Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అమెరికా అవాక్స్ విమానాన్ని పేల్చేసిన ఇరాన్
posted on: Mar 30, 2026 9:30AM

అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రస్థాయికి చేరింది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్‌పై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసి అమెరికా సైనిక ఆస్తులను ధ్వంసం చేసింది. ఈ దాడిలో అమెరికా వాయుసేనకు చెందిన అత్యంత కీలకమైన ఈ-3 సెంట్రీ అవాక్స్ నిఘా విమానం పూర్తిగా దెబ్బతింది. ఆ విషయాన్ని ఇరాన్ అధికారికంగా ప్రకటించి, ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా విడుదల చేసింది. అమెరికా అవాక్స్ విమానం ధ్వంసానికి సంబంధించిన ఫొటోలను ఇరాన్ అధికారిక మీడియా ప్రెస్ టీవీ విడుదల చేసింది.
శుక్రవారం (మార్చి 27) జరిగిన ఈ దాడిలో 6 బాలిస్టిక్ క్షిపణులు, 29 డ్రోన్లను ఇరాన్ విడుదల చేసింది. ఇరాన్ విడుదల చేసిన ఫొటోలలో ఈ-3 సెంట్రీ విమానం మధ్య భాగం కాలిపోయి, తల, తోక భాగాలు మాత్రమే మిగిలి ఉన్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. గగనతలం నుంచి నిఘా, శత్రువుల కదలికలను పసిగట్టడంలో ఈ విమానం అమెరికాకు అత్యంత కీలకం. ప్రస్తుతం అమెరికా వద్ద ఇలాంటివి కేవలం 17 విమానాలు మాత్రమే ఉండగా, వాటిలో ఒకటి ధ్వంసం కావడం అమెరికాకు భారీ నష్టమని అంటున్నారు.
ఈ దాడిలో కనీసం 10 మంది అమెరికా సైనికులు గాయపడ్డారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది. కాగా గాయపడిన అమెరికా సైనికుల సంఖ్య ఇంకా భారీగా ఉంటుందని తెలుస్తోంది. కాగా ఈ ఘటనకు సంబంధించి అమెరికా ఇప్పటి వరకూ అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు.






