అణుబాంబులను సైతం త‌ట్టుకునే ఖ‌మేనీ కోట ఎలా నేల‌మ‌ట్ట‌ం?

posted on: Mar 2, 2026 8:44AM

ఇరాన్ రాజ‌ధాని టెహ్రాన్ లోని పాశ్చ‌ర్ స్ట్రీట్ లో  ఇరాన్ సుప్రీం లీడ‌ర్ ఖ‌మేనీ నివాసంతో పాటు బైత్-ఎ-రహబారీ కార్యాల‌యం కూడా ఉంటుంది. ఇక్క‌డ మూడంచ‌ల భ‌ద్ర‌తా  వ్య‌వ‌స్థ ఖ‌మ‌నేని నిరంత‌రం  ప‌హ‌రా కాస్తుంది.  ఈ మూడంచ‌ల భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థలో భాగంగా ఇది  నో ఫ్లై జోన్. ఇక్క‌డ అధునాత‌న యాంటీ  ఎయిర్ క్రాఫ్ట్ గ‌న్ లు, క్షి ప‌ణి నిరోధ‌క వ్య‌వ‌స్థ‌లు స‌దా  సిద్దంగా ఉంటాయి. అన్నిటికీ మించి.. ప్రపంచ  అమేయ సైనిక శ‌క్తికి ప‌రాకాష్ట‌గా భావించే ఇస్లామిక్ రివ‌ల్యూష‌న‌రీ గార్డ్ కార్ప్స్ లోని.. వ‌లీ- ఏ- అక్రం అనే విభాగం సుప్రీం లీడ‌ర్ ఖ‌మేనీ ప‌ర్స‌న‌ల్ సెక్యూరిటీని ప‌ర్య‌వేక్షిస్తుంది. అంతకు మించ పాశ్చ‌ర్ స్ట్రీట్ లోని ఖ‌మేనీ నివాసం కింద అత్యంత లోతైన బంక‌ర్లుంటాయి. ఇవి అణు దాడుల‌ను కూడా త‌ట్టుకుని నిలిచేంత పటిష్టంగా  ఉంటాయి.  ఏదైనా ఎమ‌ర్జెన్సీ త‌లెత్తితే.. సుప్రీం లీడ‌ర్ ఇక్క‌డి  నుంచే యుద్ధ భూమిని శాసించ‌గ‌ల‌రు. 

మ‌రి అలాంటి కోట ఎలా బీట‌లు వారింది? ఇందులో అంత‌ర్గ‌త శ‌తృవులు ఎవ‌రు? ప‌ట్ట‌ప‌గ‌లే ప్ర‌త్య‌ర్ధి ద‌ళాలు చుక్క‌లు చూపించ‌డానికి  గ‌ల కార‌ణాలేంటి? ఈ స‌మాచారం అందించింది ఎవ‌రు? ఇందులో ఏఐ పాత్ర ఎంత‌? అన్న‌దిప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇరాన్ తేరుకునే లోపే ఈ  ఆప‌రేష‌న్ ఎలా ముగిసిపోయింది అన్న‌ది  అంతు చిక్క‌కుండా ఉంది. ఇంత‌టి పిన్ పాయింట్ ఆప‌రేష‌న్ ఎలా సాధ్య‌మైంది అన్న‌దిప్పుడు బిగ్ డిబేట్ గానూ మారింది. ఇది ప్ర‌పంచం తొలిసారి చూసిన సూసైడ్ డ్రోన్ అటాక్. ఇరాన్ అత్యున్నత అధికార కేంద్రం ఉండే  పాశ్చ‌ర్ స్ట్రీట్ పై  క‌నీ వినీ ఎరుగ‌ని భీక‌ర దాడి. ఈ దాడి ఎలా జ‌రిగింద‌నేది ఇప్పుడు అంత‌ర్జాతీయ స్థాయిలో ర‌క్ష‌ణ  నిపుణుల‌కొక గుణ‌పాఠంలా మారింది.

