Top Stories

ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై..కమలం పార్టీ కన్ను ఆ రాష్ట్రంపైనే..!

  ఏపీ రాజ్య సభ విషయంలో కూటమి సర్కార్ కీలక నిర్ణయానికి వచ్చింది. ఇవాళ కేంద్రమంత్రి అమిత్‌షాతో  సీఎం చంద్రబాబు భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ సీటు విషయంలో... టీడీపీ పార్టీ అలాగే జనసేన రెండు కాంప్రమైజ్ అయ్యాయి. ఏపీ రాజ్యసభ స్థానం బిజెపికి ఇచ్చేందుకు... టిడిపి అలాగే జనసేన రెండు పార్టీలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం బిజెపికి కేటాయించారు.ఈ మేరకు ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో.. రాజ్యసభ అభ్యర్థి పై చర్చ జరిగింది. అమిత్ షా... నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడు ను కిషన్ రెడ్డి కూడా కలిశారు. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా తో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి తమిళనాడు మాజీ బిజెపి అధ్యక్షుడు అన్నామలైను అభ్యర్థిగా నిలపబోతున్నట్టు అమిత్‌షా, చంద్రబాబు తెలిపినట్లు తెలుస్తోంది. కొత్తగా ఈ రాజ్యసభ రేసులో మాజీ కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది.  వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. అక్కడ పాగా వేయాలని కమలం పార్టీ కీలక అడుగులు వేస్తోంది. ఇప్పటికే అన్నాడీఎంకేతో పొత్తు ఖరారు చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు తమిళనాడు బీజేపీ శాఖ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై తన పదవి నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే జాతీయ స్థాయిలో అన్నామలైకి మంచి గుర్తింపు ఇస్తామని.. బీజేపీ హైకమాండ్ ఇప్పటికే హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.  ఏప్రిల్ 15వ తేదీన ఈ ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. నామినేషన్ దాఖలకు చివరి తేదీ ఏప్రిల్ 29 గా నిర్ణయించారు అధికారులు. ఇక 30వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు మే రెండవ తేదీ నిర్ణయించారు. మే 9వ తేదీన ఎన్నిక నిర్వహిస్తారు. వైసిపి పార్టీ సీట్ల ప్రకారం వాళ్లకు అవకాశం లేదని తెలుస్తోంది. అంటే ఈ రాజ్యసభ ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై..కమలం పార్టీ కన్ను ఆ రాష్ట్రంపైనే..! Publish Date: Apr 22, 2025 8:02PM

కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు... ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులతోనే పోటీ

  కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతు పదేళ్లలో చేయని అభివృద్ధి ఇప్పుడు చేస్తారా? అని ప్రశ్నించారు. స్ధానిక ఎమ్మెల్యే సంజయ్‌కి మా కంటే ఎక్కువ అనుభవం ఉందా? అని మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అభివృద్ధి విషయంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పోటీ పడ్డానని గుర్తు చేసుకున్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అరాచకాలపై తాము నిరంతరం పోరాటం చేశామని, ఆ పోరాట ఫలితంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చామని అన్నారు. గతంలో ఎమ్మెల్యే సంజయ్ హస్తం పార్టీలో చేరడంతో కనీసం తన సంప్రదించకుండా పార్టీలో ఎలా చేర్చుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి కాంగ్రెస్ అధిష్టానం జీవన్‌రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.  రాష్ట్రంలో సీఎం రేవంత్ పార్టీలో సీనియర్ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని తరుచుగా ఆయన వాపోతున్నారు.  వి. హనుమంత్ రావు తర్వాత పార్టీలో నేనే సీనియర్ అని ఆయన తెలిపారు. అంతేకాకుండా… జానారెడ్డి కూడా నా తర్వాత పార్టీ లో నాలుగు సంవత్సరాల తర్వాత చేరాడని, పార్టీలో భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు పార్టీని వీడనని ఆయన తెలిపారు. నేను అసంతృప్తితోనే ఉన్నాను నా సీనియారిటీకి తగిన గౌరవం లభించలేదు కాబట్టి అసంతృప్తితోనే ఉన్నానని, 2014లో మూడు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నేనొక్కడినే ఎమ్మెల్యేగా అని జీవన్‌ రెడ్డి పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాలు కాంగ్రెస్ అంటే నేను.. నేను అంటే కాంగ్రెస్ గా పార్టీ ని బలోపేతం చేశా అని ఆయన వెల్లడించారు. గతంలో జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డి హత్యతో జీవన్ రెడ్డి మరింత మనస్తాపం చెందారు. గంగారెడ్డి హత్య చేసిన నిందితుడిని పట్టుకోవాలని రోడ్డు పై బైఠాయించారు. జీవన్‌రెడ్డి వైఖరితో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ముందు గొయ్యి వెనుక లాగా మారింది.
కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు... ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులతోనే పోటీ Publish Date: Apr 22, 2025 7:31PM

