హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై సిఐడికి ఫిర్యాదు

posted on: Mar 12, 2026 7:22PM

 

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో భారీ స్థాయిలో ఆర్థిక అవకతవకలు జరిగినట్లుగా పలు ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి.. కోట్ల రూపాయల నిధులు దుర్విని యోగమయ్యాయని ఆరోపిస్తూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్  అధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. 2004 నుంచి 2026 వరకు హెచ్‌సీఎ నిర్వహణలో చోటుచేసుకున్న ఆర్థిక లావాదేవీలను సమగ్రంగా పరిశీలించాలని ఫిర్యాదులో కోరినట్లు తెలుస్తోంది.

ఫిర్యాదులో పలువురు ప్రముఖుల పేర్లు ప్రస్తావనకు రావడం గమనార్హం... ప్రస్తుత రాష్ట్ర మంత్రి డాక్టర్ జి. వివేక్‌తో పాటు హెచ్‌సీఎ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అజహరుద్దీన్, అలాగే ఏపెక్స్ కౌన్సిల్ సభ్యులు అమర్‌నాథ్, సర్దార్ దల్జీత్ సింగ్, టి. బసవరాజు తదితరులపై ఆరోపణలు చేసినట్లు సమాచారం....క్రికెట్ అభివృద్ధికి వినియోగిం చాల్సిన నిధులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం దారి మళ్లించారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఫిర్యాదులో వెల్లడైన వివరాల ప్రకారం 2004లో హెచ్‌సీఎ స్టేడియం అభివృద్ధి ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒప్పందంలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపించారు. విశాఖ ఇండస్ట్రీస్ అనే సంస్థతో కుదిరిన ఒప్పందం ప్రకారం సుమారు 60 కోట్ల విలువైన ప్రాజెక్ట్ చేపట్టినప్పటికీ, ఆ సంస్థ నుంచి కేవలం 6.5 కోట్లే చెల్లింపులు జరిగా యని, అయినప్పటికీ స్టేడియం పేరు మార్పు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇంకా 2016లో జరిగిన ఒక ఆర్బిట్రేషన్ కేసులో హెచ్‌సీఎపై 25.92 కోట్ల పరిహారం విధించినప్పటికీ, ఆ నిర్ణయాన్ని సవాలు చేయకుండా వదిలేయడం వల్ల వడ్డీతో కలిపి సంస్థకు భారీ ఆర్థిక నష్టం వాటి ల్లిందని ఆరోపించారు. ఈ వ్యవహారంలో పరస్పర లాభాల కోసం కొంతమంది కుట్ర పన్నినట్లుగా కూడా ఫిర్యాదులో ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా, హెచ్‌సీఎలో న్యాయవ్యవహారాల పేరిట కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ క్రికెట్ అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం నిర్లక్ష్యం పాలవు తున్నాయని ఫిర్యాదు దారులు ఆరోపించారు. బీసీసీఐ అనుమతి లేకుండా టోర్నమెంట్లు నిర్వహించడం, ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియలో అవినీతి చోటు చేసుకోవడం వంటి అంశాలు కూడా ఫిర్యాదులో ప్రస్తావ నకు వచ్చాయి. కొందరు ఆటగాళ్ల నుంచి జట్టులో అవకాశం కల్పించాలనే పేరుతో రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు డబ్బులు వసూలు చేస్తున్నారని కూడా ఆరోపించారు.

అదనంగా, కోర్టు ఆదేశాలు అమల్లో ఉన్నప్పటికీ హెచ్‌సీఎ ఖాతాల నుంచి కోట్ల రూపాయలు ఉపసంహ రించుకున్నట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్  ప్రతినిధులు  సీఐడీ అధికారులను కోరారు. దీంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో జరుగు తున్న ఆర్థిక వ్యవహారాలపై మరోసారి చర్చ మొదలైంది. సీఐడీ ఈ కేసులో దర్యాప్తు ప్రారంభిస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...