Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జగన్ బ్యాచ్ ఆనందం ఆవిరి చేసిన సూర్య...
posted on: Jan 16, 2018 2:46PM
.jpg)
పాపం వైసీపీ బ్యాచ్ ఆనందాన్ని కనీసం 24 గంటలు కూడా ఉంచలేదు తమిళనాడు సూపర్ హీరో సూర్య. సూర్య ఏంటీ..? వైసీపీ ఆనందాన్ని పోగొట్టడం ఏంటీ అనుకుంటున్నారా...? అసలు సంగతేంటంటే.. సూర్యా ఇటీవల నటించిన గ్యాంగ్ సినిమా సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆయన పలు టీవీ ఛానళ్లలో ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయన సాక్షి ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఇంటర్వ్యూల్లో భాగంగా సినిమా గురించి.. సినిమా విశేషాల గురించి యాంకర్ ఎలాగూ అడుగుతుంది కాబట్టి సూర్య కూడా సమాధానాలు చెప్పారు. అయితే సాక్షి ఛానల్ కాబట్టి.. దాని స్థాపకుడు జగన్ కాబట్టి ఎలాగూ ఆయన గురించి అడుగుతారు. అలాగే యాంకర్ కూడా జగన్ గురించి అడిగింది. మరి ఛానల్ వాళ్లది అయినప్పుడు సూర్య మంచి మాటలు చెబుతారు కానీ.. ఆయన అవినీతిపరుడనో.. లేక జైలుకు వెళ్లి, బెయిల్ పై బయట తిరుగుతున్నావ్ అని అనరు కదా. అలాగే జగన్ గురించి సూర్య నాలుగు మంచి మాటలు చెప్పాడు.
"ప్రజలకు ఏదో చేయాలన్న తపన, గొప్ప ఆలోచన, ఆశయాలతో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు" అని ఆయన అన్నాడు. తాను కాలేజీలో చదువుకుంటున్నప్పటి నుంచే వైఎస్ కుటుంబంతో పరిచయం ఉందని చెప్పిన ఆయన, తాననుకున్నది సాధించే క్రమంలో కష్టపడేతత్వం వైఎస్ జగన్ కు ఉందని అన్నారు. ఇంకేముంది.. దీన్ని పట్టుకుని సాక్షి టీవీ ఊదరగొట్టింది... మా జగనన్నకు సినిమా హీరోలు కూడా ఫాన్స్ ఉన్నారు అని చెప్తూ జగన్ బ్యాచ్ సోషల్ మీడియాలో ఒకటే రచ్చ చేశారు. అయితే ఈ అల్పసంతోషుల ఆనందం, సూర్య 24 గంటలు కూడా ఉంచలేదు... తన సినిమా గ్యాంగ్ ప్రమోషన్ లో భాగంగా, రాజమండ్రి, ఏలూరు, విజయవాడలో పర్యటించారు.... ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సూర్య మాట్లాడుతూ...అవినీతి అంతమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 1100 ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తూ, పరిష్కారం చూపటం చాలా మంచి విషయం అని..ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందిస్తూ, ఆయన చేస్తున్న కృషిని కొనియాడారు... చంద్రబాబు ఇక్కడ చేస్తున్న అన్ని మంచి పనులను స్వాగతిస్తున్నామని సూర్య అన్నారు... మొత్తానికి పాపం సూర్యని అడ్డుపెట్టుకుని, చంద్రబాబు మీద బురద జల్లుదాము అనుకున్న జగన్ బ్యాచ్ ఆనందం 24 గంటలు కూడా లేకుండా పోయింది..