ప్రధాని మోదీకి సౌదీ అరేబియాలో అపూర్వ స్వాగతం

  భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సౌదీ అరేబియా ప్రభుత్వం అపూర్వ రీతిలో స్వాగతం పలికింది. ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న విమానం సౌదీ అరేబియా గగనతలంలోకి ప్రవేశించగానే, రాయల్ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన యుద్ధ విమానాలు దానిని అనుసరిస్తూ ప్రత్యేక గౌరవం అందించాయి. ప్రధాని విమానానికి ఇరువైపులా ఎస్కార్ట్‌గా వచ్చిన ఎఫ్‌-15 ఫైటర్ జెట్‌లు ఆయనకు స్వాగతం పలికినట్లు విదేశాంగ శాఖ విడుదల చేసిన వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇటువంటి గౌరవం చాలా అరుదుగా లభిస్తుంది. ఈ ప్రత్యేక స్వాగతం ఇరు దేశాల మధ్య, ముఖ్యంగా రక్షణ రంగంలో బలపడుతున్న సంబంధాలకు నిదర్శనంగా విశ్లేషకులు భావిస్తున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని  సౌదీ అరేబియా చేరుకున్నారు.  ఈ పర్యటనలో ప్రధానంగా ఇంధనం, వాణిజ్యం, రక్షణ వంటి కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నారు. ఇటీవల మోదీ, సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌ల మధ్య జరిగిన చర్చల అనంతరం పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. ఈ నేపథ్యంలో తాజా పర్యటన మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత్, సౌదీ అరేబియాల మధ్య ఇప్పటికే బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోంది. ఈ పర్యటన ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఇరు దేశాలు ఆకాంక్షిస్తున్నాయి. . దీనిపై ప్రధాని ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘ఈ పర్యటన రెండు దేశాల మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేయనుంది. ఈ రోజు, రేపు పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎదురుచూస్తున్నాను’’ అని చెప్పారు. మోదీ ఆ దేశానికి వెళ్లడం ఇది మూడోసారి  
ప్రధాని మోదీకి సౌదీ అరేబియాలో అపూర్వ స్వాగతం Publish Date: Apr 22, 2025 6:52PM

సెంటిమెంట్ పండుతుందా?.. సభ సక్సెస్ అవుతుందా?

