలేదు. దీన్నిబట్టే ఈటల చేసిన గాయం ఆయన్ని ఎంతలా సలుపుతోందో అర్థం చేసుకోవచ్చని, వేరే చెప్పనక్కరలేదని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. అలాగే, అసెంబ్లీలో తనను చూడడం ఇష్టం లేకనే ముఖ్యమంత్రి తనను ఓడించేందుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఈటల పదేపడే చేసిన వ్యాఖ్య నిజమే కావచ్చని ఆ కారణంగానూ , పెద్దల సభకు వెళ్ళే ఆలోచన చేస్తునారని కొందరు అంటున్నారు. 

మరో వంక, వినాయకుడి పెళ్ళికి అన్నీ విఘ్నాలే అన్నట్లుగా, ముహూర్తం దాక వచ్చి ముడిపడని కేటీఆర్ పట్టాభిషేకం ఆలస్యమయ్యే కొద్దీ, పట్టుతప్పుతున్న కుటుంబ కలహాలు, ఫ్యామిలీలో సాగుతున్న ‘కుర్చీ’ పట్లు కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయని అంటున్నారు. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి ఏదో వంకన మకాం ఢిల్లీకి మార్చి, ఆ వంకన కేటీఆర్’ను ముఖ్యమంత్రిని చేసే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.ఈ వ్యూహంలో భాగాంగానే ... మళ్ళీ ఫెడరల్ ఫ్రంట్’ను తెరపైకి తెచ్చారు.బీజేపీ, మోడీ వ్యతిరేకతను పావుగా మలచుకునే ప్రయత్నం సాగిస్తున్నారు.అయితే అక్కడ ఢిల్లీలో బీజేపీ మోడీ ప్రత్యాన్మాయ స్థానం కోసం గట్టిపోటీ నడుస్తోంది. రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రివాల్, శరద్ పవార్ ... ఈ అందరినీ ఆడించే పొలిటికల్ రింగ్ మాస్టర్ ప్రశాంత్ కిశోర్ ఇలా ... చాలామంది ఎవరి ప్రయత్నాలలో వారున్నారు.  

అయినా, ఇతర విషయాలు ఎలాఉన్నా, ఉద్యమ వాసనలు లేని కొత్తతరం రాజకీయ వ్యూహంలో రాష్ట్రాన్ని వారసునుకి అప్పగించే సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి భావిస్తున్నారని అంటున్నారు. ఇటు పార్టీ పగ్గాలు, అటు ప్రభుత్వ పగ్గాలు కేటీఆర్ చేతిలో పెడితే, వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యర్ధుల కంటే కేటీఆర్ ముఖ్యమంత్రి హోదాలో ఒక మెట్టు పైన నిలపాలని, అందుకోసం అయినా కేటీఆర్’ను వెంటనే ముఖ్యమంత్రిని చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని అందుకోసమే మకాం దేల్హికి మార్చే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. అయితే, అన్నీ అనుకున్నట్లు జరుగుతయ్యా ... కేటీఅర్ పట్టాభిషేకానికి వినాయకుడు ఈసారైనా గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అనేది చూడవలసి వుందని అంటున్నారు.