పోసాని కేసులో సజ్జలకు బెయిల్  మంజూరు

వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డిలను కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో తండ్రి కొడుకులు ఎపి హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో వీరికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.  వైకాపా నేతలకు బెయిల్ వచ్చిన  విషయం స్వంత పార్టీ ఒక ప్రకటన చేయకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. వైకాపా మీడియా సంస్థలో  కూడా తండ్రి కొడుకులకు బెయిల్ వచ్చిన వార్త ప్రాధాన్యత చోటు చేసుకోకపోవడం గమనార్హం.  కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటుడు పోసాని కృష్ణ మురళి తన నేరాన్ని అంగీకరించడంతో సజ్జల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. సజ్జల స్క్రిప్ట్ ప్రకారమే తాను కూటమి నేతలపై వ్యాఖ్యలు చేసినట్టు పోసాని వాంగ్యూలం ఇచ్చారు.  నటుడు , రచయిత, దర్శకుడైన పోసాని కృష్ణ మురళి చివరకు సజ్జల స్క్రిప్ట్ ప్రకారం అనుచిత వ్యాఖ్యలు చేసి జైలు పాలు కావాల్సి వచ్చింది. కోర్టులో ఆయన న్యాయమూర్తి ఎదుట భోరున విలపించడం ఎవరూ ఊహించలేకపోయారు. 
పోసాని కేసులో సజ్జలకు బెయిల్  మంజూరు Publish Date: Mar 28, 2025 11:20AM

చిన్న విషయాలకే కోపం వస్తోందా? సెకెండ్ల వ్యవధిలో చిరాకు పుడుతోందా? సమస్య ఇదే కావచ్చు..!

చిన్న విషయాలకే కోపంగా ఉంటారా?  ఎటువంటి కారణం లేకుండా చిరాకు పడుతున్నారా? అవును అయితే ఇది కేవలం మానసిక స్థితిలో మార్పు మాత్రమే కాదు మీ శరీరంలో కొన్ని ముఖ్యమైన విటమిన్ల లోపానికి సంకేతం కూడా కావచ్చని అంటున్నారు ఆరగ్య నిపుణులు. కోపం,  చిరాకు అనేది ఒత్తిడి లేదా పని ఒత్తిడి వల్ల మాత్రమే వస్తుందని మనం తరచుగా అనుకుంటాము. కానీ వాస్తవానికి పోషకాహార లోపం కూడా దీని వెనుక ఒక పెద్ద కారణం కావచ్చు. ఎప్పుడైనా ఇంట్లో వాళ్లు మాట్లాడుతుంటే..  లేదా ఇంట్లో వాళ్లు ఏదైనా సాధారణ పని చెబితే ఊహించని విధంగా వారి మీద అరిచేస్తుంటాం.  అలాగే స్నేహితులు,  చుట్టాలు,   తెలిసిన వారు పలకరించినప్పుడు  లేదా ఏదైనా విషయం గురించి సమాచారం అడిగినప్పుడు చిరాకుగా సమాధానం ఇస్తుంటారు.  ఎదుటి వ్యక్తులు ఈ మాత్రం దానికే ఇంత కోపమా? అని,  ఈ మాత్రం దానికే ఇలా చిరాకు పడాలా అని అనుకుంటూ ఉంటారు.  అయితే ఇదంతా మనిషి ఒత్తిడి వల్ల కలిగే సమస్య లేదా వాతావరణం వల్ల కలిగే సమస్య కానే కాదట.  ఇది స్పష్టంగా ఆహారం వల్ల వచ్చే సమస్య కూడా కావచ్చు అని అంటున్నారు ఆహార నిపుణులు,  ఆరోగ్య నిపుణులు. ఏ విటమిన్ లోపం వల్ల ఈ సమస్యలు వస్తాయో తెలుసుకుంటే.. మనకు ఎందుకు కోపం, చిరాకు వస్తుంది? కొన్నిసార్లు చిన్న విషయాలకే కోపంగా మాట్లాడటం లేదా ఎటువంటి కారణం లేకుండా చిరాకు పడటం మీ మనస్సు,  శరీర స్థితిని ప్రతిబింబిస్తుంది. ఒత్తిడి, నిద్ర లేకపోవడం,  హార్మోన్ల మార్పులు దీనికి ప్రధాన కారణాలు.  కానీ అవసరమైన పోషకాలు లేకపోవడం కూడా మానసిక స్థితిని పాడు చేస్తుంది. శరీరానికి అవసరమైన విటమిన్లు అందనప్పుడు నాడీ వ్యవస్థ బలహీనపడుతుంది.  ఇది  మానసిక స్థితిని నేరుగా ప్రభావితం చేస్తుంది. విటమిన్ బి కాంప్లెక్స్ లోపం.. విటమిన్ బి కాంప్లెక్స్‌లో బి1, బి6,  బి12 వంటి అనేక ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి. ఈ విటమిన్లన్నీ మన మనస్సును ప్రశాంతంగా,  సంతోషంగా ఉంచడంలో సహాయపడతాయి. వాటి లోపం మెదడులోని సెరోటోనిన్,  డోపమైన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్లను తగ్గిస్తుంది. ఇది మానసిక స్థితిలో మార్పులు,  కోపాన్ని పెంచుతుంది. విటమిన్ డి లోపం.. విటమిన్ డి సూర్యకాంతి నుండి లభిస్తుంది.  కాబట్టి దీనిని 'సూర్యరశ్మి విటమిన్' అని పిలుస్తారు. దీని లోపం మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.  దీని లోపం వల్ల  వ్యక్తి నిరాశగా,  చిరాకుగా అనిపించవచ్చు. మీరు ఎండలో తక్కువ సమయం గడిపినట్లయితే, విటమిన్ డి స్థాయిలు తగ్గవచ్చు. మెగ్నీషియం,  జింక్ లోపం..  మానసిక స్థితిని నియంత్రించడంలో మెగ్నీషియం,  జింక్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వాటి లోపం నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.  కోపాన్ని నియంత్రించడం కష్టమవుతుంది. విటమిన్లను ఎలా చూసుకోవాలి? ప్రతిరోజూ కనీసం 20-30 నిమిషాలు ఎండలో గడపాలి. ఆకుపచ్చ కూరగాయలు, తృణధాన్యాలు, పాలు,  గుడ్లు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. వైద్యుడి సలహా మేరకు  సప్లిమెంట్లను తీసుకోవచ్చు.  యోగా,  ధ్యానం నుండి చాలా ప్రయోజనం పొందవచ్చు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. *రూపశ్రీ.   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
చిన్న విషయాలకే కోపం వస్తోందా?  సెకెండ్ల వ్యవధిలో చిరాకు పుడుతోందా? సమస్య ఇదే కావచ్చు..! Publish Date: Mar 28, 2025 11:18AM