ఇజ్రాయెల్, అమెరికా ద‌ళాలు ఎంపిక చేసుకున్న తొలి వ్యూహం, ప‌ట్ట‌ప‌గలు దాడుల‌తో విస్మయానికి గురి చేయ‌డం. సాధార‌ణంగా ఏ దేశ‌మైనా శ‌తృ దేశంపై అర్ధ‌రాత్రి పూట దాడులు చేస్తుంది. కార‌ణం ఆ స‌మ‌యంలో వారు ఆద‌మ‌ర‌చి ఉంటారు కాబ‌ట్టి. కానీ ఇక్క‌డ ఇజ్రాయెల్, అమెరికా వ్యూహ‌క‌ర్త‌లు ప‌గ‌టి దాడుల‌ను ఎంపిక చేశారు. దాడి జ‌రుగుతుంద‌ని ఎప్ప‌టి నుంచో ఇరాన్ అగ్ర నాయ‌క‌త్వానికి, సైనిక శ‌క్తికి తెలుసు. కానీ ఇలా  ఇంత పిన్ పాయింటెడ్ గా జ‌రుగుతుంద‌ని మాత్రం ఊహించలేదు. 

 శ‌నివారం (మార్చి 28)ఉద‌య స‌మ‌యాన్ని ఎంపిక చేసుకోవ‌డం   యాధృచ్చికం కాదు. ప‌క్కా ఇంటెలిజెన్స్ స‌మాచారం. ఇక్క‌డ ఇజ్రాయెలీ మొసాద్ కి చెందిన మెరిక‌ల్లాంటి ఇన్ఫార్మ‌ర్లు ఇరాన్ లో ఇరాన్ అగ్ర‌నాయ‌క‌త్వం క‌ళ్లు క‌ప్పి తిరుగుతుంటారు. అస‌లు ఇరాన్ చూపంతా వీరిపైనే. వీరు ఎక్క‌డ  క‌నిపిస్తే అక్క‌డ కాల్చి వేసే రూల్ ఉంది.  అయినా స‌రే ఒక‌రు పోతే మ‌రొక‌రుగా ఇక్క‌డ కాపు కాచి ఉంటారు. ఈ ఇన్ఫార్మ‌ర్ల ఇన్ఫ‌ర్మేష‌నే ఇరాన్ ఖ‌మేనీ కోట‌ను డీకోడ్ చేయ‌డానికి ప‌నికొచ్చింది. ఇరాన్ అగ్ర నాయ‌క‌త్వం ఒకే చోట స‌మావేశ‌మైంద‌ని ఇంటెలిజెన్స్ స‌మాచారం అంద‌డంటో  ఇజ్రాయెలీ-యూఎస్ సంయుక్తంగా టార్గెట్ ఫిక్స్ చేశాయి. ఈ టైంలో అటాక్ చేస్తే హై- వాల్యూ- టార్గెట్ల‌ను ఒకేసారి చేధించే అవ‌కాశ‌ముంద‌ని  ప‌సిగ‌ట్టింది ఇజ్రాయెల్- యూఎస్ ఆర్మీ. ఆ స‌మ‌యంలో ఇరాన్ డిఫెన్స్ సిస్ట‌మ్ కూడా ఏమంత అప్ర‌మ‌త్తంగా  ఉండ‌దు.  

నిజానికి ఖ‌మేనీ ఈ స‌మావేశం  శ‌నివారం సాయంత్రం నిర్వ‌హిస్తార‌ని టెహ్రాన్ నుంచి అమెరికా ద‌ళాల‌కు ఉన్న స‌మాచారం. అయితే ఇజ్రాయెల్ నిఘా వ‌ర్గాల స‌మాచారం ప్రకారం.. శ‌నివారం ఉద‌యం ఒక అత్యున్న‌త స్థాయి స‌మావేశం జ‌రుగుతుంద‌ని గుర్తించార‌ట‌.  ఈ స‌మాచారంతో అమెరికా ద‌ళాల‌ను అప్ర‌మ‌త్తం చేసింది ఇజ్రాయెల్. అలా అమెరికా, ఇజ్రాయెల్ సేనలు ఒకేసారి  దాడికి తెగ‌బ‌డ్డాయట‌. ఇరాన్ ఉన్న‌తాధికారులంతా.. స‌మావేశ‌మై  ఉండగా, వారి ఊహకు అందని రీతిలో అటాక్ చేసి  సింగిల్ అటెంప్ట్ లో మ‌ట్టు పెట్టేశాయి ఇజ్రాయెలీ అమెరికా సేన‌లు.

