స‌ర్వేలో జ‌గ‌న్ పాపులారిటీ గ‌ల్లంతు.. ఇండియా టుడే నివేద‌క‌తో వైసీపీలో వ‌ణుకు..

మూడ్ ఆఫ్ ది నేష‌న్ పేరుతో ఇండియా టుడే స‌ర్వే. గ‌తంలో చేసిన స‌ర్వేలోనే జ‌గ‌న్ గ్రాఫ్ దారుణంగా ప‌త‌న‌మైంది. లేటెస్ట్‌గా మ‌రో స‌ర్వే కూడా చేసింది ఇండియా టుడే. మ‌న రాష్ట్రానికి చెందిన మీడియా సంస్థ కాదు కాబ‌ట్టి.. ఎల్లో మీడియా అనే అబాంఢాలు వేసే అవ‌కాశ‌మే లేదు. సో.. ఈ స‌ర్వే నివేదిక కాస్త రియ‌లిస్టిక్‌గా ఉంటుంద‌ని న‌మ్మొచ్చు. పోల్‌లో ఏపీకి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. 

ఇండియా టుడే సర్వేలో.. సోదిలో కూడా లేకుండా పోయారు సీఎం జ‌గ‌న్‌. ప్ర‌జ‌లు జ‌గ‌న్‌కు అస‌లేమాత్రం ప్రాధాన్యం ఇవ్వ‌ట్లేద‌ని తేలిపోయింది. సీఎం జగన్ ఓ జాబితాలో అసలు చోటే ద‌క్క‌లేదు. 

ఏపీలోని ఓటర్లతో నిర్వహించిన పోల్‌ను.. మోస్ట్ పాపులస్ సీఎం కేటగిరీగా ఇండియా టుడే వెల్ల‌డించింది. ఈ కేటగిరిలో ఆయా రాష్ట్రాల ఓటర్లకు ఫోన్లు చేసి.. మీ సీఎం పని తీరు ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. ఇందులో సీఎం జగన్‌కు చోటు దక్కలేదు. అసలు తాము నిర్ణయించుకున్న బెంచ్ మార్క్ కు ఆయన పాపులారిటీ రీచ్ కాలేద‌ని ఇండియాడు టుడే స్ప‌ష్టం చేసింది. అంటే.. మామూలు బాష‌లో చెప్పాలంటే.. 100కు 35 మార్కులు వ‌స్తే పాస్ అయితే.. మ‌న జ‌గ‌న‌న్న‌కు క‌నీసం ఆ పాస్ మార్కులు కూడా రాలేద‌న్న‌ట్టు.  

గ‌తేడాది ఇండియా టుడే చేసిన‌.. మూడ్ ఆఫ్ ది నేష‌న్ స‌ర్వేలో జ‌గ‌న్ 12వ ర్యాంక్‌లో ఉన్నారు. అంత‌కుముందు ఏడాది టాప్ 5లో. అంటే, వ‌రుస ఏడాదుల్లో జ‌గ‌న్ ప‌ర‌ప‌తి దారుణంగా ప‌తనమైందని తెలుస్తోంది. టాప్ 5 నుంచి.. 12 ర్యాంకుకు ప‌డిపోగా.. ఈసారి స‌ర్వేలో ఏకంగా ఏ స్థానం ద‌క్క‌కుండా.. అస‌లు పాపులారిటీ కేట‌గిరిలోనే లేకుండా పోవ‌డం ఆసక్తికరం. జ‌గ‌న‌న్న ప‌త‌నానికి ఇండియా టుడే స‌ర్వే ఓ నిద‌ర్శ‌నం అంటున్నారు.

ఇదే స‌ర్వేలో.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పనితీరును బెంగాల్ ప్రజలు 69.9 శాతం స్వాగతించారు. ఆ తర్వాత స్టాలిన్, ఉద్దవ్ ధాకరే, పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, హిమంత భిశ్వ శర్మ, భూపేష్ బాఘెల్, అశోక్ గెహ్లాట్ ఉన్నారు. వీరంతా తమ తమ రాష్ట్రాల ప్రజల్లో కనీసం 44.9 శాతం ప్రజల ఆమోదం పొందారు. మిగతా సీఎంలు ఎవరూ ఆ స్థాయి వరకూ రాలేదు. ఈ జాబితాలో సీఎం జగన్ లేనే లేరు. ఆయన ఓట్లు వేసే ఏపీ ప్రజల అభిమానాన్ని చూరగొనలేకపోయారు. ఇక, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సైతం పాపులారిటీ కేట‌గిరిలో ఎలాంటి ర్యాంక్ ద‌క్క‌లేదు. మంచి ఫ్రెండ్స్ అయిన‌.. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు.. దొందు దొందేన‌ని.. ఇండియా టుడే- మూడ్ ఆఫ్ ది నేష‌న్ స‌ర్వేతో మ‌రోసారి తేలిపోయింది. జ‌గ‌న్‌, కేసీఆర్‌లానే.. దేశంలో మోస్ట్ పాపులర్ సీఎం అయిన యోగి సైతం.. త‌న‌ సొంత రాష్ట్రం యూపీలో మాత్రం కనీస ఆదరణ దక్కించుకోలేకపోయారు. ఇలా.. ప్ర‌జావ్య‌తిరేక పాల‌న అందిస్తున్న ముఖ్య‌మంత్రులంద‌రికీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు బుద్ది చెప్ప‌నున్నార‌నే దానికి ఇండియా టుడే స‌ర్వే ఓ ముంద‌స్తు సూచ‌న‌.