Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కాదేదీ... మంచు లక్ష్మికి అనర్హం...
posted on: Jul 20, 2017 5:15PM
.jpg)
మన మంచు లక్ష్మి అక్కాయ్ కి ... సినిమాలు, రాజకీయాలు అనే తేడాలేం ఉండవ్. ఎక్కడైనా తన వాణిని వినిపించగలదు. ఏ విషయంపైనైనా... నిర్మొహమాటంగా స్పందించగలదు. అందుకే... . ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ‘మంచు’ అక్కయ్య.
రీసెంట్ గా తెలంగాణ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారాకరామారావుకీ, కాంగ్రెస్ జాతీయ నాయకుడు దిగ్విజయ్ సింగ్ కు ట్విట్టర్ వేదికగా యుద్ధం జరిగితే... పానకంలో పుడకలా వారిద్దరి మధ్య ‘నేనూ ఉన్నాను’ అన్నట్లు ఓ ట్వీట్ ట్వీటింది మంచు లక్ష్మి. సినిమా రంగానికి చెందిన మంచువారమ్మాయికి ఈ రాజకీయాల గోలేందుకు? అని అందరూ ఒకటే చెవులు కొరక్కుంటున్నారు. ఇక విషయంలొకెళ్తే...
ఈ మధ్య హైదరాబాద్లో మొదలైన డ్రగ్స్ కంపు దేశం మొత్తం వ్యాపించింది. దాంతో.. దేశవ్యాప్తంగా దిల్లీ నుంచి కూడా ఎవరికి తోచినట్టు వాళ్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంకో వంద అడుగులు ముందుకేస్తూ... కాంగ్రెస్ జాతీయ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్ వేదికగా కేసీయార్ కుటుంబంపై నిప్పులు చెరిగారు. ‘అసలు ఈ డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో కేసీయార్ కుమారుడు కేటీయార్ కూడా ఉన్నాడు’అని భారీ స్టేట్మెంట్ కూడా ఇచ్చేశాడు.
ఇక కేటీయార్ ఊరుకుంటాడా? అసలే యువకుడు... తను కూడా ట్విట్టర్లో చెలరేగిపోయాడు. ‘దిగ్విజయ్ విచక్షణ కోల్పోయారు. ఆయన విశ్రాంతి తీసుకునే సమయం ఆసన్నమైంది. వయసుకు తగ్గ కామెంట్లు చేస్తే మంచింది. ఇప్పటికైనా‘తెలంగాణ’ అనే పదాన్న రాయడం నేర్చకున్నందుకు ధన్యవాదాలు’ తనదైన శైలిలో దిగ్విజయ్ కి కౌంటర్ ఇచ్చేశాడు. ఇదంతా బాగానే ఉంది. మరి మధ్యలో మంచు లక్ష్మి పాత్ర ఏంటి? అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా.
కేటీయార్ ట్విట్టర్ లో కామెంట్ పెట్టీ పెట్టగానే... వెంటనే మంచు లక్ష్మి ట్విట్టర్ లో రెస్పాండ్ అయ్యారు. ‘కరెక్ట్ చెప్పావ్ రామ్. ఆయన విచక్షణ ఎప్పుడో కోల్పోయాడు’మెసేజ్ పోస్ట్ చేశారు. ఇక ఈ మెసేజ్ చూసిన కొందరు కాంగ్రెస్ లీడర్లు... ‘ఇదేంటయ్యా... తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీయార్ కుటుంబంపై అంతెత్తు లేచింది కదా ఈ అమ్మాయి. మళ్లీ ఇప్పుడు మన వాళ్లను తిడుతుందేంటి? ’అని ఆశ్చర్యానికి లోనవుతున్నారట. తెలివితేటలు ఎవరి సొంతం చెప్పండి. పైగా మంచు లక్ష్మి అక్కయ్య అంటే మామూలు విషయమా?






