Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నరసింహన్ దైవాంశ సంభూతుడు
posted on: Jun 20, 2015 2:54PM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు గవర్నర్‌గా వున్న మాజీ పోలీసు అధికారి నరసింహన్ గారిని ఎవరూ విమర్శించడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన చాలా మంచి మనిషి. ఆయనకు పక్షపాతం అంటే ఎంతమాత్రం తెలియదు. నరసింహన్ చూడ్డానికి మానవుడిలా అనిపిస్తారు గానీ, ఆయన దైవాంశ సంభూతుడు. ఇంకా మాట్లాడితే సాక్షాత్తూ దేవుడే ఈ భూమ్మీదకు నరసింహన్ గారి రూపంలో వచ్చాడు. అలాంటి వ్యక్తి అసలు ఒక రాష్ట్రానికి అనుకూలంగా, మరో రాష్ట్రానికి వ్యతిరేకంగా ఎందుకు వ్యవహరిస్తారు? నరసింహన్ గారిని విమర్శించొద్దని అన్నాం కదా అని పొగడాలని ప్రయత్నించేరు... ఆయనకు పొగడ్తలంటే అస్సలు ఇష్టం వుండదు. పొగడకుండా ఆయన కాళ్ళమీద పడిపోయి కాకాపట్టాలని అనుకుంటున్నారా? ఆ పప్పుడూ ఉడకవు. ఆయన తన కాళ్ళమీద ఎవరు పడినా వారిని అస్సలు పట్టించుకోరు. అలా కాళ్ళ మీద పడిన వారికి అనుకూలంగా అస్సలు వ్యవహరించరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్‌గా వున్నప్పుడుగానీ, ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు గవర్నర్‌గా విధులు నిర్వర్తిస్తున్నప్పుడు గానీ ఆయన వ్యహరిస్తున్న తీరు సూపర్. ముఖ్యంగా ఏపీ, తెలంగాణల మధ్య ఏర్పడుతున్న వివాదాలను ఆయన తనదైన శైలిలో చిటికెలో పరిష్కరిస్తున్నారు. అందుకే రెండు రాష్ట్రాల ప్రజలు ఆయనని ఎంతో గౌరవిస్తున్నారు. ఆయన తమకు గవర్నర్‌గా ఇంకా చాలాకాలం కొనసాగాలని కోరుకుంటున్నారు. మరి అంత మంచి మనిషిని, సమర్థుడైన గవర్నర్ని ఎవరూ అస్సలు ఎంతమాత్రం విమర్శించకూడదు.


.jpg)



