Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జల రవాణా స్వరూపాన్నే మార్చేసిన ఘట్టం.. స్టీమ్ బోట్ చరిత్ర ఇది..!
posted on: Feb 11, 2026 1:38PM

రవాణా ప్రజల జీవితాలలో ఎంతో ముఖ్యమైనది. రోడ్డు రవాణా చాలా సహజంగా అందరికీ తెలిసేది, కనిపించేది. కానీ వాయు రవాణా, జల రవాణా ప్రజల నివాసాలకు దూరంగా జరుగుతుంది. మరీ ముఖ్యంగా వేల సంవత్సరాల కాలం నుండే జల రవాణా సాగుతోంది. అయితే ఒకప్పుడు జల రవాణాకు ఎంతో సమయం తీసుకునేది. కానీ స్టీమ్ బోట్ జల రవాణాను చాలా సులభతరం చేసింది. జల రవాణా చరిత్రలో స్టీమ్ బోట్ ఒక కీలక మలుపు. ఇంతకీ ఈ స్టీమ్ బోట్ ఎవరు, ఎప్పుడు తయారు చేశారు. ఇది జల రవాణాను ఎలా సులభతరం చేసింది. తెలుసుకుంటే..
జల రవాణా నిర్వచనాన్నే మార్చిన రోజుగా ఫిబ్రవరి 11 చరిత్ర పుటల్లో లిఖించబడింది. సరిగ్గా 217 సంవత్సరాల క్రితం, ఫిబ్రవరి 11, 1809న, అమెరికన్ ఆవిష్కర్త రాబర్ట్ ఫుల్టన్ స్టీమ్‌బోట్‌కు పేటెంట్ పొందాడు. నది ద్వారా వ్యాపారం, ప్రయాణం చాలా సవాలుతో కూడుకున్నదిగా పరిగణించబడిన సమయం ఇది. అలాంటి సమయంలో రాబర్ట్ ఫుల్టన్ ఆవిష్కరణ విప్లవాత్మకమైనది.
ఫుల్టన్ ఆలోచన..
ఫుల్టన్ ఆవిష్కరణకు ముందు పడవలను ఓర్ల ద్వారా నడిపించేవారు. ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా ఉండటమే కాకుండా నావికులకు చాలా అలసిపోయేలా చేసేది. రాబర్ట్ ఫుల్టన్ ఈ సమస్యకు ఆవిరి యంత్రం, తెడ్డు చక్రం యొక్క పూర్తీ కాంబినేషన్ లో ఒక పరిష్కారాన్ని కనుగొన్నాడు. ప్రయాణాన్ని వేగంగా, చౌకగా నిరంతరంగా కొనసాగేలా చేసింది. సమయాన్ని చాలా పొదుపు చేసింది.
మొదటి చారిత్రాత్మక యాత్ర..
1807 ఆగస్టు 17న, రాబర్ట్ ఫుల్టన్ పడవ క్లెమాంట్, హడ్సన్ నదిపై తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించింది. క్లెమాంట్ న్యూయార్క్ నుండి అల్బానీకి 240 కిలోమీటర్ల ప్రయాణాన్ని కేవలం 32 గంటల్లో పూర్తి చేసింది. ఆ కాలంలోని సాంప్రదాయ పడవలు అదే దూరాన్ని అధిగమించడానికి దాదాపు నాలుగు రోజులు పట్టేవి. తిరుగు ప్రయాణంలో పడవ మరింత వేగంగా ప్రయాణించి కేవలం 30 గంటల్లోనే ప్రయాణాన్ని పూర్తి చేసింది.
అందరూ ఎగతాళి చేశారు..
మొదట్లో ప్రజలు స్టీమ్ బోట్ గురించి భయపడ్డారు. నల్లటి పొగ, ఇంజిన్ శబ్దం, ఎగిరే నిప్పురవ్వలు చూసి ప్రజలందరూ రాబర్ట్ ఫుల్టన్‌ను ఒక మూర్ఖుడిగా పిలిచారు. కానీ పడవ 60 మంది ప్రయాణికులను తీసుకెళ్లినప్పుడు, ఆ ప్రయాణం విజయవంతం అయినప్పుడు అందరి ఆలోచన మారిపోయింది.
వాణిజ్యంలో కొత్త ఊపు..
స్టీమ్‌బోట్ విజయం న్యూయార్క్, అల్బానీ వంటి నగరాల మధ్య రోజువారీ సేవలకు ఎంతో సహాయపడింది. 24-హార్స్‌పవర్ ఇంజిన్, రెండు పెద్ద తెడ్డు చక్రాలతో కూడిన ఈ పడవ సరుకు రవాణాను చాలా సులభతరం చేసింది. ఈ ఒకే ఒక ఆవిష్కరణ నది వాణిజ్యాన్ని విస్తరించడమే కాకుండా అమెరికన్ వెస్ట్‌లో ఆర్థిక అభివృద్ధికి కూడా మార్గం తెరిచింది. కాలక్రమేణా ఫుల్టన్ తన పడవను మరింత మెరుగుపరిచాడు, దానిని మరింత సురక్షితంగా మార్చాడు. భవిష్యత్తులో జల రవాణాకు కొత్త తలుపులు తెరిచాడు.
*రూపశ్రీ.