ఒకే ఒక్క మాటతో రాజకీయం తల్లకిందులు అయిపోయిన సందర్భాలు చరిత్రలో కాదు, నడుస్తున్న చరిత్రలోనూ చాలానే ఉన్నాయి. అయినా.. రాజకీయ నాయకులు  ఎప్పటికప్పుడు నోరు జారుతూనే ఉంటారు. ఇందుకో తాజా  ఉదాహరణ  తెలంగాణ పీసీసీ చీఫ్, మహేష్ కుమార్ గౌడ్.     ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన ఆంధ్రా రైతులే తెలంగాణ రైతులకు వ్యవసాయం నేర్పించారంటూ  చేసిన వ్యాఖ్య  రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్  సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మరో వంక పీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్య తెలంగాణ రైతుల మనోభావాలను దెబ్బతీసిందని  బీఆర్ఎస్  నాయకులు ఒకరి వెంట ఒకరు కత్తులు దూస్తున్నారు.  అయితే..  నిజంగా అయన చేసిన వ్యాఖ్య తెలంగాణ రైతుల మనోభావాలను దెబ్బ తీసిందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే.. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడు అన్నట్లు బీఆర్ఎస్ కు మాత్రం పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు  చక్కగా అంది వచ్చాయని అంటున్నారు.  ఒక విధంగా చూస్తే  పీసీసీ అధ్యక్షుడు  బీఆర్ఎస్ కు, స్నేహ హస్తం అందించారని అంటున్నారు.   ఈ నెల  27 న వరంగల్ లో జరప తలపెట్టిన టీఆర్ఎస్/బీఆర్ఎస్ రజతోత్సవ సభ సక్సెస్ విషయంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మొదటి నుంచి  టీఆర్ఎస్/బీఆర్ఎస్  సభల సక్సెస్ కు ఇంధనంలా పనిచేసిన  సెంటిమెంట్ ఏదీ లేని ప్రస్తుత పరిస్థితిలో సభ సక్సెస్ పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే..  పార్టీ మనుగడకు  అత్యంత కీలకంగా భావిస్తున్న  రజతోత్సవ సభను ఎలాగైనా సక్సెస్ చేయాలని  బీఆర్ఎస్ అధినేత  కేసీఆర్  జిల్లాల వారీగా పార్టీ నాయకులకు ప్రతి రోజు పాఠాలు నూరిపోస్తున్నారు.  కాసులు కుమ్మరించి అయినా.. పెద్ద ఎత్తున జనసమీకరణ చేయాలని  నాయకులను కేసీఆర్ ఆదేశించినట్లు పార్టీ వర్గాల్లో వినవస్తోంది.  ఇలాంటి సమయంలో పీసీపీ చీఫ్  ఒక సెంటిమెంటల్ ఇష్యూ ని బంగారు పళ్ళెంలో పెట్టి  బీఆర్ఎస్ కు అందించారని అంటున్నారు. నిజానికి  గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి  ఇతర కారణాలతో పాటుగా సెంటిమెంట్ ఇష్యూ లేక పోవడం  కూడా ఒక కారణంగా బీఆర్ఎస్ నేతలు గుర్తించారు. అలాగే  తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చడంతో  పార్టీకి ఉన్న తెలంగాణ పేగుబంధం తెగిపోయిందని దాంతో  కారు  పార్టీని  సెంటిమెంట్ రివర్స్ లో దెబ్బ తీసిందని గులాబీ పార్టీ గుర్తించిందని అంటారు.  అదెలా ఉన్నా ప్రస్తుతానికి వస్తే.. తెలంగాణా ప్రభుత్వం సోమవారం ( ఏప్రిల్ 21)న  నిజామాబాద్‌లో నిర్వహించిన  ‘రైతు మహోత్సవ’ సభలో టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తెలంగాణ రైతుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా  ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన రైతులే తెలంగాణ రైతులకు వ్యవసాయం నేర్పించారంటూ వ్యాఖ్యానించారని బీఆర్ఎస్ నాయకులూ మండి పడుతున్నారు. నిజానికి  మహేష్ కుమార్ గౌడ్, చెప్పింది సంపూర్ణ సత్యం కాదు, అలాగని  సంపూర్ణ అసత్యమూ  కాదు.  అవును  1923లో నిజాంసాగర్‌ ప్రాజెక్టును నిర్మించినప్పుడు ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి పలువురు రైతులు ఇక్కడికి వచ్చి వ్యవసాయంలో స్థిరపడ్డారు. వారంతా వ్యవసాయం చేయడమే కాకుండా మాక్కూడా వ్యవసాయం నేర్పించారు  అంటూ చేసిన వ్యాఖ్య పూర్తి సత్యం కాకపోయినా పూర్తి అసత్యం కూడా కాదు.అక్కడి నుంచి ఇక్కడకు రైతులు వచ్చింది నిజం. కలిసి మెలసి వ్యవసాయం చేసింది నిజం. పరస్పరం అనుభవాలను పంచుకున్నది నిజం. పరస్పరం లాభదాయక వ్యవసాయ పద్దతులను నేర్చుకున్నది నిజం. ఇది చరిత్ర. కాదనలేని చరిత్ర. నిజానికి  మహేష్ కుమార్ గౌడ్  తమ ఉపన్యాసంలో చెప్పింది కూడా అదే. అందులో పెద్దగా తప్పు పట్టవలసింది లేదు.  అయినా అయన చేసిన  వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఆంధ్రా నుంచి వలస వచ్చిన వారు తెలంగాణ రైతులకు వ్యవసాయం నేర్పించారంటూ పీసీసీ అధ్యక్షుడు మాట్లాడటం తీవ్ర అభ్యంతరకరమని వ్యవసాయ శాఖ మాజీ  మంత్రి నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. మహేశ్‌కుమార్‌గౌడ్‌ అపరిపక్వత, అజ్ఞానంతో మాట్లాడిన మాటలు తెలంగాణకు తీవ్ర అవమానకరమని పేర్కొన్నారు.ఆంధ్రా పాలకుల మెప్పుకోసమే ఆయన దిగజారుడు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. తెలంగాణకు బీఆర్‌ఎస్  శ్రీరామరక్ష అని కేసీఆర్‌ పదే పదే చెప్పిన విషయం పీసీసీ చీఫ్‌ మాటలతో తేటతెల్లమైందని అన్నారు.  అలాగే..  మరో మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కూడా మహేశ్‌కుమార్‌ గౌడ్ వైఖరి యావత్‌ తెలంగాణ సమాజాన్ని అవమానించినట్టు ఉన్నదని అన్నారు. భావదారిద్య్రంలో ఉన్న కాంగ్రెస్‌ నాయకులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం దురదృష్టకరమని పేర్కొన్నారు. నాడు తెలంగాణ ఏర్పాటుకు అడ్డుపడ్డ సమైక్య పాలకుల అడుగులకు మడుగులొత్తిన కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు తెలంగాణలో ఉన్నామనే సోయి మరిచి మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలవి బానిస బతుకులని, వారికి బొత్తిగా తెలంగాణ సోయి లేదని బీఆర్‌ఎస్‌ పార్టీ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి విమర్శించారు. అయితే.. పీసీసే చీఫ్ చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్/బీఆరేస్ రజతోత్సవ సభను సక్సెస్ చేసేందుకు ఎంతవరకు ఉపకరిస్తాయి. ఏ మేరకు సభ సక్సెస్ అవుతుంది అనేది అప్పుడే చెప్పలేమని అంటున్నారు. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేకత దినదినాభి వృద్ధి కాదు, క్షణక్షణాభి వృద్ది చెందుతోంది. అందులో అనుమానం లేదు. కానీ..  కుటుంబ చట్రం నుంచి బయట పడక పోవడం ఇప్పటికీ బీఆర్ఎస్  కు శాపంగానే ఉందని పరిశీలకులు అంటున్నారు. సో. సభ సక్సెస్  అవుతుందా, చప్పగా ముగుస్తుందా? అంటే.. ప్రస్తుతానికి  ‘నో కామెంట్’ అనేదే సరైన సమాధానం అవుతుందని అంటున్నారు.
సెంటిమెంట్ పండుతుందా?.. సభ సక్సెస్ అవుతుందా? Publish Date: Apr 22, 2025 5:24PM

బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేపై సీఐడీ కేసు

  వేములవాడ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌పై సీఐడీ కేసు నమోదు చేసింది. భారత పౌరసత్వం లేకపోయినా తప్పుడు పత్రాలు సమర్పించిన ఎన్నికల్లో పోటీ చేశారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. చెన్నమనేని రమేష్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఫిర్యాదుతో చెన్నమనేనిపై తెలంగాణ సీఐడీ అధికారులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను అందించాలని పిలుపునిచ్చింది. బుధవారం కేసు వివరాల్ని అందించేందుకు ఆది శ్రీనివాస్‌ సీఐడీ ఎదుట హాజరుకానున్నారు. మాజీ ఎమ్మెల్యే చెన్నమనేనిపై  పౌరసత్వంపై ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నారు. తాజాగా,ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ హైకోర్టులో చెన్నమనేని పౌరసత్వంపై పలు దఫాలుగా విచారణ చేపట్టింది. విచారణలో గతేడాది డిసెంబర్‌ నెలలో చెన్నమనేని రమేష్‌ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తేల్చిచెప్పింది. భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ 2019లో జారీ చేసిన నోటిఫికేషన్‌ను సమర్థించింది. తప్పుడు పత్రాలతో గత 15 ఏళ్లుగా న్యాయస్థానాన్ని, అధికారులను తప్పుదోవ పట్టించారని ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జర్మనీ పౌరుడినని తెలిసినా పలు పిటిషన్లు దాఖలు చేసి కోర్టు సమయాన్ని వృథా చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. 2009లో తొలిసారి వేములవాడ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించింది  చెన్నమనేని రమేష్‌ మొదలు చెన్నమనేని భారతీయ పౌరుడా కాదా అనే వివాదం కొనసాగుతోంది. పౌరసత్వ వివాదంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలను సోమవారం మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ హైకోర్టు ద్వారా అందజేశారు. తన పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ హైకోర్టులో సవాల్‌ చేయగా.. ఆయన పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి కొట్టివేసింది. అంతేగాకుండా పౌరసత్వంపై ఫిర్యాదు చేసిన ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు, లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీకి రూ.5 లక్షలను నెల రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించారు. మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ తీసుకున్న ప్రభుత్వ జీతమంతా  తిరిగి ఇచ్చేయాలని సీపీఐ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ఆయన న్యాయ వ్యవస్థలను,కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేశారని విమర్శించారు. ఇండియన్ సిటిజన్ కాకపోయినా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ప్రభుత్వ జీతం తీసుకున్నాడని..అంతటితో ఆగకుండా ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకొని అనేక వ్యాపారాలు చేసుకుని లబ్ధి పొందాడన్నారు. అందుకే ఆయన తీసుకున్న ఎమ్మెల్యే పదవికాలంలో తీసుకున్న మొత్తం  జీతం అంతా తిరిగి ఇచ్చేయాలని..దీనిపై అవసరమైతే తాను కోర్టును కూడా ఆశ్రయిస్తామని  నారాయణ స్పష్టంచేశారు.   
బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేపై సీఐడీ కేసు Publish Date: Apr 22, 2025 4:57PM

స్మిత‌.. ఏంటీ ప్ర‌భుత్వ వ్య‌తిరే.. కత‌!

