Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సృష్టి సరోగసీ కేసులో ఈడీ దూకుడు
posted on: Mar 10, 2026 7:41PM
.webp)
హైదరాబాద్‌లో వెలుగు చూసిన భారీ అక్రమ సరోగసీ రాకెట్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న డాక్టర్ పచ్చిపల్లి అట్లూరి నమ్రత కు చెందిన భారీ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాత్కాలికంగా అటాచ్ చేసింది. అక్రమంగా సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసిన ఆస్తులపై చర్యలు తీసుకుంటూ సుమారు రూ.29.76 కోట్ల విలువైన 50 స్థిరాస్తులను పీఎంఎల్ఏ చట్టం కింద స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
అయితే ఈ ఆస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు రూ.50 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.ఈ అటాచ్ చేసిన ఆస్తుల్లో భూములు, ఫ్లాట్లు, అలాగే ఆస్పత్రి భవ నం కూడా ఉన్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఇవన్నీ డాక్టర్ నమ్రతతో పాటు ఆమె కుమారుల పేర్లపై నమోదు చేయబడి నట్లు దర్యాప్తులో బయట పడింది. ఈడి దర్యాప్తు ప్రకారం, “యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్” పేరుతో డాక్టర్ నమ్రత ఒక విస్తృత స్థాయి అక్రమ సరోగసీ నెట్‌వర్క్‌ను నిర్వహించినట్లు గుర్తించారు. సంతానం లేని దంపతులకు సరోగసీ ద్వారా బిడ్డను అందిస్తామని చెప్పి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ వ్యవహారంపై హైదరాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్‌లో మోసం, కుట్ర, అక్రమ సరోగసీ, శిశు అక్రమ రవాణా వంటి పలు కేసులు నమోదు కావడంతో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. విచారణలో బయటపడిన వివరాలు తీవ్ర ఆందోళన కలిగించేలా ఉన్నాయి. సరోగసీ ప్రక్రియ నిజమై నదిగా కనిపించేలా దంప తుల గ్యామీట్స్ సేకరించి నప్పటికీ, వాస్తవానికి పుట్టిన శిశువులు పేద మరియు బలహీన కుటుంబాల నుంచి తీసుకువచ్చినవేనని ఈడీ గుర్తించింది. ఏజెంట్లు, సబ్ ఏజెంట్ల ద్వారా పేద గర్భిణీ లను గుర్తించి డబ్బులతో ప్రలోభపెట్టి పుట్టిన వెంటనే తమ పిల్లలను అప్పగిం చేందుకు ఒప్పించేవారని దర్యాప్తులో తేలింది.
ఈ క్రమంలో ఆడ శిశువుకు సుమారు రూ.3.5 లక్షలు, మగ శిశువుకు రూ.4.5 లక్షల వరకు చెల్లించినట్లు అధికారులు గుర్తించారు.కొన్ని సందర్భాల్లో గిరిజన తండాల నుంచి కూడా పిల్లలను కొనుగోలు చేసి, వాటిని సరోగసీ ద్వారా పుట్టిన శిశువులుగా చూపించి సంతానం లేని దంపతులకు అప్పగించి నట్లు విచారణలో వెల్లడైంది. అంతేకాకుండా, మున్సిపల్ అధికారులకు పంపే జనన ధృవపత్రాల్లో అసలు తల్లి దండ్రుల వివరాలను తొలగించి, పిల్లలను పొందిన దంపతుల పేర్లను తల్లిదం డ్రులుగా నమోదు చేసేలా నకిలీ పత్రాలు తయారు చేసినట్లు ఈడీ గుర్తించింది.
దర్యాప్తులో మరో కీలక విషయం బయటపడింది. డాక్టర్ నమ్రత 2014 నుంచే ఈ అక్రమ సరోగసీ కార్యక లాపాలను కొనసాగిస్తు న్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆమెపై పలు కేసులు నమోదవడం, మెడికల్ లైసెన్స్ రద్దు కావ డం జరిగినప్పటికీ కూడా ఈ వ్యవహారం కొనసాగించి నట్లు వెల్లడైంది. సికింద్రాబాద్‌లో ఉన్న ఆస్పత్రి లైసెన్స్ రద్దు అయిన తర్వాత విశాఖపట్నంలోని ఆస్పత్రిలో డెలివరీలు నిర్వహించినట్లు ఈడీ గుర్తించింది. సంతానం లేని దంపతుల నుంచి చెక్కులు, నగదు రూపంలో భారీ మొత్తాలు వసూలు చేసి నట్లు బ్యాంక్ లావాదేవీల విశ్లేషణలో బయటపడింది. అందులో కొంత మొత్తాన్ని ఏజెంట్లు, సబ్‌ఏజెంట్లకు కమిషన్‌గా చెల్లించగా, మరో భాగాన్ని శిశువుల అసలు తల్లిదండ్రులకు ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ అక్రమ లావాదేవీల ద్వారా వందల కోట్ల రూపాయలు సంపాదిం చినట్లు ఈడీ అనుమాని స్తోంది.పీఎంఎల్ఏ చట్టం కింద ఈడీ అధికారులు డాక్టర్ నమ్రతను 2026 ఫిబ్రవరి 12న అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె న్యాయపర మైన కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ అక్రమ సరోగసీ రాకెట్ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. అధికా రులు మరిన్ని ఆధారాలను సేకరిస్తూ, ఈ నెట్‌వర్క్‌కు సంబంధించి ఇతర వ్యక్తుల పాత్రను కూడా పరిశీలిస్తు న్నట్లు వెల్లడించారు.


.webp)



