Top Stories

అయినా జగన్ మారలేదు.. 2.0 ఉత్తుత్తి మాటలే!?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెంగళూరు నుంచి తాడేపల్లికి చేరుకున్నారు. ఈ ఉదయం ఆయన బెంగళూరు నుంచి విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో తన తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లారు. తరువాత విజయవాడ జిల్లా జైలుకు వెళ్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో ములాఖత్ అవుతారు.  వల్లభనేని వంశీ కిడ్నాప్ కేసులో అరెస్టై విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి విదితమే. వంశీని జగన్ జైల్లో పరామర్శించడానికి వెళ్లడం పట్ల వైసీపీలోనే ఒకింత అభ్యంతరం వ్యక్తం అవుతోంది. వైసీపీ అధికారంలో ఉండగా ఇష్టారీతిగా  చెలరేగిపోయి, అప్పటి ప్రతిపక్ష నేతపైనా ఆయన కుటుంబ సభ్యులపైనా అనుచిత వ్యాఖ్యలు చేసిన వంశీని గత ఏడాది  జరిగిన ఎన్నికలలో జనం తిరస్కరించారు. అంతే కాదు.. వంశీ వంటి నేతలను ప్రోత్సహించిన జగన్ పార్టీకి కూడా గత ఎన్నికలలో జనం దిమ్మతిరిగే షాక్ ఇచ్చి ఘోరంగా ఒడించారు. ఇప్పుడు తాను మారాననీ, ఇక నుంచి పార్టీకీ, పార్టీ క్యాడర్ కు అండగా  నిలుస్తాననీ, జగన్ 2.0ను చూస్తారనీ ఊదరగొడుతున్న జగన్ ఇప్పుడు అట్రాసిటీ కేసులో అరెస్టైన వంశీని  పరామర్శించడానికి  వెళ్లడం చూస్తుంటే ఆయన వైసీపీ కార్యకర్తలకు  కాదు.. పార్టీని జగన్ అండ చూసుకుని భ్రష్టుపట్టించిన వారికే వత్తాసుగా ఉంటారని అర్ధమౌతోందని పార్టీ శ్రేణులే అంటున్నాయి.  2019 ఎన్నికలకు ముందు ఒక్క‌ చాన్స్ ఇవ్వండి అంటూ జనాలను కోరుకుని.. అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. అధికారంలో ఉన్న ఐదేళ్లూ ప్ర‌జ‌ల‌కు న‌ర‌కం చూపించారు. ఇక ప్ర‌తిప‌క్ష నేత‌ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. జ‌గ‌న్ క‌క్ష‌పూరిత రాజ‌కీయాల వ‌ల్ల చంద్ర‌బాబుతో స‌హా అనేక‌మంది జైళ్ల‌కు వెళ్లాల్సి వ‌చ్చింది. ఆ పార్టీలోని కొంద‌రు నేత‌లు వైసీపీ హ‌యాంలో హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించారు. బూతుల‌తో చంద్ర‌బాబు, ప‌వ‌న్‌, లోకేశ్ స‌హా వారి కుటుంబ స‌భ్యుల‌పైనా విరుచుకుప‌డ్డారు. అసెంబ్లీ వేదిక‌గా చంద్ర‌బాబు కుటుంబాన్ని దారుణంగా అవ‌మానించారు. వారిలో ప్ర‌ధానంగా వ‌ల్ల‌భ‌నేని వంశీ, కొడాలి నాని, రోజా ఉన్నారు. వీరు మీడియా స‌మావేశం పెట్టారంటే ఏపీలోని చాలా ఇళ్ల‌లో టీవీలు బంద్ అయ్యేవి. జ‌గ‌న్ క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌కుతోడు వైసీపీ నేత‌ల అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌ల‌ను జీర్ణించుకోలేక‌పోయిన‌ ఏపీ ప్ర‌జ‌లు గ‌త ఎన్నిక‌ల్లో ఓటు ద్వారా గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు. ప్ర‌తిప‌క్ష హోదాకూడా వైసీపీకి ఇవ్వ‌లేదు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వైసీపీ హ‌యాంలో అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డిన నేత‌ల‌పై, ఐదేళ్లు హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించిన నేత‌ల‌పై ముఖ్యమంత్రి చంద్ర‌బాబు కొర‌డా ఝుళిపిస్తున్నారు.  