తెలంగాణలో పరువు హత్య

తెలంగాణలో పరువుహత్య వెలుగులోకి వచ్చింది. తన కుమార్తెను ప్రేమిస్తున్నాడన్న కోపంతో పెద్దపల్లి జిల్లాలో 17 ఏళ్ల యువకుడిని ఆ అమ్మాయి తండ్రి దారుణంగా హత్య చేశాడు. వివరాలిలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరి తోట గ్రామానికి చెందిన 17 ఏళ్ల సాయికుమార్ గౌడ్ అదే గ్రామానికి చెందిన సదయ్య కుమార్తెతో ప్రేమలో పడ్డాడు. వీరి ప్రేమ వ్యవహారం తెలిసిన సదయ్య కోపంతో రగిలిపోయాడు.  చదువు సంధ్యలు లేకుండా గ్రామంలో ఖాళీగా తిరుగుతున్న సాయికుమార్ తన కుమార్తెతో ప్రేమలో పడటం సదయ్యకు నచ్చలేదు. మందలించినా ఫలితం లేకపోవడంతో సాయికుమార్ ను గొడ్డలితో నరికి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన గురువారం రాత్రి జరిగింది. తన పుట్టిన రోజును స్నేహితులతో జరుపుకుంటున్న సాయికుమార్ ను సదయ్య గొడ్డలితో నరికి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  
తెలంగాణలో పరువు హత్య Publish Date: Mar 28, 2025 10:47AM

అఖిల భారత రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ కు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం (మార్చి 28) చెన్నైకు బయలు దరి వెళ్లారు. అక్కడ జరిగే అఖిల భారత రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిల్ లో ఆయన ప్రసంగిస్తారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై మీనంబాకం ఓల్డ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న చంద్రబాబుకు చెన్నైలోని తెలుగుదేశం శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఇక మద్రాస్ లోని ఐఐటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ లో చంద్రబాబు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అసంతరం సాయంత్రం నాలుగు గంటలకు అక్కడ నుంచి బయలుదేరి విజయవాడ చేరుకుంటారు.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండో సారి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చంద్రబాబు చెన్నై పర్యటనకు వెళ్లడం  ఇదే తొలిసారి.
అఖిల భారత రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ కు చంద్రబాబు Publish Date: Mar 28, 2025 10:31AM

అమీన్ పూర్ లో విషాదం!

