అగస్టా పై రాజ్యసభలో రచ్చ... ఎంపీ ని బయటకు వెళ్లిపోమన్న స్పీకర్


ప్రస్తుతం రాజ్యసభలో అగస్టా స్కాం గురించి ప్రతిపక్ష విపక్షాల మధ్య ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సభకు పదే పదే అడ్డుపడుతున్న నేతను రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ సభ నుండి బయటకు పంపేశారు. ఇంతకీ ఆ నేత ఎవరంటే తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు శేఖర్ రాయ్. సభలో అగస్టా స్కాం గురించి చర్చ జరుగుతుండగా.. అగస్టా చాపర్ల కుంభకోణంలో చర్చకు ఆయన నోటీసును ఇచ్చారు. అయితే దీనిని తిరస్కరిస్తున్నట్టు అన్సారీ ప్రకటించారు. కానీ శేఖర్ రాయ్ మాత్రం పట్టుబట్టి.. రక్షణ మంత్రి పారికర్ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు అన్సారీ ఎన్ని సార్లు వారించిన వినకుండా నినాదులు చేస్తుండటంతో సహనం కోల్పోయిన ఆయన శేఖర్ ను బయటకు వెళ్లిపోవాలని..ఈ రోజు తిరిగి సభలో అడుగు పెట్టరాదని ఆదేశించారు.