మంత్రి తలసానికి జీహెచ్ఎంసీ షాక్.. 

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ షాకిచ్చింది. నగరంలో నిషేదం ఉన్నా ఫ్లెక్సీ ఏర్పాటు చేసినందుకు ఆయనకు ఐదు వేల రూపాయల ఫైన్ విధించింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు 30 వేల రూపాయల జరిమానా వేసింది బల్దియీ ఈవీడీఎం. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 లో కటౌట్ ఏర్పాటు చేసినందు MLA దానం నాగేందర్ కు ఫైన్ విధించింది.

ఈనెల 25న హైదరాబాద్ లోని హైటెక్స్ లో టీఆర్ఎస్ ప్లీనరీ జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్ మొత్తాన్ని గులాబీ మయం చేశారు అధికార పార్టీ నేతలు, నగరంలో భారీగా కటౌట్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ , కేటీఆర్ ఫోటోలతో నింపేశారు. టీఆర్ఎస్ జెండాల కట్టేశారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో నెలువెత్తు స్వాహత తోరణాలు ఏర్పాటు చేశారు. మొత్తంగా ప్లినరీ రోజున హైదరాబాద్ మొత్తం గులాబీమయంగా కనిపించింది. 

నిజానికి గ్రేటర్ పరిధిలో బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టడంపై నిషేదం ఉంది. గతంలో చిన్నచిన్న బ్యానర్లు కట్టినందుకే పలువురి నుంచి  ఫైన్ వసూల్ చేసింది బల్దియా. కాని ప్లీనరీ సందర్భంగా నగరం మొత్తం టీఆర్ఎస్ నేతలు పెద్దపెద్ద కటౌట్లు. బ్యానర్లు, ప్లెక్సీలు కట్టినా చూసిచూడినట్టుగా వదిలేసింది. జీహెచ్ఎంసీ తీరుపై తీవ్ర విమర్సలు వచ్చాయి. టీఆర్ఎస్ జెండాల అలంకరణపై బల్దియాకు ఫిర్యాదులు కూడా భారీగానే వెలువెత్తాయి. అయినా అధికారులు స్పందించలేదు.

బీజేపీ నేతలు బల్దియా ప్రధాన కార్యాలయం దగ్గర ఆందోళన కూడా చేశారు. గ్రేటర్ హైదరాబాద్ అధికారుల తీరుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే తమ సర్వర్ పని చేయడం లేదని, తమకు వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటామని అప్పుడు కమిషనర్ ప్రకటింటారు. గడచిన కొన్ని రోజులుగా సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ సర్వర్ డౌన్ ఉండటం కారణంగా ఫైళ్లను నిలిపి వేసిన అధికారులు. ఈరోజు నుండి మళ్లీ ఫైళ్లను వేయడం ప్రారంభించారు. మొదటగా ఎమ్మెల్యే దానం నాగేందర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు జరిమానా విధించారు.