అగ్రరాజ్యం అమెరికాను బెంబేలెత్తిస్తున్న ఇరాన్ యుద్థ వ్యూహం

posted on: Mar 18, 2026 10:45AM

మధ్యప్రాచ్యంలో యుద్ధ తీవ్రత రోజురోజుకూ తీవ్రతరమౌతోంది. అతి తేలిగ్గా ఇరాన్ ను అణిచేసి అధీనంలోకి తీసుకోగలమని భావించిన అమెరికాకు ఇరాన్ యుద్ధతంత్రాలు, యుద్ధ వ్యూహాలూ బెంబేలెత్తిస్తున్నాయి. ఇరాన్ వ్యూహాలకు ప్రపంచ దేశాలే విస్మయం చెందుతున్నాయి.    అమెరికా,  ఇజ్రాయెల్ సంయు  దాడులను తట్టుకుంటూ..  ఇరాన్  పటిష్టమైన రక్షణ వ్యవస్థతో ఎదురుదాడికి దిగుతోంది.  ఈ వ్యూహం కారణంగానే శత్రుదేశాల దాడులు తీవ్రంగా ఉన్నప్పటికీ ఇరాన్ సైన్యం నిలకడగా పోరాడుతోంది. అగ్రరాజ్యానికి చుక్కలు చూపుతోంది. మొజాయిక్ డిఫెన్స్  ఇరాన్ రక్షణ వ్యవస్థ చెక్కుచెదరని కోటగోడలా అగ్రరాజ్యం దాడులను తట్టుకుంటూనే ఎదురుదాడికి దిగుతోంది. 

అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఆపరేషన్ టైగర్స్ రోర్ పేర  ఇరాన్‌పై  చేసిన క్షిపణి, డ్రోన్ దాడులలో ఇరాన్ అత్యున్నత నేత అయతుల్లా ఖమేనీతో పాటు సుమారు 30 మందికి పైగా కీలక నాయకులు మరణించినా ఇరాన్ యుద్ధంలో వెనుకడుగు వేయలేదు. సాధారణంగా ఏ దేశంలోనైనా అగ్రనేతలు మరణిస్తే సైన్యం కుప్పకూలిపోతుంది. కానీ ఇరాన్  మాత్రం లొంగకుండా పోరాడుతోందంటే దాని వెనుక ఉన్నది  మొజాయిక్ డిఫెన్స్ వ్యూహమే అంటున్నారు.

ఈ మొజాయిక్  రక్షణ  వ్యవస్థకు ప్రధాన రూపకర్త ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్జీసీ) మాజీ చీఫ్ మహమ్మద్ అలీ జఫారీ. ఈ వ్యూహం ఏంటంటే.. దేశం మొత్తం ఒకే కమాండ్ కింద కాకుండా, 31 స్వయంప్రతిపత్తి కలిగిన చిన్న చిన్న విభాగాలుగా విడిపోయి దేనికది స్వతంత్రంగా పని చేస్తుంది. అంటే ఏ విభాగానికి ఆ విభాగం సొంతంగా నిర్ణయాలు తీసుకుంటుంది. దాడులు చేయడానికి అవసరమైన ఆయుధ సంపత్తి కూడా ఏ విభాగాని ఆ విభాగం వద్ద ఉంటుంది.

ఈ కారణంగానే  సుప్రీం మరణించినా ఇరాన్ ఇన్ని రోజులుగా యుద్ధాన్ని కొనసాగించగలుగుతోంది. అంతే కాదు.. శత్రుదేశాలను బెంబేలెత్తిస్తోంది. డిఫెన్స్ లో పడేస్తోంది. చైన్ సిస్టమ్ లా ఉండే  ఈ రక్షణ వ్యవస్థలో ఒక్కో లింక్ విడిపోయినా మిగిలినవి పోరాటం చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. ఇజ్రాయెల్ వైపు డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించడమే కాకుండా, సమీప దేశాల్లోని అమెరికా స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతూ అగ్రరాజ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...