Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఈ సేవా కేంద్రాల్లో సర్వీసు చార్జీల పెంపు.. నేటి నుంచే అమలు
posted on: Apr 1, 2026 5:20PM

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మీసేవ కేంద్రాల్లో వివిధ ప్రభుత్వ సర్వీసులకు సంబంధించిన యూజర్ చార్జీలను పెంచుతూ రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని సేవలపై సుమారు 50 శాతం వరకూ ధరలు పెంచారు. ఆదాయ, కుల, స్థానికత వంటి సర్టిఫికెట్ల జారీకి యూజర్ చార్జీలుగా రూ.80 చేశారు. జనన ధ్రువీకరణ పత్రం ప్రింట్ ఇవ్వడానికి రుసుం రూ.62 చేశారు.
ఈ పెంచిన యూజర్ చార్జీలు కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజైన ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తాయని ఆ ఉత్తర్వులు పేర్కొన్నాయి. మీసేవ కేంద్రాల నిర్వహణ ఖర్చులు పెరగడం, గత కొన్నేళ్లుగా చార్జీల సవరణ జరగకపోవడంతో మీసేవ నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.






