Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మనది 131వ ర్యాంక్! అయినా మురిసిపోవాల్సిందే! ఎందుకంటే...
posted on: Mar 22, 2017 2:38PM
వాజ్ పేయ్ ప్రధానిగా వున్నప్పుడు ఒక స్లోగన్ అదరగొట్టేసింది. అదే.. ఇండియా షైనింగ్! అంటే... భారత్ వెలిగిపోతోంది అని! కాని, భారతదేశం వెలిగిపోతోంది అంటే ఎందుకోగాని... జనం నమ్మలేదు. యూపీఏకు అధికారం ఇచ్చారు. పదేళ్ల తరవాత మోదీ వచ్చేదాకా మన్మోహన్ సింగ్ ఇండియాను డెవలప్ మెంట్ రోడ్ పై ముందుకు నడిపారు. ఇక ఇప్పుడు ఇండియా ఫస్ట్ నినాదంతో నమో నడిపిస్తున్నారు! ఇంతకీ, మనమసలు బీజేపి వారు చెబుతున్నట్టు అభివృద్ధి చెందుతున్నామా? కాంగ్రెస్ , కమ్యూనిస్టులు, ఇతర పార్టీలు గగ్గోలు పెడుతున్నట్టు దిగజారిపోతున్నామా? ఏం జరుగుతోంది?
1990లలో మన దేశం దివాలా తీసే పరిస్థితి దాపురించింది. కనీసం గవర్నమెంట్ ఉద్యోగుల జీతాలు కూడా ఇవ్వలేని స్థితి వచ్చింది. ఆర్బీఐ వద్ద వున్న బంగారు నిల్వలు ఇతర దేశాల వద్ద కుదవకు పెట్టుకోవాల్సి వచ్చింది! అటువంటి విషమ పరిస్థితుల్లో పీవీ నరసింహా రావు నెహ్రు కాలం నుంచీ వచ్చిన సోషలిస్టు గేట్లన్నీ ఎత్తేశారు! ఫ్రీగా ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్ ని దేశంలోనికి రానిచ్చారు. దాని ఫలితమే ఇవాళ్ల మనం చవి చూస్తోన్న కార్పోరేట్ అభివృద్ధి ఫలాలు! ఇందులో చాలా మందికి నచ్చని చాలా చాలా లోపాలుండవచ్చు! కాని, లోపాలతో అయినా ఈ మోడల్ ఆఫ్ డెవలప్ మెంట్ వంద కోట్లు దాటిన భారతీయులకి అన్నం పెడుతోంది! మెల్ల మెల్లగా అయినా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతోంది! అందుకు సాక్ష్యం తాజాగా విడుదలైన మానవ అభివృద్ది సూచీనే!
హ్యూమన్ డెవలప్ మెంట్ ఇండెక్స్, అంటే, హెచ్ డీఐ... మొత్తం 188 దేశాలకు ప్రకటించారు. 25ఏళ్ల కింద ప్రకటించిన ఈ సూచీలో భారతదేశం ర్యాంకింగ్ దారుణంగా వుండేది. అప్పట్లో మన దేశం 'లో' క్యాటగిరీలోకి వచ్చేది. అంటే మానవ అబివృద్ధి అత్యంత తక్కువ స్థాయిలో వుండేదని అర్థం. 1990ల నుంచీ ఇప్పటి వరకూ భారత్ అవలంబిస్తూ వచ్చిన ఆర్దిక సంస్కరణల వల్ల మనం ఇప్పుడు 131వ ర్యాంక్ సాధించగలిగాం. దీని వల్ల 'మిడియం' క్యాటగిరీలోకి చేరాం! ఒక అభివృద్ధి చెందుతోన్న సువిశాల దేశంగా ఇది గొప్ప విజయమే! పైగా విపరీతమైన జనాభా వున్నప్పటికీ తట్టుకుని ముందడుగు వేస్తున్నాం!
1990లలో 0.428 స్కోర్ ఇండియాకు దక్కగా ఇప్పుడది 0.624కి చేరింది. అంటే, 45.8శాతం అభివృద్ధి అన్నమాట! మనకంటే బెటర్ పొజీషన్లో చైనా అభివృద్ది శాతం వుంది. 48శాతం అభివృద్ధి బీజింగ్ నమోదు చేసింది. కాని, అక్కడ ఆర్దిక సంస్కరణలు మనకంటే చాలా ముందు మొదలయ్యాయి. అలాగే, ఆశ్చర్యకరంగా మనం ఊహించని దేశాలైన శ్రీలంక, మాల్దీవ్స్ మనకంటే ముందున్నాయి మానవ అభివృద్ధిలో! ఇక బంగ్లాదేశ్, పాకిస్తాన్ మాత్రం 139, 147 ర్యాంకులతో ఇండియా కంటే వెనుకబడ్డాయి!
హ్యూమన్ డవలప్ మెంట్ ఇండెక్స్ అంటే కేవలం ఆర్దిక పెరుగుదల, జీడీపీ అభివృద్ధి మాత్రమే కాదు. ఒక్కో దేశంలో సగటున జనాలు ఎంత కాలం బతుకుతున్నారు, ఎంత కాలం కనీసం విద్యాభ్యాసం చేస్తున్నారు లాంటి అనేక విషయాలు పరిగణలోకి తీసుకుంటారు. అలా చూసినప్పుడు మన దేశం ఆరోగ్య, విద్యా రంగాల్లాంటి వాటిల్లో గణనీయమైన అభివృద్ది సాధించింది. కాని, అదే సమయంలో మనకు ఆందోళన కలిగించే అంశం కూడా తాజా రిపోర్ట్ లో బయటపడింది. మొత్తానికి మొత్తంగా భారతదేశం అభివృద్ధి దిశగా సాగిపోతోన్నా అంతర్గతంగా అసమానతలు రోజు రోజుకి పెరిపోతున్నాయట! దేశంలోని వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల మధ్య తేడాలు గతంలో కన్నా ఇప్పుడు భారీగా పెరిగాయని చెబుతోంది నివేదిక. దాదాపు 27శాతానికి పైగానే ప్రాంతీయ అసమానతలు పెరిగాయట! దీనిపై మన కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు తీక్షణ దృష్టి పెడితే భారత్ ఖచ్చితంగా మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. సమతుల్యమైన వికాసం సాధ్యమవుతుంది! ఇన్ ఫ్యాక్ట్ మన ప్రధాని మోదీ నినాదం కూడా అదే... సబ్ కా సాత్ సబ్ కా వికాస్! అయితే, ఆచరణలో దాన్ని అమలు చేయటమే అసలు సాహసం!