ఈ క్ర‌మంలోనే  జోగి ర‌మేశ్‌, నందిగం సురేశ్‌, పేర్ని నానిల‌పై కేసులు నమోద‌ య్యాయి. జోగి ర‌మేశ్‌, నందిగం సురేశ్ లు జైలుకెళ్లి బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇప్పుడు వంశీ జైల్లో ఉన్నారు. అయితే, వంశీని ప‌రామ‌ర్శించేందుకు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  జైలుకు వెళ్తున్నారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ జైలుకెళ్లి వంశీని ఎలా స‌మ‌ర్ధిస్తారన్న అంశం ఏపీ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. వంశీ త‌ప్పు చేసిన‌ట్లు ఆధారాల‌తోస‌హా పోలీసులు నిరూపిస్తున్నారు. గ‌న్న‌వ‌రం తెలుగుదేశం కార్యాల‌యంపై దాడి కేసులో వంశీతోపాటు ప‌లువురు వైసీపీ నేత‌ల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఇప్ప‌టికే ప‌లువురిని అరెస్టు చేసి జైలుకు పంపించ‌గా.. వారిలో కొంద‌రు బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇటీవ‌ల వ‌ల్ల‌భ‌నేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. విజ‌య‌వాడ కోర్టులో హాజ‌రుప‌ర్చ‌గా.. వంశీకి కోర్టు 14రోజులు రిమాండ్ విధించింది. ప్ర‌స్తుతం వంశీ విజ‌య‌వాడ‌లోని జిల్లా జైలులో ఉన్నాడు. అయితే వంశీ అరెస్టైంది గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో కాదు. ఆ కేసులో ఫిర్యాదు దారు సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో వంశీపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. గ‌న్న‌వ‌రం టీడీపీ కార్యాల‌యంపై దాడి ఘ‌ట‌న‌లో పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ ను వంశీ ఆధ్వ‌ర్యంలో ఆయ‌న అనుచ‌రులు కిడ్నాప్ చేశారు. స‌త్య‌వ‌ర్ధ‌న్ ను బెదిరించ‌డంతోపాటు కొట్టారు. దీంతో ఇటీవ‌ల కోర్టులో త‌న‌కు, టీడీపీ కార్యాల‌యంపై దాడి ఘ‌ట‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని స‌త్య‌వ‌ర్ధ‌న్ చెప్పాడు. అయితే, కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు విచార‌ణ చేప‌ట్ట‌గా.. స‌త్య‌వ‌ర్ధ‌న్ ను వంశీ, ఆయ‌న అనుచ‌రులు కిడ్నాప్ చేసి.. బెదిరింపుల‌కు గురిచేసిన‌ట్లు తేలింది. దీంతో వంశీపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసును న‌మోదు చేసి అరెస్టు చేశారు. వంశీతోపాటు మ‌రో ఇద్ద‌రిని అరెస్టు చేశారు. ప్ర‌స్తుతం వంశీ జైల్లో ఉన్నాడు. ఆయ‌న్ను ప‌రామ‌ర్శించేందుకే  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  విజ‌య‌వాడ  జిల్లా జైలుకు వెడుతున్నారు. జ‌గ‌న్ వంశీని ప‌రామ‌ర్శించేందుకు జైలుకెళ్తే వైసీపీ ప‌రిస్థితి ప్ర‌జ‌ల్లో మ‌రింత దిగ‌జారిపోతుంద‌ని ఆ పార్టీ నేత‌లు ఆందోళ‌న చెందుతున్నారు.  దళితుల పక్షపాతిగా చెప్పుకునే జగన్.. ఒక దళితుడిని కిడ్నాప్ చేసి బెదరించిన కేసులో అరెస్టైన వల్లభనేని వంశీని జైలుకు వెళ్లి పరామర్శించడం సరికాదని ఆ  పార్టీ  నేతలే చెబుతున్నారు.  వైసీపీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో వంశీ, కొడాలి నాని, రోజాలు చంద్ర‌బాబు, ప‌వ‌న్, లోకేశ్ పైనా, వారి కుటుంబాల‌పై చేసిన అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌ల‌తోనే అధికారాన్ని కోల్పోవాల్సి వ‌చ్చింద‌ని,  ఇప్పుడు వంశీ లాంటి నేత‌ను ప‌రామ‌ర్శించేందుకు జ‌గ‌న్ జైలుకెళ్ల‌డం స‌రియైన నిర్ణ‌యం కాద‌ని వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.     అన్నిటికీ మించి జగన్ 2.0 అంటూ ఇటీవల కాలంలో తెగ ఊదరగొడుతున్నారు. ఈసారి అధికారంలోకి వస్తే మూడు దశాబ్ధాలు తమదే అధికారం అంటూ   జ‌గ‌న్ త‌న ప్ర‌సంగంలో చెబుతున్నారు. ఇన్నాళ్లు ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ఆలోచించాన‌ని.. ఇక‌నుంచి జ‌గ‌న్ 2.0గా కార్య‌క‌ర్త‌ల బాగోగులను ప‌ట్టించుకుంటాన‌ని, వారికి అండ‌గా ఉంటాన‌ని జ‌గ‌న్ హామీలు ఇస్తున్నారు. దీంతో జ‌గ‌న్ లో మార్పు వ‌చ్చింద‌ని వైసీపీ క్యాడర్ భావించింది. అయితే, వంశీ లాంటి నేత‌ను ప‌రామ‌ర్శించేందుకు జ‌గ‌న్ జైలుకు వెళ్లడాన్ని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.  ఇక జ‌గ‌న్ మార‌రు.. వైసీపీతో ఉండి ఇబ్బందులు ప‌డ‌టం కంటే పార్టీ వీడడమే మేలని మెజారిటీ వైసీపీ నేతలు భావిస్తున్నట్లు చెబుతున్నారు.  మొత్తం మీద జగన్ తాను చెబుతున్న జగన్ 2.0 మాటలన్నీ ఉత్తుత్తివేననీ, ఆయనకు కావలసింది నేర పూరిత స్వభావం ఉన్న, ప్రత్యర్థులపై అసభ్య పదజాలంతో దూషించేందుకు వెనుకాడని వల్లభనేని వంశీ వంటి వారే తప్ప జనం, క్యాడర్, పార్టీ కాదని తేటతెల్లమైందని చెబుతున్నారు. 
Publish Date: Feb 18, 2025 9:10AM

ఫార్ములా ఈ రేస్ కేసు.. ఎఫ్ఈవో సీఈవోను విచారించిన ఏసీబీ

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కీలక నిందితుడిగా ఉన్న ఫార్ములా ఈ రేస్ కేసు దర్యాప్తు సాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ ను ఈడీ, ఏసీబీలు విచారించాయి. అవసరమైతే మరో సారి విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పాయి. అలాగే ఇదే కేసులో సీసియర్ ఐఏఎస్ అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని కూడా ఈడీ, ఏసీబీలు విచారించాయి.  ఆ తరువాత కొద్ది రోజుల పాటు ఈ కేసులో ఎటువంటి పురోగతీ కనిపించలేదు. అయితే ఇప్పడు మళ్లీ ఈ కేసు దర్యాప్తులో ఏసీబీ వేగం పెంచింది. ఈ కేసులో సొమ్ములు అందుకున్నట్లు చెబుతున్న ఒక విదేశీ సంస్థకు ఏసీబీ నోటీసులు పంపింది. ఎఫ్ ఈఓకు పంపిన నోటీసులలో వర్చువల్ గా విచారణకు రావాలని ఆదేశించింది. ఏసీబీ నోటీసుల మేరకు ఎఫ్ఈవో సంస్థ సీఈవో సోమవారం (ఫిబ్రవరి 17)న వర్చువల్ గా ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏసీబీ ఎఫ్ఈవో సీఈవో  ఆల్బర్టోను సుదీర్ఘంగా విచారించింది. పలు కీలక అంశాలపై ఏసీబీ అధికారులు ప్రశ్నలు గుప్పించారు.  ఫార్ములా ఈ-కార్ రేసు సీజన్ 9 చెల్లింపులు, లెటర్ ఆఫ్ ఇంటెంట్, లాంగ్ ఫార్మ్ అగ్రిమెంట్ వంటి అంశాలపై అల్బర్టోను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసినట్లు తెలిసింది. 