స్మిత స‌బ‌ర్వాల్ రాజ‌కీయాల్లో చేర‌నున్నారా? అయితే ఏ పార్టీ నుంచి..??  స్మితా స‌బ‌ర్వాల్ సీనియ‌ర్ ఐఏఎస్ అధికారిణి. 2001లో ట్రైనీ ఐఏఎస్ గా కెరీర్ మొద‌లు పెట్టి.. బీఆర్ఎస్ హ‌యాంలో సీఎంఓలో అపాయింట్ అయిన తొలి మ‌హిళా ఉన్న‌తాధికారిణిగా ఆమెకున్న నేమ్ అండ్ ఫేమ్   నేష‌న‌ల్ రేంజ్. ఒక స‌మ‌యంలో ఆమె గురించి ఒక ఆంగ్ల ప‌త్రిక‌లో త‌ప్పుడు క‌థ‌నం  ప్ర‌సార‌మైందంటే ప‌రిస్థితి ఏంటో ఊహించుకోవ‌చ్చు. రాజులు పోయారు- రాజ్యాలు పోయాయి అన్న‌ట్టు ఆమెను అంద‌లాన్ని ఎక్కించిన బీఆర్ఎస్ ప్ర‌భుత్వం కుప్ప‌కూల‌డంతో.. ఆమె స్వ‌త‌హాగా త‌న ప్ర‌భ‌ను కోల్పోతార‌ని భావించారంతా. కానీ రేవంత్ స‌ర్కార్ ఆమెకు స‌ముచిత స్థాన‌మే ఇచ్చింది. ప‌ర్యాట‌క శాఖ కార్య‌ద‌ర్శిగా ఆమె ప్ర‌జెంట్ కీ పొజిష‌న్లోనే ఉన్నారు. మే 7 నుంచి 31 వ‌ర‌కూ జ‌ర‌గ‌నున్న మిస్ వ‌ర‌ల్డ్ పోటీల‌ను ద‌గ్గ‌రుండి ఆమే చూసుకోవాలి.  కానీ ఇక్క‌డే ఆమె త‌ప్ప‌ట‌డుగులు వేస్తున్నారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక పోస్టుల‌ు పెడుతున్నారు. ఒక ప్ర‌భుత్వంలో ఉండి.. ప్ర‌భుత్వాన్ని వ్య‌తిరేకించ‌డం విమ‌ర్శించ‌డం చేయ‌కూడ‌దు. ఇది ఆ అధికారిణికి తెలియంది కాదు. కానీ ఆమె అంతే అన్న విమ‌ర్శ కూడా ఉంది. గ‌తంలో స్మితా స‌బ‌ర్వాల్ దివ్యాంగుల‌కు సంబంధించిన రాంగ్ కామెంట్స్ చేశారు. దీన్ని తెలుగు  స‌మాజ‌మంతా చీకొట్టింది. అయినా స‌రే స్మిత త‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు, వ్య‌వ‌హార‌శైలి నుంచి బ‌య‌ట ప‌డ‌లేక పోతున్నార‌నే మాట వినిపిస్తోంది. తాజాగా కంచె గ‌చ్చిబౌలీ వ్య‌వ‌హారంలో ఆమె సోష‌ల్ మీడియా పై చేస్తున్న పోస్టింగులు పెను దుమారం చెల‌రేగేలా చేస్తున్నాయి. అవి ఏఐ, జిబిలీ వంటి ఆర్టిఫిషియ‌ల్ అయినా స‌రే, స్మిత వెనకాడ్డం లేదు. పోలీసులు నోటీసులు ఇస్తే.. అందుకు రిట‌న్ గా.. సుప్రీం  కోర్టు ఆదేశాల‌ను తిరిగి త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ పై పోస్ట్ చేసి ఔరా! అనిపిస్తున్నారు. అదేమంటే అది త‌న భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ అంటున్నారు. ఆనాడు బీఆర్ఎస్ హ‌యాంలో కాళేశ్వ‌రం ప్రాజెక్టు కోసం.. సుమారు 20 ల‌క్ష‌ల చెట్లు న‌రికేస్తే మారు మాట్లాడ‌ని స్మిత.. ఇప్పుడు కంచె గ‌చ్చిబౌలీ  విషయంలో  వివాదాస్ప‌ద కామెంట్లు  చేస్తున్నారేంటి? అన్న ప్ర‌శ్న‌కు ఆస్కార‌మేర్ప‌డుతోంది. నిజానికి స్మిత బేసిక్ ప‌ర్స‌నాల్టీ ఎలాంటిదని చూస్తే ఆమె నిజం ఎటు వైపు ఉంటే అటు వైపు ఉంటార‌న‌డానికి వీల్లేకుండా పోతోంది. అప్పుడు అంత పెద్ద ఎత్తున విధ్వంసాలు జ‌రుగుతుంటే చూస్తూ ఊరుకున్న స్మిత ఇప్పుడు మాత్రం ప్ర‌భుత్వ విధానాల‌నే త‌ప్పు ప‌డుతున్నారు. అప్పుడు కూడా ఆమె ఇలాంటి ప్ర‌భుత్వ వ్య‌తిరేక కామెంట్లు చేశారా? అంటే లేదన్న సమాధానమే వస్తోంది.  ఆమె ప్ర‌భుత్వాన్ని వ్య‌తిరేకించ‌డం అంటే, అది ఎలాగూ.. ప్ర‌తిప‌క్షాన్ని స‌పోర్ట్ చేయ‌డ‌మే అవుతుంది. కాబ‌ట్టి ఇది స్మిత రాజ‌కీయ‌పు ఎత్తుగ‌డా? అన్న  అనుమానాలు చాలా మందిలో వ్యక్తమౌతున్నాయి.  ఆమె ఐఏఎస్ అధికారిణిగా ఎక్కువ కాలం ఉండ‌క పోవ‌చ్చ‌నీ త్వ‌ర‌లోనే ఐపీఎస్ ప్ర‌వీణ్ కుమార్ లా ఏదైనా రాజ‌కీయ‌పు అడుగులు వేసే ఛాన్స్ ఉంద‌నీ అంటున్నారు.  ఐఏఎస్ లు ఇలా రాజ‌కీయంగా ఎద‌గ‌డం అన్న‌ది ఈ నాటిది కాదు. ప్ర‌స్తుతం కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న అశ్విని వైష్ణ‌వ్ సైతం ఒక ఐఏఎస్ అధికారే. ఈ క్ర‌మంలో చూస్తే స్మిత‌.. గ‌త కొంత‌కాలంగా చేస్తున్న మౌన శ‌బ్ధాలు.. ఆమె రాజ‌కీయపు ఆలోచ‌న‌ల‌కు అద్దం ప‌డుతున్నాయ‌ని అంటున్నారు. మ‌రి స్మిత వ‌చ్చే రోజుల్లో పొలిటీషియ‌న్ కావ‌డానికి అవ‌కాశ‌ముందా? లేదా తేలాల్సి ఉంది.
స్మిత‌.. ఏంటీ ప్ర‌భుత్వ వ్య‌తిరే.. కత‌! Publish Date: Apr 22, 2025 4:55PM

రాజ్ క‌సిరెడ్డి ఆప‌రేష‌న్స్ ఎలాగుండేవంటే?