ఏం కష్టమొచ్చిందో? ఎంతగా నలిగిపోయిందో.. ఆ తల్లి కడుపున పుట్టిన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి, తానూ తీసుకుంది. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో చోటు చేసుకుంది. అమీన్ పూర్ రాఘవేంద్రనగర్ కాలనీలో నివాసం ఉంటున్న రజిత అనే మహిళ తన ముగ్గురు పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి తినిపించింది. ఈ తరువాత తానూ తిని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో పిల్లలు ముగ్గురూ మరణించగా, తల్లి మాత్రం చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మరణించిన పిల్లలు  సాయికృష్ణ‌(12), మ‌ధుప్రియ‌(10), గౌత‌మ్‌ (8)ల‌ మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.   పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి తినిపించి, తానూ తిన్న రజిత.. భర్త చెన్నయ్యకు మాత్రం విషం కలిపిన పెరుగన్నం పెట్టకుండా పప్పు అన్నం మాత్రమే పెట్టింది. కుటుంబ గొడ‌వ‌ల కార‌ణం గానే ర‌జిత ఈ అఘాయిత్యానికి ఒడిగ‌ట్టిన‌ట్లు బంధువులు చెబుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
అమీన్ పూర్ లో విషాదం! Publish Date: Mar 28, 2025 10:19AM

మంచివాడు మా రేవంత్!

పదిహేను నెలల నిరీక్షణ అనంతరం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కబోతోందన్న టాక్ వినిపిస్తోంది.  శాసనసభలో, లాబీల్లోనూ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిని పలు వురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి అభినందనలు తెలుపుతున్నారు. శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన హామీతో రాజగోపాల్‌రెడ్డి తిరిగి సొంత పార్టీకి చేరుకున్నారు. మునుగోడు నుంచి ఆయన విజయం సాధించడంతో పాటు భువనగిరి ఎంపీగా చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని గెలిపించుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అప్పగించిన బాధ్యతను పక్కాగా నిర్వర్తిం చారు. దీంతో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా మంత్రి పదవి ఖాయమన్న భరోసా రాజగోపాల్‌రెడ్డి వర్గీయుల్లో ఉంది.  కేబినెట్‌ విస్తరణకు ముహూర్తం ఖరారైన నేపథ్యంలో తనకు అధిష్టానం ఏ పదవి అప్పగించినా బాధ్యతతో నిర్వహిస్తానని రాజగోపాల్‌రెడ్డి అంటున్నారు. అయితే ఆయన అనుచరులు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఆయన అభిమానులు మాత్రం రాజగోపాల్‌రెడ్డి  హోంమంత్రిగా బాధ్య తలు అప్పగిస్తే బాగుంటుందని పేర్కొంటున్నారు. ఆ క్రమంలో పీసీసీ పదవిని రేవంత్ రెడ్డి రూ. 50 కోట్లకు కొన్నాడని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మంచోడు కాబట్టే మీరు ఫామ్ హౌస్ లో ప్రశాంతంగా ఉన్నారనీ, లేకపోతే నిన్నటి నుంచి ఒక లెక్క, ఈరోజు నుంచి మరో లెక్క అన్నట్టుగా ఉండేదని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు ఆర్ అండ్ బీ మినిస్టర్‌గా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన శాఖ మార్చాలని కోరుతున్నారట. ఈ నేపధ్యంలో అన్నదమ్ములిద్దరు రేవంత్‌కు మద్దతుగా గొంతెత్తుడటం ఇంట్రస్టింగ్‌గా తయారైంది.
మంచివాడు మా రేవంత్! Publish Date: Mar 28, 2025 9:45AM