భూమ్యాకాశాల‌తో పాటు స‌ముద్రం నుంచి కూడా ముప్పేట దాడి ఇజ్రాయెల్, అమెరికాల రెండో వ్యూహం.  టెహ్రాన్ న‌గ‌రాన్ని మూడు వైపుల నుంచి  చుట్టుముట్టేలా ఆప‌రేష‌న్ ప్లాన్ చేశారు. ప‌ర్ష‌ియన్ గ‌ల్ఫ్ లో ఉన్న అమెరికా యుద్ధ నౌక‌లు, జ‌లాంత‌ర్గాముల నుంచి వేలాది కిలోమీట‌ర్ల దూరంలోని ల‌క్ష్యాల‌ను చేధించ‌గ‌ల టోమాహాక్ క్రూయిజ్ క్షిప‌ణుల‌ను ప్ర‌యోగించారు. అమెరికాకు చెందిన ఎఫ్- 35 స్టీల్త్ ఫైట‌ర్లు, బీ-2 బాంబ‌ర్లు.. రాడార్ల‌కు చిక్కకుండా  ఇరాన్ గ‌గ‌న త‌లంలోకి ప్ర‌వేశించాయి. పిన్ పాయింట్ బాంబ్ అటాక్స్ చేశాయి. స‌రిహ‌ద్దు దేశాల నుంచి హైమార్స్ రాకెట్ సిస్ట‌మ్స్ ద్వారా ఖ‌చ్చిత‌మైన ల‌క్ష్యాల‌పై దాడులు జ‌రిగాయి.

 లుకాస్ డ్రోన్ల వినియోగం మూడో వ్యూహం. ఈ ఆప‌రేష‌న్లో అతి  పెద్ద హైలెట్  ఇదే.  లో కాస్ట్- అన్ మ్యాన్డ్ కాంబాట్ అటాక్ సిస్ట‌మ్ పేరే.. లూకాస్ డ్రోన్ సిస్ట‌మ్. అమెరికా తొలిసారి  ఈ క‌మికేజ్ అంటే  సూసైడ్ డ్రోన్ సిస్ట‌మ్ ని ప్ర‌యోగించింది. ఇరాన్ సొంతంగా త‌యారు చేసిన షాహెద్ డ్రోన్ల త‌ర‌హాలో ఉండే.. ఈ డ్రోన్ల గుంపు ఒక్కాసారిగా వ‌చ్చి ఎస్- 300 క్షిప‌ణుల క‌న్ను క‌ప్పి.. ఖ‌మేనీ నివాసాన్ని నేల‌మ‌ట్టం చేశాయి.

శాటిలైట్ చిత్రాల‌ను అనుస‌రించి చూస్తే..   నిమిషాల వ్య‌వ‌ధిల‌నే ఈ ప్రాంత‌మంతా  శిథిలావ‌స్థకు చేరుకుంది. ఇరాన్ గ‌గ‌న త‌ల వ్య‌వ‌స్థ‌ల‌ను పూర్తిగా నిర్వీర్యం చేసి మ‌రీ.. ఈ దాడులు జ‌ర‌గ‌టం విశేషం.  ఇందులో అత్యంత వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింది ఏఐ టెక్నాల‌జీ. ఇక్క‌డి ప‌రిస్థితులు ఎప్ప‌టిక‌ప్పుడు లెక్క క‌ట్టి.. ఇజ్రాయెల్, అమెరికా  సైన్యాన్ని అప్ర‌మ‌త్తం  చేసింది ఈ కృత్రిమ‌ సాంకేతిక ప‌రిజ్ఞాన‌మే  అణుబాంబుల‌కు కూడా వెర‌వ‌ని ఖ‌మేనీ కోట ఒక్క‌సారిగా కుప్ప కూల్చేసింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...