విజ‌య‌సాయి రెడ్డి చెప్పిన‌ట్టు రాజ్ క‌సిరెడ్డి తెలివైన వాడే. ఆయ‌న మ‌ద్యం డ‌బ్బును ఎలా చేతులు మారుస్తారంటే.. ర‌క ర‌కాల విధానాల్లో వాటిని దారి మ‌ళ్లించి తిరిగి ఆ మొత్తం డ‌బ్బును ఒక చోట చేర్చ‌డంలో త‌న తెలివైన హైటెక్ బుర్ర‌ను వాడుతుంటారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో వివిధ‌ డిస్ట‌ల‌రీల ద్వారా వ‌చ్చే మ‌ద్యాన్ని భారీ ధ‌ర‌ల‌కు విక్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. స‌రిగ్గా అదే స‌మ‌యంలో ఆ మొత్తం డిజిట‌ల్ గా కాక, హార్డ్ క్యాష్ గా తీసుకున్న‌దీ విదిత‌మే. అయితే ఈ మొత్తం డ‌బ్బు త‌ర‌లింపులో రాజ్ క‌సిరెడ్డి త‌న‌ ప‌నిత‌న‌మంతా చూపారని అంటారు. మొత్తంగా నాలుగు విధానాల ద్వారా ఈ డ‌బ్బు ఒక వైసీపీ ఎంపీ ద‌గ్గ‌ర‌కు చేర్చేవాడ‌ని తెలుస్తోంది. ఆ విధానాలేంట‌ని చూస్తే అది మొద‌టిది సినిమా కాగా, రెండు న‌గ‌ల షాపులు, మూడు రియ‌ల్ ఎస్టేట్, నాలుగు అడ్వ‌ర్టైజింగ్ ఏజెన్సీల‌కు చెల్లింపులు.  కావాల‌ని ఫ్లాప్ సినిమాలు తీసి వాటి ద్వారా భారీ  ఎత్తున ఖ‌ర్చు చూపించి.. ఆపై వాటిని బ్లాక్, వైట్ చేసుకోవ‌డం అన్న‌ది ఒక రూట్ మ్యాప్. ఇక రెండోది న‌గ‌ల దుకాణాల‌కు 20 శాతం క‌మిష‌న్ ద్వారా  బ్లాక్ మనీని వైట్ చేస్తుంటార‌న‌మాట‌. ఇక రియ‌ల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబ‌డుల సంగ‌తి తెలిసిందే.  బ్లాక్ మనీ వైట్ అవ‌డానికి ఇక్క‌డున్నంత బెస్ట్ మెథ‌డ్స్ మ‌రొక చోట దొర‌క‌వు మ‌న‌కు. మ‌నీలాండ‌రింగ్ కి అనువైన వేదిక కూడా రియ‌ల్ రంగ‌మే. మ‌రో మార్గం అడ్వ‌ర్టైజింగ్ కంపెనీలు.. వీటి ద్వారా ప్ర‌భుత్వానికి అవ‌స‌ర‌మైన వీడియోల రూప‌క‌ల్ప‌న చేయిస్తున్న‌ట్టు, ఇంకా ఎన్నో ర‌కాల ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్టు.. ఒక ప్లాన్ వేస్తారు. ఈ ప‌థ‌కం ప్ర‌కారం.. వారికి భారీ ఎత్తున డ‌బ్బు చెల్లించిన‌ట్టు చూపిస్తారు. క‌ట్ చేస్తే ఆ మొత్తాన్ని 20 శాతం క‌మిష‌న్ రూపంలో తిరిగి త‌మకు చేరేలా చేసుకుంటారు. ఈ మొత్తం సిండికేట్.. గ‌త పాల‌న‌లో నాలుగేళ్ల పాటు ఆ మాట‌కొస్తే ఎన్నిక‌ల ముందు వ‌ర‌కూ య‌ధేచ్చ‌గా సాగిన‌ట్టు స‌మాచారం. ఇపుడీ వివ‌రాల‌నే కూపీ లాగుతున్నారు అధికారులు. ఏది ఏమైనా ఈ మొత్తంలో త‌లా పాపం తిలా పిడికెడుగా భావిస్తున్నారు. మ‌రి చూడాలి.. ఇంకా ఎన్నేసి ర‌హ‌స్యాలు బ‌య‌ట‌ప‌డ‌తాయో?
 రాజ్ క‌సిరెడ్డి ఆప‌రేష‌న్స్ ఎలాగుండేవంటే? Publish Date: Apr 22, 2025 4:09PM

