Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హిల్లరీని అల్లరి చేసిన ట్రంప్స్ వైఫ్ అండ్ డాటర్స్!
posted on: Jan 21, 2017 11:38AM

ఆమె వేసుకున్న లాంటి డ్రస్సే వాళ్లిద్దరూ కూడా వేసుకొచ్చారు.అంతే కాదు,ఆమె తనకి పోటీగా భావించే మరొకావిడ కూడా అదిరిపోయే డ్రస్ వేసుకొచ్చింది.దాంతో ఆమె ముఖం వాడిపోయింది.కార్యక్రమం జరుగుతోన్నంత సేపూ ఇబ్బందిగానే గడిపింది.మొత్తానికి తాను స్పెషల్ అట్రాక్షన్ అవ్వకుండా పోయిన ఆమె డీప్ గా డిసపాయింట్ అయింది!ఏంటిదంతా అంటారా?ఇంతకీ ఆమెవరు అంటారా?ఆమె మామూలు వ్యక్తి కాదు!అందుకే,ఇంత డిస్కషన్!
సాధారణంగా స్త్రీలు తమ డ్రస్సింగ్ విషయంలో కొంచెం సీరియస్ గానే వుంటారు.ఏదైనా ఫంక్షన్ కు వచ్చినప్పుడు మగవాళ్లు కూడా అందంగా వుండాలనే ట్రై చేస్తారు కాని ఆడవాళ్లు అందుకోసం ఎంతైనా శ్రమిస్తారు.పైగా...తీరా తాము ది బెస్ట్ రెడీ అయి వచ్చాక కార్యక్రమంలో మరో అందగత్తె కూడా సేమ్ డ్రస్ వేసుకొస్తే?ఇక అంతే సంగతులు!సునామీ మీద పడ్డట్టు విలవిలలాడిపోతారు.ఇందుకు నార్మల్ లేడీసే కాదు అమెరికా ఫస్ట్ లేడీ ప్రెసిడెంట్ అవ్వలేకపోయిన హిల్లరీ కూడా అతీతం కాదు.ట్రంప్ ప్రమాణ స్వీకారానికి వచ్చిన ఆమె ఇబ్బందిని చూస్తే ఎవ్వరైనా ఒప్పుకుంటారు!
ఒకప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ భార్య,మొన్నటి ఎన్నికల్లో ట్రంప్ తో పోటీ పడి ఓడిన హిల్లరీ ఇంక ఎదురు దెబ్బలు ఎదుర్కొంటూనే వుంది.పాపం ఆమె ఎలాగో మనసుకు నచ్చజెప్పుకుని ట్రంప్ ప్రమాణస్వీకారానికి తరలి వస్తే అక్కడ డ్రస్సింగ్ తిప్పలు తప్పలేదట.వైట్ సూట్ లో వచ్చిన ఆమె ఎప్పటిలాగే గంభీరంగా, గార్జియస్ గా వున్నప్పటికీ...డొనాల్డ్ ట్రంప్ కూతుళ్లు కూడా అదే రకం,అదే రంగు బట్టలు వేసుకొచ్చారట.దాంతో హిల్లరీ ముఖం వాడిపోయింది.అంతలో మరో షాక్ లాగా ట్రంప్ భార్య అదరిపోయే బ్లూ డ్రస్ లో ప్రత్యక్షమైంది!ఒకప్పటి ఫస్ట్ లేడీ అయిన హిల్లరీ ఆమె డ్రస్సింగ్ ముందు తేలిపోయిందట!పైగా ఎన్నికల వరకూ తనకు డ్రస్ డిజైనింగ్ చేసిన ఫ్యాషన్ డిజైనరే ఇప్పుడు ట్రంప్ భార్యకి సేవలందిస్తోందట!ఇవన్నీ కలిసి హిల్లరీని తెగ ఇబ్బందిపెట్టాయంటున్నారు...
ఒకేలాంటి డ్రస్సింగ్ తో ఎదురుపడితే సినిమా హీరోయిన్స్ నానా విధాలుగా టెన్షన్ పడిపోతుంటారు.మీడియా కెమెరాలు తమని సేమ్ టూ సేమ్ డ్రస్ లో ఎక్కడ బంధిస్తాయోనని తెగ ఇదై పోతుంటారు.అలాంటి పరిస్థితే అంతర్జాతీయ స్థాయి రాజకీయ నాయకురాలైన హిల్లరీకి వచ్చిందంటే నమ్మటం కష్టమే!కాని,ఎంత అమెరికన్ ప్రెసిడెంట్ కాబోయి అవ్వలేకపోయిన లీడర్ అయినా ఆమె కూడా స్త్రీయే కదా...మీడియా పని మీడియా చేసుకుపోతుంది.అదే అసలు తలనొప్పి!






