ఇన్సులిన్ వాడకంలో జాగ్రత్తలు

డయాబెటిస్ మందులతో కట్టడి చేయలేక పోతే డాక్టర్ సూచించిన విద్జంగా ఇంసూలిన్ 
తప్పనిసరిగా వాడాల్సిందే ఇంసూలిన్ ఇంజక్షన్న్ రూపంలోనే తీసుకోవాల్సి ఉంటుంది.
ఇన్సులిన్ ఎంత మోతాదులో తీసుకోవాలి అనేది ఆయా రోగుల లక్షణాలు వ్యక్తిగత అవసరాన్ని బట్టి 
ఉంటుంది.ఎంత మోతాదులో తీసుకోవాలి అన్న అంశాన్ని డాక్టర్స్ సూచిస్తారు. రక్తంలో చక్కెర శాతం పడిపోయి హై పో గ్లై సీమియా రాకుండా రాకుండా ఉండటానికి అంటే బ్లడ్ షుగర్ ను తగిన విధంగా నియంత్రణలో ఉంచుకోడం కోసం మే ఇంసూలిన్ ఇంజక్షన్ తీసుకుంటారు. వీటిలో మూడురకాల ఇంసూలిన్ లు ఉన్నాయి.1)సోలుబ్లె2 )ప్రోటామిన్3)ఇన్సులిన్ జింక్ సస్పెంసాస్  ఇంజక్షన్ ద్వారా ఇంసూలిన్ ని ప్రవేశ పెట్టినప్పుడు అది శరీర కాణా లలోకి గ్లూకోజ్  ద్వారా శరీరానికి అవసరమైన శక్తి అందే విధంగా చేస్తుంది.చాలా మందికి పేషంట్ లకు రోజుకు ఒక ఇంజక్షన్ సరిపోతుంది. ఇంకొందరికి రోజుకు రెండు తీవ్రతను బట్టి రోజుకు 3నుండి 4 డోసులు కూడా ఆహారానికి ముందు అవసర మౌతాయి.ఎన్నిసార్లు తీసుకోవాలి ఎంతతీసుకోవాలనే దానిని డాక్టర్స్ నిర్ధారిస్తారు. ఇన్సూలిన్

ఇన్జేక్షన్  వాడకంలో జాగ్రత్తలు-----

ఇన్సూలిన్ ని చల్లటి ప్రదేశంలో ఉంచాలి.రేఫ్రేజి రేటర్ లో మంచు తయారయ్యే డీప్ గ్రీజేర్ లో మాత్రం ఉంచకూడదు. ముఖ్యంగా పలుకులు,పలుకులు గా కనిపించే మకిలి పట్టిన ఇంసూలిన్ ను కొనవద్దు.
శరీరంలో ఇంజక్షన్ చేసే ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. ఇంజక్షన్ భోజనానికి  2౦-3౦ నిమిషాలు ముందు తీసుకోవాలి.ఇంజక్షన్ బాటిల్ పైన లేబుల్ ని చెక్ చేయాలి.ఇంసూలిన్ బోటిల్ 
పైన ఎక్స్ పైరీ డేట్ ను కూడా గమనించాలి. స్వంతంగా ఇంజక్షన్ చేసుకోడానికి నేర్చుకోవాలి.వివిధ సమయాలలో మీ బ్లడ్ షుగర్ ను పరీక్ష చేసుకునే విధానాని కూడా నేర్చుకోవాలి. మీరు తీసుకునే  ఇన్సూలిన్ డోసేజ్ షెడ్యుల్ ని బట్టి మీరు ఎప్పుడు భోజనం చేయాలి,ఇతరా లేదా శారీరక పనులు మొదలైన వాటి మధ్య సమన్వయం ఉండాలి.ఒక చిన్న డైరీ ని రాయడం అలవాటు చేసుకోవాలి అందులోమీరు ఇంజక్షన్ చేసుకున్న తేది,టైం,బ్లడ్ గ్లూకోజ్,ఎమన్నా రీయక్షన్ వచ్చిందా అయితే అది ఎ రకమైన రియాక్షన్ గురించిన వివరాలు ఉండడం మంచిది.

ఇంజక్షన్ ని ఎలా చేయాలి------

మీరు తీసుకునే పరిణామం లో డాక్టర్ సూచించిన విధంగా సిరంజ్ లోకి తీసుకోవాలి. ఇంజక్షన్ ని మీ శరీరంలో కండరం లోకి లేక కొవ్వు ఉన్న భాగానికి ఇంజక్ట్ చేసుకోవాలి. సామాన్యంగా కొవ్వు ఉన్న భాగాలలో కి చేసుకోడం సులువుగా ఉంటుంది. చాలా మంది భుజాలు, తొడలు, పొత్తికడుపు, పిర్రలు, మొదలైన భాగాలలో చేసుకోవాలి ఆభాగం చర్మం  మొద్దు బారిపోకుండా ఉండడానికి ఎప్పటికప్పుడు ఇంజక్షన్ చేసే ప్రాంతాన్ని మ్సరుస్తూ ఉండాలి. ఇంజక్షన్ చేయబోయేభాగాన ఆల్కాహాల్ లో ముంచిన దూదితో శుభ్రం చేయాలి. బొటన వేలు మిగతా వ్రేళ్ళ మధ్య ఇంజక్షన్ చేయబోయే భాగాన్ని పట్టుకుని 
పెన్సిల్ ను పట్టుకునే విధంగా సిరంజిని రెండు చేతి వేళ్ళ మధ్య పట్టుకుని సూదిని నిటారుగా చర్మంలోకి గుచ్చాలి. తర్వాత సిరంజి పలున్గేర్ ని కిందకి నొక్కాలి ఇప్పుడు వెల్ల మధ్యా పట్టుకున్న చర్మాన్ని వదిలేసి సిరంజిని పైకి లాగాలి.