Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...షేక్ ల కామదాహానికి షేకైపోతోన్న హైద్రాబాదీ అమ్మాయిల జీవితాలు!
posted on: Aug 17, 2017 4:35PM

హైద్రాబాద్… ఈ పేరు తెలుగు వారందరికీ గర్వకారణం. చంద్రబాబు నాయుడు దీన్ని సైబర్ సిటీ అంటే… కేసీఆర్ ఏకంగా విశ్వనగరం అంటారు! కాని, ఒకవైపు సైబర్ టవర్స్ కళకళలు ఉట్టిపడే హైద్రాబాద్ కు మరో కోణమూ వుంది! అదే ఓల్డ్ సీటీ మైనార్టీ తీరని మైనార్టీ అమ్మాయిల వ్యథలు!
ప్రపంచంలో అద్బుతమైన బిర్యానీ కావాలి అంటే ఎవరైనా హైద్రాబాద్ కు వస్తారు! కాని, విషాదం ఏంటంటే… సౌదీ, ఒమన్, ఇతర మధ్య ప్రాచ్య దేశాల సంపన్నులైన ముసలివారు కూడా హైద్రాబాద్ పరుగెత్తుకొస్తుంటారు. వాళ్ల రాకకి కారణం బిర్యానీ కాదు… జవానీ! అవును… ఇంకా మైనార్టీ కూడా నిండని ఓల్డ్ సిటీ అమ్మాయిల్ని గడ్డాలు నెరిసిన, తల మీద వెంట్రుకలు రాలిపోయిన ముసలి కామాంధులు దర్జాగా నిఖా చేసుకుంటారు. తమ దేశాలకు తీసుకెళతారు. అక్కడ నరకం చూపిస్తారు. అదృష్టం బావుంటే సదరు అమ్మాయి జృవచ్ఛవంలా భారతదేశం తిరిగి వస్తుంది. లేదంటే… దేశం కాని దేశంలో ఆ అభాగ్య హైద్రాబాదీ అమ్మాయి బతుకు ఏమైపోయిందో ఎవరికీ తెలియదు!
దేశంలోనే అద్బుతంగా ఎదుగుతోన్న సైబర్ హబ్ అయిన హైద్రాబాద్ లో కేవలం కొన్ని లక్షలు గుమ్మరిస్తే అమ్మాయిలు దొరుకుతారని చెప్పాల్సి రావటం దురదృష్టకరం. కాని, తాజాగా వెలుగు చూసిన మరో ఉదంతం సాక్షిగా ఇక్కడ ఇదంతా మామూలైపోయిందంటున్నారు నిపుణులు. వివిధ ఇస్లామిక్ దేశాల్లోంచి డబ్బున్న షేక్ లు ఇక్కడకి రావటం. ఇక్కడి నిరుపేద ముస్లిమ్ అమ్మాయిల కుటుంబాల్ని కనిపెట్టి డబ్బు ఎర చూపటం. ఆ తరువాత అభం శుభం ఎరుగని అమ్మాయిల్ని పెళ్లిల్లు చేసుకోటం చకచకా జరిగిపోతోంది. ఓ పదహారేళ్ల అమ్మాయి విషయంలో మరోసారి పాతబస్తీలో అదే జరిగింది. స్వంత తల్లి కూడా అంగీకరించకున్నా ఓ ఎనిమిదో తరగతి చదువుతున్న అమ్మాయిని ఒమన్ నుంచి వచ్చిన 65ఏళ్ల ముసలివాడు పెళ్లి చేసుకున్నాడు. అందుకు ప్రతిఫలంగా 5లక్షలు అమ్మాయి బంధువు ఒకామెకు ఇచ్చాడు. అంతే కాదు, ప్రస్తుతం మైనార్టీ కూడా తీరని ఆ అమ్మాయి ఒమన్ లో నలిగిపోతోంది. ముసలి భర్త ఆమెను తన దేశానికి తీసుకెళ్లిపోయాడు. అక్కడ్నుంచి ఫోన్ లో మాట్లాడిన అమ్మాయి రక్షించమంటూ , లేదంటే చచ్చిపోతానని ఫోన్ లో ఏడుస్తోంది!
అరవై దాటిన ముసలివాడికి 16ఏళ్ల విద్యార్థినిని అంటగట్టిన ఉదంతం కొత్తదేం కాదు. ఇలా పోలీస్ స్టేషన్ కు చేరుతోన్న కేసులు హైద్రాబాద్ లో బోలెడు. కొందర్ని అగ్రిమెంట్ ప్రకారం విదేశీ సంపన్న షేక్ లు ఇక్కడే పెళ్లి చేసుకుని వాడుకుని వదిలేసి వెళుతుంటారు. మరి కొందర్ని తాజా కేసులో లాగా తమ దేశానికి తీసుకెళ్లిపోతుంటారు. ఇంత జరుగుతున్నా ఈ విషాదకరమైన పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం ప్రభుత్వాలు, పోలీసులు చేయటం లేదు. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలి.
ఓ పదహారేళ్ల అమ్మాయిని అరవై ఏళ్ల వృద్దుడు పెళ్లి చేసుకుని తన దేశానికి తరలించుకుపోవటం … ఆ అమ్మాయి వ్యక్తిగత సమస్య కాదు! హైద్రాబాద్ ఇమేజ్ కే కళంకం తెచ్చే దారుణం. ఎందుకంటే, పదే పదే ఇలాంటి ముసలి షేక్ ల కామ దాహం ఓల్డ్ సీటీలో బయటపడుతోంది! దీన్ని ఖచ్చితంగా రూపుమాపాల్సిందే…






