Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఐపీఎల్ అందరికీ లాభాలు పంచితే.. వీరికి మాత్రం పీడకల అయ్యింది!
posted on: Mar 27, 2026 12:56PM

ప్రపంచ క్రికెట్ రంగంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీలకు కోట్ల రూపాయల ఆదాయాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఒక్కో ఐపీఎల్ ఫ్రాంఛైజీ విలువ కోట్ల రూపాయలు ఉంది. రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వంటి జట్లు 15 వేల నుంచి. 16 వేల కోట్ల రూపాయల విలువకు చేరుకున్నాయి. దాదాపు ఫ్రాంచైజీలన్నిటికీ ఐపీఎల్ అద్భుత ఆదాయాన్ని ఇచ్చింది. అయితే కొందరికి మాత్రం ఐపీఎల్ ప్రాంఛైజీల యజమానులు వివాదాలు, ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఐపీఎల్ అంటేనే వారికి ఒక పీడకలలా మారింది. ఐపీఎల్ ఆరంభంలో జట్లను కొనుగోలు చేసిన కొందరు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ఆ దురదృష్ట వంతులు ఎవరని చూస్తే మొట్టమొదట గుర్తుకు వచ్చే పేరు విజయ్ మాల్యా.
. 2008లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును సుమారు రూ. 450 కోట్లకు కొనుగోలు చేసిన మాల్యా.. ప్రస్తుతం పీకల్లోతు ఇబ్బందుల్లో కూరుకుపోయారు. బ్యాంకులను మోసం చేసిన కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. దేశం విడిచి పారిపోయి లండన్ లో ప్రవాస జీవితం గడుపుతున్నాడు. పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా దేశ ప్రజల దృష్టిలో నిలిచాడు.
ఇక ఆ తరువాత డక్కన్ క్రానికల్ అధినేత టి. వెంకట్రామిరెడ్డి. ఆయన అప్పట్లో హైదరాబాద్ ఫ్రాంచైజీని డెక్కన్ చార్జెస్ పేరుతో కొనుగోలు చేశారు. డెక్కన్ చార్జన్ ఐపీఎల్ రెండో సీజన్ విజేతగా నిలిచింది. గిల్ క్రిస్ట్, ఆండ్రూ సైమండ్స్ వంటి స్టార్ ప్లేయర్లతో కళకళలాడిన ఆ జట్టు నిర్వహణ లోపాల కారణంగా కోర్టు వివాదాల్లో చిక్కుకుంది. తరువాత కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఆ జట్టు ఉనికిలోనే లేకుండా పోయింది. టి.వెంకట్రామిరెడ్డి కూడా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. దీంతో ప్రస్తతం హైదరాబాద్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ చేతికి వెళ్లింది అలాగే , రాజస్థాన్ రాయల్స్ మాజీ వాటాదారులు శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాకూడా వివాదాల్లో చిక్కుకుని ఫ్రాంచైజీని వదులు కున్నారు. అయితే ఇలా నష్టపోయిన వారంతా వారి వారి స్వయంకృతాపరాధాల వల్లే నష్టపోయారు అని చెప్పాలి.
ఐపీఎల్ మాత్రం ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్ గా ఎదిగింది. యాజమాన్యాలు భారీ పెట్టుబడులతో లాభాల బాటలో పయనిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ వేల కోట్ల వ్యాపారం మరింత పుంజుకునే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. క్రికెట్ ఒక మతంగా మారిన ఇండియాలో ఐపీఎల్ కు ఆదరణ దినదిన ప్రవర్థమానంగా పెరుగుతూనే ఉంటుందని చెబుతున్నారు.



.webp)


