ధనిక రాష్ట్రం కాదు.. ఇది ఇంకో బీమార్ స్టేట్

“ఇంటి పేరు శొంటి వారు.. ఇంట్లో గబ్బిలాల కంపు” ఈ సామేత ఎంతమంది విన్నారో ఏమో కానీ, ధనిక రాష్ట్రం తెలంగాణలో ఆర్ధిక పరిస్థితి అదే దయనీయ పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్’ ఓపెన్ చేస్తే, రాష్ట్రంలో ఎటు చూస్తే అటు అభివృద్ధి వెలుగులే కనిపిస్తాయి. కానీ, స్వయంగా ఆయన సారధ్యంలోని , మున్సిప్ల శాఖలోమాత్రం అన్ని దిక్కులా చీకట్లే.. జీహెచ్ఎంసీలోనే  కాంట్రక్టర్లకు నెలల తరబడి, చెల్లిపులు లేవు. ఏపీలో లాగా ఇంకా కాంట్రాక్టర్లు వీధుల్లోకి వచ్చి బిచ్చమెత్తుకునే పరిస్థితి వచ్చినట్లు లేదు గానీ, కాంట్రాక్టర్ల ఆకలి కేకలు, ఆత్మహత్యలు అయితే వార్తల్లో కనిపిస్తున్నాయి. 

గత(2021) మార్చి నుంచి ఇంతవరకు జీహెచ్ఎంసీ పరిధిలో చేసిన పనులకు, అరకొర చెల్లింపులే గానీ, పూర్తి స్థాయి చెల్లింపులు జరగడం లేదు.అది కూడా అస్మదీయ కాంట్రాక్టర్లకు మాత్రమే అంతో ఇంతో చెల్లింపులు చేస్తున్నారు. మిగిలిన వరికి చెల్లింపులు జరగడం లేదని అంటున్నారు. చెల్లింపులు జరగక పోవడంతో  కాంట్రాక్టర్లు ముఖ్యంగా. చిన్న కాంట్రాక్టర్లు ఆర్ధికంగా చితికిపోయి, బ్యాంకులకు ఈఎంఐలు, ప్రైవేటు వ్యాపారులకు వడ్డీలు చెల్లించలేక ఉన్న ఆస్తులు తెగనమ్ముకోవలసిన దుస్థితి వచ్చిందని వాపోతున్నారు. గత మార్చి(2021)మార్చి నుంచి ఇప్పటివరకూ సుమారు రూ 500 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించాల్సిన గ్రేటర్ కార్పొరేషన్, రేపు మాపు అంటూ చేల్లిపులు వాయిదాల మీద వాయిదాలు వేస్తోందని కాంట్రాక్టర్లు,అటున్నారు. అంటే కాదు బకాయిలు చెల్లిస్తేనే జీహెచ్ఎంసీ పనులు ఇక చేసేది లేదని తెగేసి చెపుతున్నారు.కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన కొవిడ్ వాక్సిన్, ప్రజలకు ఇచ్చేందుకు నియమించిన వ్యాక్సినేషన్ సిబ్బంది జీతాల సంగతి దేవుడెరుగు,  వారికి  పెట్టిన భోజనాల బిల్లులు కూడా, మూడు నెలల నుంచి చెల్లించలేని దుస్థితి ఏర్పడింది. ఆ స్థాయిలో  మున్సిపల్ శాఖ ఖజానా వట్టి పోయిందని అధికారులే అంగీకరిస్తున్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగి సంవత్సరం కావస్తున్నా,ఇంత వరకు ఒక్కసారి కూడా మేయర్ గద్వాల్ విజయలక్షి సర్వసభ్య సమావేశం జరప లేదని, అభివృద్ధి పనులు అసలే జరగడం లేదని, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదని ఆరోపిస్తూ  బీజేపీ కార్పొరేటర్లు మెరుపు ధర్నా చేశారు. అయినా ఫలితం లేక పోగా బీజేపీ కార్పొరేటర్లఫై పోలీసులు కేసులు పెట్టారు.హైదరాబాద్ పరిథిలోని 6 మున్సిపల్ సర్కిళ్లలో దాదాపు 2 వేలమంది చిన్నా, పెద్ద స్థాయి కాంట్రాక్టర్లు చేసిన పనులకు, ఇప్పటివరకూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ , సుమారు 500 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని కాంట్రాక్టర్లు చెపుతున్నారు.  ఇవి కాక, భోజనాల ఏర్పాటు వంటి అనధికారికంగా చేసిన పనులకు మరో రూ.50 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.కాగా బిల్లుల కోసం గ్రేటర్ హెడ్డాఫీసు చుట్టూ తిరుగుతున్నా, ఫలితం ఉండటం లేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. కమిషనర్‌ను కలిసినా ప్రభుత్వం నుంచి నిధులు రాలేదనో, ప్రాపర్టీ టాక్సులు వసూలయిన తర్వాత ఇస్తామనో చెబుతున్నారని కాంట్రాక్టర్లు వెల్లడించారు. 

నిజానికి ఒక్క మున్సిపల్ శాఖలోనే కాదు, చాలా వరకు ప్రభుత్వ శాఖల్లో ఇదే పరిస్థితి ఉందని ఆర్ధిక రంగ నిపుణులు అంటున్నారు. రైతుల నుంచి ధాన్యం కొనేందుకు కూడా నిధులు లేకనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నెపాన్ని కేంద్రం మీదకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆర్థిక శాఖ వర్గాల సమాచారం. అందుకే తెలంగాణ పేరుకే ధనిక రాష్ట్రం ..వాస్తవంలో మాత్రం ఇరుగు పొరుగు రాష్ట్రాలలానే ఇదీ ఇంకొక బీమార్  స్టేట్  అంటున్నారు .