ప్రపంచాన్ని వణికిస్తున్న హీలియం కొరత.. గట్టెక్కేదెలా?

posted on: Mar 18, 2026 11:20AM

 

మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రభావం ప్రపంచ దేశాలపై తీవ్రంగా పడుతోంది.   చమురు సరఫరా నిలిచిపోయి ధరలు పెరగడంతో  ఆ ప్రభావం దాదాపు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలపైనా తీవ్రంగా పడింది. అయితే ఈ యుద్ధ ప్రభావం కేవలం చమురు ధరలపైనే కాదు..  అత్యంత కీలకమైన హీలియం గ్యాస్ సరఫరాపై కూడా తీవ్రంగా పడింది.   హర్మూజ్ జలసంధి గుండా రవాణా నిలిచిపోవడం వల్ల  హీలియం సరఫరా నిలిచిపోయే ప్రమాదం నెలకొంది. అదే జరిగితే  వైద్య  పారిశ్రామిక రంగాలు తీవ్ర సంక్షోభంలో పడతాయనడంలో సందేహం లేదు.  

హీలియం  వైద్య రంగానికి  అత్యంత ప్రాధాన్యం. ముఖ్యంగా ఎంఆర్‌ఐ  మెషిన్లు పని చేయాలంటే హీలియం అత్యవసరం. ఎందుకంటే ఎమ్ ఆర్ఐ మిషన్ లోని అయస్కాంతాలు శీతలీకరణలో ఉంచేందుకు ద్రవరూపంలోని   హీలియం అత్యవసరం. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే హీలియంలో   30 శాతం వినియోగం ఆస్పత్రులలోనే ఉంటుంది.

ఈ హీలియం సరఫరాలో అంతరాయం ఏర్పడితే.. ఇక వైద్యంలో అత్యంత కీలకమైన రోగనిర్థారణ పరీక్షలకు అంతరాయం కలుగుతుంది. అంతే కాకుండా ఎంఆర్ఐ స్కానింగ్ వంటి వాటి ఖర్చు తడిసిమోపెడౌతుంది.   ఇక పారిశ్రామిక రంగం విషయానికి వస్తే హిలీయం కొరత ఏర్పడితే.. సెమీకండక్టర్ పరిశ్రమ కుదేలౌతుంది.   స్మార్ట్‌ఫోన్లు, ఆటోమొబైల్స్, ఏఐ పరికరాల తయారీలో అత్యంత కీలకం అయిన చిప్స్ తయారీలో హీలియం వినియోగం ఉంటుంది. హీలియం సరఫరా చెయిన్ తెగిపోతే, అంటే హీలియం కొరత ఏర్పడితే..  ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తికి అంతరాయం కలగడం తథ్యం.   

google-ad-img
    Related Sigment News
    • Loading...