పంచ్ ప్ర‌భాక‌ర్‌కు హైకోర్టు పంచ్‌.. త్వ‌ర‌లోనే అరెస్ట్‌!

వాడో పెద్ద వెద‌వ‌..అంటారు. కోతికి కొబ్బ‌రి చిప్ప‌లా.. వాడికి సోష‌ల్ మీడియా..అని విమ‌ర్శిస్తుంటారు. వైసీపీకి అనుకూలంగా పోస్టులు పెడుతూ.. ప్ర‌తీదానికీ టీడీపీని త‌ప్పుబ‌డుతూ.. శాడిజం ప్ర‌ద‌ర్శిస్తుంటార‌ని చెబుతారు. అద్దూఅదుపూ లేని అడ్డ‌గోలు పోస్టుల‌తో.. ఊర‌కుక్క మాదిరి నోటికొచ్చిన‌ట్టు వాగుతూ.. విదేశాల్లో న‌క్కి.. ఏపీలో చిచ్చు రాజేస్తుంటాడ‌ని మండిప‌డుతుంటారు. సోష‌ల్ మీడియాలో పంచ్ ప్ర‌భాక‌ర్ చేసేంత‌ ర‌చ్చ‌..రొచ్చు.. మ‌రెవ‌రూ చేయ‌ర‌ని అంటారు. అదే ఊపులో, అదే బ‌లుపుతో, అదే వెర్రిత‌నంతో.. త‌న వెనుక‌ వైసీపీ ఉంద‌నే విచ్చ‌ల‌విడిత‌నంతో.. కోర్టుల‌పైనా నెగ‌టివ్ పోస్టులు పెట్టాడు. కోర్టు తీర్పుల‌నే త‌ప్పుబ‌డుతూ.. త‌ప్పుడు కామెంట్లు చేశాడు. క‌ట్ చేస్తే.. పంచ్ ప్ర‌భాక‌ర్‌కే పంచ్ ప‌డింది. జ‌డ్జిల‌పై వివాదాస్ప‌ద పోస్టులు పెట్టిన కేసులో ఆయ‌న‌పైనా సీబీఐ విచార‌ణ జ‌రుగుతోంది. కాక‌పోతే.. వాడు మ‌న‌ దేశంలో లేడుగా. అందుకే, అరెస్ట్‌ కాస్త ఆల‌స్యం అవుతోంది. కానీ, కోర్టులు, సీబీఐ త‌ల్చుకుంటే.. ఎంత‌టి వాడినైనా లొంగ‌దీసి.. సంకెళ్లు వేసి ప‌ట్టుకొచ్చి.. న్యాయ‌స్థానాల ముందు నిల‌బెడ‌తాయ‌నే విష‌యం వాడికింకా అర్థం కావ‌ట్లేదు. కాస్త‌ లేటైనా.. ప‌నిష్మెంట్ మాత్రం ప‌క్కా అంటున్నారు. 

తాజాగా, న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో వివాదాస్పద కామెంట్లు పెట్టిన కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో సీబీఐ విచారణ జ‌రుగుతున్న తీరుపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మరీ ముఖ్యంగా, పంచ్‌ ప్రభాకర్‌ వ్యవహారంపై హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. తెలుగువారి  ఆత్మగౌరవాన్ని ప్రభాకర్ దెబ్బ తీస్తున్నాడని, అతనిని ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారని సీబీఐని గ‌ట్టిగా నిలదీసింది హైకోర్టు. 

తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సీబీఐ పట్టించుకోలేదంటూ.. స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాది అశ్విని కుమార్ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. పంచ్ ప్ర‌భాక‌ర్‌కి కనీసం ఒక్క నోటీసు కూడ ఇవ్వలేక పోయారని చెప్పారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లకు నోటీసులు ఇవ్వాలని.. ప్రభాకర్‌ వీడియోలు తొలగించేలా ఆదేశాలివ్వాలని న్యాయవాది కోరారు. దీంతో హైకోర్టు నుంచి సీబీఐకి లేఖ రాయాలని ధర్మాసనం ఆదేశించింది. హైకోర్టు ఆగ్ర‌హం చూస్తుంటే.. పంచ్ ప్ర‌భాక‌ర్‌కు బిగ్ పంచ్ ప‌డే రోజులు ద‌గ్గ‌ర‌ప‌డిన‌ట్టే ఉన్నాయి.