Publish Date: Feb 18, 2025 8:46AM

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్.. నిజమేనా?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజకీయంగా మళ్లీ యాక్టివ్ అవుతున్నారా? ఈ సారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరౌతారా? ప్రతిపక్ష నేతగా తన గళం వినిపిస్తారా? అన్న ప్రశ్నలకు బీఆర్ఎస్ వర్గాలు ఔననే అంటున్నాయి. తెలంగాణ ఆవిర్భావం నుంచి వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న కేసీఆర్..అహంకారపూరిత వ్యవహార శైలి కారణంగానే 2023 ఎన్నికలలో అధికారాన్ని కోల్పోయారు. జనం ఆయన అహంకారాన్ని భరించలేక బీఆర్ఎస్ పార్టీని ఓడించి సాగనంపారు.   దారుణమైన ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, ఆత్మ విమర్శ చేసుకుని, పద్ధతులలో మార్పులు చేసుకోకుంటే మీ సేవలు మాకిక అవసరం లేదని ఓటు ద్వారా కుండబద్దలు కొట్టారు. అయితే ఓటమి తరువాత కూడా కేసీఆర్ లో మార్పు రాలేదు. బీఆర్ఎస్ ను ఓడించి ప్రజలు తప్పు చేశారంటూ ఓటమి తరువాత ఒకటి రెండు సందర్భాలలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.  కేసీఆర్ ఇప్పటికీ తనను తాను హిమాలయాలంత ఎత్తున ఉన్నట్టుగానే ఊహించుకుంటున్నారు. తాను పదేళ్ళపాటు అద్భుతమైన పరిపాలన అందించాననీ, తాను తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన విధానాలు అద్భుతమైనవనీ చెప్పుకుంటున్నారు. మేడిగడ్డ కుంగుబాటు చాలా చాలా చిన్న విషయమని చెబుతున్నారు. జనం శుష్కవాగ్దానాలకు లొంగిపోయి.. బీఆర్ఎస్ ను ఓడించి తప్పు చేశారని అంటున్నారు. అందుకు ఇప్పుడు బాధపడుతున్నారనీ, మళ్లీ తనవైపు, బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని చెప్పుకుంటున్నారు. అందుకే ప్రజలలో ఈ పరివర్తన వచ్చింది కనుకే ఇప్పుడు తాను మళ్లీ రాజకీయాలలోకి వస్తున్నానని చెప్పకనే చెబుతున్నారు. ఇప్పుడు ఇక తానేమిటో చూపిస్తాననీ, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరై రేవంత్ సర్కార్ ను నిలదీస్తాననీ అంటున్నారు.   అంతే కాదు పార్టీ ఎమ్మెల్యేలకూ, మాజీ మంత్రులకు స్వయంగా ఫోన్ చేసి మరీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు మిస్ కాకుండా హాజరు కమ్మడి ఆదేశిస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తాను కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరౌతాననీ, ప్రభుత్వాన్ని సభ వేదికగా ఎండగడతాననీ చెబుతున్నారు.  2023 ఎన్నికలలో పార్టీ ఓటమి తరువాత ప్రజలకు ముఖం చాటేసిన కేసీఆర్ ఇప్పుడు ఏడాది తరువాత ఇక చూస్తోండి నా తడాఖా అంటున్నారంటూ నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు. ఓటమి తరువాత రాజీనామాను సైతం స్వయంగా గవర్నర్ కు ఇవ్వకుండా తన పీఏతో పంపించి, రాత్రికి రాత్రి క్యాంప్ ఆఫీస్ ఖాళీ చేసి ఫామ్ హౌస్ కు పారిపోయిన కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో    శాసనసభ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు పక్కాగా వ్యూహరచన చేసుకున్నట్లు తెలుస్తోంది.   కెసిఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పదేపదే సవాల్ చేస్తున్నా ఇంత కాలం మౌనమే సమాధానం అన్నట్లుగా వ్యవహరించిన కేసీఆర్.. ఇఫ్పుడు  అసెంబ్లీ వేదికగా తన గళాన్ని వినిపించడానికి రెడీ అవుతున్నారు.  
Publish Date: Feb 18, 2025 5:16AM

కోర్టులో లొంగిపోయిన నందిగం సురేశ్ 

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్  సత్తెనపల్లి కోర్టులో లొంగిపోయారు. నందిగం సురేశ్  వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మరియమ్మ అనే మహిళ కేసులో ఆయన 145 రోజుల జైలు జీవితం గడిపారు. అనారోగ్య కారణాలతో ఆయనకు బెయిల్ లభించింది.  అమరావతి ఉద్యమం సమయంలో అమరావతి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్న కేసులో ఆయన సత్తెనపల్లి  కోర్టుకు వచ్చారు.  ఈ కేసులో ఆయన తప్పించుకుతిరుగుతున్నారు. . ఈ కేసు కూటమి ప్రభుత్వం వచ్చాక కదలిక వచ్చింది ఈ నేపథ్యంలోనే నందిగం సురేశ్ కోర్టులోనే  లొంగిపోయారు. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం సురేశ్ తరపు న్యాయవాదులు యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.  
Publish Date: Feb 17, 2025 5:56PM