విరోష్ దంపతులకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు

posted on: Mar 5, 2026 8:58PM

 

ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ-రష్మిక దంపతులను తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి ఆశీర్వదించారు. రిసెప్షన్ కార్యక్రమం సమయంలో ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి తిరిగి హైదరాబాద్ చేరుకున్న తర్వాత ప్రత్యేకంగా విజయ్ దేవరకొండ నివాసానికి వెళ్లి కొత్త జంటను కలిశారు. ఈ సందర్భంగా నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ వారి దాంపత్య జీవితం ఆనందంగా సాగాలని ఆశీర్వదించారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన సందర్భంగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆయనకు ఆతిథ్యం ఇచ్చారు. కొత్త జీవితాన్ని ప్రారంభించిన విజయ్ దేవరకొండ–రష్మిక దంపతులకు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...