వాలెంటైన్ వీక్.. కొండంత భరోసా ఇవ్వగలిగేది ఆత్మీయ కౌగిలింత..!
posted on Feb 12, 2025 9:30AM

కౌగిలి అనే పదానికి చాలా రకాల అర్థాలు చెబుతుంటారు. చూసే దృష్టిని బట్టి అర్థం మారుతుంది అంటారు. అలాగే ప్రతి విషయంలోనూ రెండు కోణాలు ఉంటాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వాలెంటైన్స్ వీక్ హవా కొనసాగుతోంది. ఈ వాలెంటైన్స్ వీక్ అందరికీ సంబంధించినదే అయినా స్పెషల్ గా ప్రేమికులు ప్రాముఖ్యత ఇస్తారు. వాలెంటైన్స్ వీక్ లో హగ్ డే కూడా ఒకటి. ఈ రోజును ఆరోగ్యకరంగా ఎలా జరుపుకోవాలంటే..
హగ్ చేసుకోవడం పరిస్థితిని బట్టి అర్థాలు ఇస్తుంది. కానీ ఒక అమ్మాయి, అబ్బాయి హగ్ చేసుకుంటారు అంటే చూట్టూ ఉన్న అందరి కళ్లు నానా రకాలుగా అర్థాలు వెతుక్కుంటాయి. ఇష్టపడిన ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు కౌగిలించుకోవడం అంటే.. వారి మధ్య ఉండే అపార్థాలు, దాపరికాలు చెరిపేసుకోవడమే.. వాలెంటైన్ వీక్ ను ఎంతో సంబంరంగా జరుపుకునే ప్రేమికులు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.
ప్రేమించిన వ్యక్తిని తన సొంతం అనుకుని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అంత మాత్రం చేత ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు. అందులో ఇంకా పెళ్లి చేసుకోకుండా ప్రేమ పేరుతో తొందర పడకూడదు.
ప్రేమించిన అమ్మాయిని ఈ వాలెంటైన్స్ వీక్ లో భాగంగా కౌగిలించుకోవడానికి ముందు అమ్మాయి అనుమతి తప్పక తీసుకోవాలి. అమ్మాయికి ఇష్టం లేకుండా ఈ స్టెప్ వేయకూడదు.
ప్రేమికుల జంట ఏదైనా పని చేసే ముందు సమాజాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. పబ్లిక్ లో ఎలాంటి పనులు చేయకూడదు. సమాజం పట్ల భాద్యగా ఉండాలి.
కౌగిలి..
కౌగిలి అనేది కేవలం ప్రేమికుల మధ్య మాత్రమే కాదు.. వాలెంటైన్స్ వీక్ ఎలాగైతే ఇష్టమైన వారితో ఎలాంటి సంబంధం ఉన్నవారితో అయినా ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోవచ్చో.. హగ్ డే కూడా అలాగే జరుపుకోవచ్చు. తల్లిదండ్రులు, స్నేహితులు, తోడబుట్టిన వారు..ఆత్మీయులు, కష్టాలలో తోడుగా నిలిచేవారు, మంచి దారి చూపించేవారు..ఇలా ఎవరిని అయినా మనసుకు దగ్గరా చేసుకుని ఆత్మీయంగా ఒక కౌగిలింత ద్వారా కొండంత భరోసాను ఇద్దరి బంధంలో నింపుకోవచ్చు.
*రూపశ్రీ.