Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఈ లక్షణాలను బట్టి మనిషి నిజమైన స్వభావాన్ని కనిపెట్టవచ్చు..!
posted on: Feb 25, 2026 1:50PM

నేటి కాలంలో ప్రజల ఉద్దేశాలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. బయటకు ఒకటి చెబుతారు, కానీ తరువాత వారు చేసేది మరొకటి ఉంటుంది. దీని వలన ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడం కష్టమవుతుంది. కొందరు ఇలాంటి సందిగ్ధంలో ఎవరినీ నమ్మకుండా ఒంటరిగా ఉండిపోతారు, మరికొందరు అందరూ మంచోళ్లే అనే అబిప్రాయంతో ఏదో ఒక రోజు ఇతరుల స్వార్థానికి బలి అయిపోతారు. కానీ ఎవరినీ నమ్మకుండా ఉంటే ఏదో ఒకరోజు తమ మీద తాము నమ్మకం కోల్పోయే పరిస్థితికి చేరుకుంటారు. అలాగని అందరినీ గుడ్డిగా కూడా నమ్మకూడదు. దీనికి పరిష్కారమే ఆచార్య చాణక్యుడు చెప్పిన మార్గం. మనిషిలో ఉండే కొన్ని లక్షణాల ఆధారంగా ఆ మనిషి వ్యక్తిత్వాన్ని నిర్ణయించవచ్చట. ఇంతకూ ఆ లక్షణాలు ఏంటో తెలుసుకుంటే..
స్వార్థం..
ఒక వ్యక్తిని అర్థం చేసుకోవడానికి మంచి సమయం ఏదంటే.. వారు స్వార్థపరులుగా ఉన్న సమయమే.. ప్రతిఫలం కోసం, ప్రశంసల కోసం ఆశించకుండా, వ్యక్తిగత లాభం లేని సమయాల్లో, సందర్భాలలో వ్యక్తి నిజమైన స్వభావం బయటపడుతుంది. సంకోచం లేకుండా తమ బాధ్యతలను నెరవేర్చేవారు, నష్టాన్ని ఎదుర్కొన్నప్పుడు కూడా నిజాయితీగా ఉండేవారు, వారి నిజమైన ఉద్దేశాలను బయటపెడతారు. ఒకరి మంచితనం లాభానికి మాత్రమే పరిమితం అయితే, అదే వారి నిజమైన స్వభావం. ఇది వారి స్వార్థం అవుతుంది. అలాంటి వ్యక్తులు స్వార్థపరులు.
బాధ్యత..
వాయిదా వేయడం అనేది చాలామందిలో కనిపించే గుణం. మరీ ముఖ్యంగా ఎదుటివారికి ఏదైనా మాట ఇచ్చి, తప్పడం అనేది బాధ్యతను విస్మరించడం అవుతుంది. స్పష్టమైన సమాధానాలు ఇవ్వకపోవడం లేదా సరైన సమాధానాలు చెప్పకుండా ఉండేందుకు కావాలని గొడవలు క్రియేట్ చేయడం అనేది వారి మనసులో వేరే ఉద్దేశ్యం ఉందని సూచిస్తుంది. చాలామంది సహజంగానే వారి ప్రణాళికలు లేదా సౌలభ్యానికి వ్యతిరేకంగా ఏదైనా ఉంటే దాన్నుండి తప్పించుకోవడానికి లేదా వాటిని దూరం పెట్టడానికి ప్రయత్నిస్తారు. పదే పదే వాయిదా వేయడం లేదా మాట తప్పడం అనేది బలహీనతకు సంకేతం అని కొందరు అనుకుంటారు. కానీ నిజానికి బలహీనత కంటే వారి ఉద్దేశ్యమే వేరు అని అర్థం. ఎందుకంటే వారు తమ పనుల్లో ఇలాంటి అలసత్వం అస్సలు చూపించరు.
ఒత్తిడి, బాధ..
ఒత్తిడి, బాధ కూడా వ్యక్తి నిజమైన స్వభావాన్ని వెల్లడిస్తాయి. ఒత్తిడి ఒక వ్యక్తిని మార్చదు, కానీ అది వారిలో అంతర్గతంగా దాగి ఉన్న స్వభావాన్ని వెల్లడిస్తుంది. పరిస్థితులు చాలా ఛాలెంజింగ్ గా ఉన్నప్పుడు ఒక వ్యక్తి నిజాయితీగా ఉంటాడా లేదా చాకచక్యంగా ఉంటాడా, ప్రశాంతంగా ఉంటాడా లేదా దూకుడుగా ఉంటాడా అని గమనిస్తే.. ఆ సమయంలో వారి స్వభావం, వారి ప్రవర్తనను బట్టి వారి వ్యక్తిత్వం బయటకు తెలుస్తుంది.
విధేయత..
ప్రజల పొగడ్తల కంటే కూడా ఒక వ్యక్తి వ్యక్తిగతంగా ఎవరిని గౌరవిస్తాడనేది చాలా ముఖ్యం. ఎవరి అభిప్రాయాలకు విలువ ఇస్తారు, ఎవరి సరిహద్దులను వారు సహజంగా గౌరవిస్తారు అనే విషయాల మీదే వారి ప్రాధాన్యతలు ఉంటాయి. ఒక సంఘటన ఆధారంగా ఎవరి గురించి జడ్డ్ చేయకూడదు. నిజమైన ఉద్దేశాలు కాలక్రమేణా పదే పదే రిపీట్ గా జరిగే పనులలో బయటకు తెలుస్తాయి. ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంటే అదే వారి నిజాయితీకి బలమైన సాక్ష్యం అవుతుంది.
*రూపశ్రీ






