Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మెట్రోలో టిక్కెట్లు ఎలా కొనాలి..? ఎలా ఎక్కాలి
posted on: Nov 28, 2017 2:18PM
.gif)
ప్రతిష్టాత్మక హైదరాబాద్ మెట్రో రైలు మరికొద్ది గంటల్లో కూత పెట్టనుంది. మెట్రో ఎప్పుడు పూర్తవుతుందా..? ఎప్పుడెప్పుడు ఎక్కుదామా..? అని సగటు హైదరాబాదీ ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. అయతే సాధారణ రైల్వే స్టేషన్లలో లాగా మెట్రో స్టేషన్‌లో ఎలా పడితే అలా ప్రవర్తిస్తే కుదరదు.. ఇక్కడ కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ఎల్ అండ్ టీ సంస్థ ప్రయాణీకుల అవగాహన కోసం యూజర్ గైడ్‌ను రిలీజ్ చేసింది. ప్యాసెంజర్స్ వీటిని ఫాలో అవుతూ సురక్షితంగా తమ గమ్య స్థానాలకు చేరుకోవచ్చని ఎల్‌అండ్‌టీ అధికారులు తెలిపారు.
* ప్రతి మెట్రో స్టేషన్‌కు రోడ్డు లెవల్‌లో ఎలివేటర్లు, లిఫ్టులు, మెట్లు, ఎస్కలేటర్లుంటాయి.
* ఎస్కలేటర్ ఎక్కిన తర్వాత దానికి ఎడమవైపే నిలబడాలి.
* రెండవ అంతస్థు మధ్య భాగంలో టికెట్లు/టోకెన్లను కొనుగోలు చేయాలి
* టికెట్ ఆఫీస్ మెషిన్ ద్వారా కూడా టికెట్లు/టోకెన్లను కొనుగోలు చేయవచ్చు
* టికెట్లు, టోకెన్లు గోల లేకుండా స్మార్ట్‌కార్డ్ కొనుగోలు చేయడం బెస్ట్ ఛాయిస్
* ఫ్లాట్ ఫాం మీదకు వెళ్లే సమయంలోనూ.. ఎగ్జిట్ గేట్ గుండా బయటికి వెళ్లే సమయంలోనూ మీ వద్దనున్న స్మార్ట్‌కార్డ్, టికెట్, టోకెన్ అక్కడి గేట్‌కి టచ్ చేస్తేనే డోర్స్ ఓపెన్ అవుతాయి.
* మెట్రోలో పది కేజీల లగేజీని మాత్రమే అనుమతిస్తారు.
* ప్రతి స్టేషన్‌లో ఎక్స్‌రే బ్యాగేజ్ స్కానర్, డీఎఫ్ఎండీ డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్‌ల వద్ద చెకింగ్ చేయించాలి.
* ఆ బ్యాగులు కూడా 60 సెం.మీ పొడవు, 45 సెం.మీ వెడల్పు, 25 సెం.మీ ఎత్తున్న బ్యాగులనే వినియోగించాలి.
* ఫ్లాట్‌ఫామ్‌పై పసుపు రంగు గీతకు వెనకాలే నిలబడి రైలు కోసం వేచి చూడాలి.
* టికెట్ కొనుగోలు చేసిన 29 నిమిషాల్లోగా ఫ్లాట్‌ఫామ్ పైకి చేరుకోవాలి. అరగంట దాటితే మరో టికెట్‌ను కొనుగోలు చేయాలి.


.jpg)