తెలంగాణలో భానుడి భగభగలు..వడదెబ్బతో 9 మంది మృతి

  తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి.  భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండల తీవ్రతతో తెలంగాణ రాష్ట్రంలో వడదెబ్బ  తగిలి సోమవారం ఒక్కరోజే 9 మంది మృతి చెందారు. రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ పేర్కొన్నాది. గరిష్ఠంగా 44-45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణలోని అదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల  జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకి రాకూడదని అధికారులు తెలిపారు. ఇక వడదెబ్బ కారణంగా ఖమ్మం, కరీంనగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఒక్కొక్కరు, ఉమ్మడి ఆదిలాబాద్‌లో ముగ్గురు, వరంగల్‌లో ముగ్గురు మరణించారు. ఇక కామారెడ్డి జిల్లా బిచ్కుందలో సోమవారం అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఒకవైపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత భయపెట్టగా.. సాయంత్రం వేళ అకస్మాత్తుగా కురిసిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఎండలో తిరిగి ఇంటికి వచ్చినప్పుడు పుష్కలంగా నీరు తాగాలి. మజ్జిగ, కొబ్బరి నీరు, నిమ్మరసం వంటి ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. మసాలా ఫుడ్స్ కాకుండా తేలికపాటి ఆహారం తీసుకోవాలి. సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిదని వైద్యులు పేర్కొన్నారు.  
తెలంగాణలో భానుడి భగభగలు..వడదెబ్బతో 9 మంది మృతి Publish Date: Apr 22, 2025 4:00PM

వేధించడంలో జగన్ కు తన పర బేధం లేదు.. మంత్రి వాసంశెట్టి సుభాష్!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వేధించే విషయంలో తన పర బేధం లేదు. ఆయన హయంలో తెలుగుదేశం, జనసేన నేతలే కాదు, ఆయన సొంత పార్టీ అయిన వైసీపీ నేతలూ వేధింపులకు గురయ్యారు. అంతెందుకు సొంత చెల్లి, తల్లికి కూడా ఆయన నుంచి వేధింపులు తప్పలేదు. ఈ విషయాలన్నీ పదేళ్ల పాటు ఆ పార్టీలో పని చేసిన బయటకు వచ్చిన ప్రస్తుతం కార్మిక శాఖ మంత్రి, రామచంద్రపురం ఎమ్మెల్యే వాసంశెట్టిసుభాష్ చెప్పారు. చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఉయ్యూరు మండలం గండిగుంటగ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న వాసంశెట్టి సుభాష్ జగన్ కు సంబంధించి సంచలన విషయాలు వెల్లడించారు. కేవలం ఓ నలుగురితో చీకటి గదిలో కూర్చుని రాష్ట్రాన్ని పాలించిన జగన్.. పార్టీలో తనకు భజన చేసే వారూ, సాష్టాంగ దండప్రమాణాలు చేసే వారినే చేరదీసి పదవులిచ్చారని సుభాష్ చెప్పారు. పదేళ్ల పాటు తాను వైసీపీలో పని చేశాననీ, తనకు ఎమ్మెల్సీ ఇస్తామని కూడా ఆ పార్టీ నేతలు వాగ్దానం చేశారనీ చెప్పిన వాసంశెట్టి సుభాష్.. తానా పదవి వద్దన్నాననీ, తీసుకుని ఉంటే జనం తనను ఛీకొట్టి ఉండేవారనీ చెప్పారు. ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేసిన మిథున్ రెడ్డి జగన్ కు సాస్ఠింగ దండప్రమాణం చేస్తూ పని సులువుగా అవుతుందని సూచించినట్లు చెప్పారు. కానీ అందుకు తాను నిరాకరించానన్నారు. అసలు వైసీపీ హయాంలో  ఒక్క తెలుగుదేశం నేతలు మాత్రమే కాదు.. వైసీపీ నేతలు కూడా వేధింపులకు గురయ్యారని వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు పట్ల జగన్ కోపానికి ఆయన జగన్ ఎదుట కాలు మీద కాలేసుకుని కూర్చోవడమూ, సర్ అంటూ సంభోదించకపోవడమే కారణమని వాసంశెట్టి అన్నారు. అంతెందుకు జగన్ జైలులో ఉన్న సమయంలో పార్టీ కోసం అహర్నిశలూ కష్టపడిన సొంత చెల్లిని కూడా అధికారం దక్కిన తరువాత పక్కన పెట్టేశారని గుర్తు చేశారు. జగన్ లక్షల కోట్లు సంపాదించారనీ, అయినా ఆస్తుల కోసం తల్లి, చెల్లిపై కోర్టుకెళ్లారనీ పేర్కొన్నారు. 
వేధించడంలో  జగన్ కు తన పర బేధం లేదు.. మంత్రి వాసంశెట్టి సుభాష్! Publish Date: Apr 22, 2025 3:58PM

రామ్‌దేవ్ బాబాపై ఢిల్లీ హైకోర్టు ఆగ్ర‌హం..ఎందుకో తెలుసా?

    ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్ బాబాపై  ఢిల్లీ హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. షర్బత్​ జిహాద్​ అంటూ రాందేవ్ బాబా చేసిన కామెంట్స్‌పై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.  రామ్​దేవ్​ బాబాకు చెందిన పతంజలి ఫుడ్స్ లిమిటెడ్​కు వ్యతిరేకంగా హమ్​దార్ద్ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్​పై ఢిల్లీ హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఈ నెల ప్రారంభంలో బాబా రాందేవ్ పతంజలి గులాబీ షర్బత్‌ను ప్రారంభించినప్పుడు రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. "మీకు షర్బత్ ఇచ్చే కంపెనీ సంపాదించే డబ్బును మదర్సాలు, మసీదులను నిర్మించడానికి ఉపయోగిస్తారు. కానీ మీరు దీన్ని తాగితే (పతంజలి గులాబీ షర్బత్‌ను ఉద్దేశిస్తూ) గురుకులాలు నిర్మిస్తాం. ఆచార్య కులం అభివృద్ధి చెందుతుంది.  పతంజలి విశ్వవిద్యాలయం విస్తరిస్తుంది. భారతీయ శిక్షా బోర్డు పెరుగుతుంది" అని అన్నారు. కాగా.. బాబా రాందేవ్ హమ్‌దర్ద్ పేరుని ప్రస్తావించనప్పటికీ దాన్ని ఉద్దేశించే పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. దీనిపైనే హమ్ దర్డ్ కంపెనీ ఢిల్లీ కోర్టుని ఆశ్రయించింది. కాగా..రాందేవ్ పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. త‌క్ష‌ణ‌మే సోష‌ల్ మీడియా నుంచి ఆ వీడియోను తొల‌గించేలా ఆదేశించాల‌ని తెలిపింది. హ‌మ్‌దర్ద్ త‌ర‌ఫున సీనియ‌ర్ న్యాయ‌వాది ముకుల్ రోహ‌త్గీ వాద‌న‌లు వినిపించారు. ఇది ఆ సంస్థ ఉత్ప‌త్తిని అగౌర‌వ‌ప‌ర‌చ‌డం కంటే తీవ్ర‌మైంద‌ని, అవి ద్వేష‌పూరిత వ్యాఖ్య‌ల కిందికే వ‌స్తాయ‌ని వాదించారు. దీనిపై స్పందించిన కోర్టు... "బాబా రామ్‌దేవ్ వ్యాఖ్య‌లు కోర్టు అంత‌రాత్మ‌ను షాక్‌కు గురి చేశాయి. ఇలాంటి వ్యాఖ్య‌లు ఎంత‌మాత్రం కరెక్ట్ కాదు అని పేర్కొన్నాది.
రామ్‌దేవ్ బాబాపై  ఢిల్లీ హైకోర్టు ఆగ్ర‌హం..ఎందుకో తెలుసా? Publish Date: Apr 22, 2025 3:17PM

యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల..ఫస్ట్‌ ర్యాంక్‌ ఎవరంటే?

    దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే సివిల్‌ సర్వీసెస్‌ – 2024 తుది ఫలితాలు విడుదలయ్యాయి. యూపీఎస్సీ మంగళవారం మధ్యాహ్నం ఫలితాలను వెల్లడించింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటారు. శక్తి దూబే అనే అభ్యర్థికి మొదటి ర్యాంకు వచ్చింది. తెలుగు అభ్యర్థి సాయి శివాణికి 11వ ర్యాంక్ వచ్చింది. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన 2,845 మందిని ఇంటర్వ్యూ చేసిన యూపీఎస్సీ ఇవాళ తుది ఫలితాలను ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో మొత్తం వెయ్యికి పైగా ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ పోస్టుల భర్తీకి గత ఏడాది ఫిబ్రవరిలో యూపీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. జూన్‌ 16న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించిన యూపీఎస్సీ.. అందులో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్‌ 20 నుంచి 29వ తేదీ వరకు మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించింది. మెయిన్స్‌లో సత్తా చాటిన వారికి జనవరి 7 నుంచి ఏప్రిల్‌ 17 వరకు దశల వారీగా పర్సనల్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి తాజాగా తుది ఫలితాలను ప్రకటించింది. ప్రిలిమ్స్‌ పరీక్షకు సుమారు 5 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రిలిమినరీ పరీక్ష 42,560 మంది రాశారు. వారిలో సుమారు 500 మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారు. వారిలో నుంచి 100 మంది వరకు ఇంటర్వ్యూకు సెలెక్ట్‌ అయ్యారు.
యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల..ఫస్ట్‌ ర్యాంక్‌ ఎవరంటే? Publish Date: Apr 22, 2025 2:45PM

విజయసారెడ్డి అప్రూవర్ గా మారిపోయినట్లేనా? వైసీపీకి ఇక దబిడి దిబిడేనా?

ఏపీ మద్యం కుంభకోణం విచారణ తుది దశకు వచ్చేసినట్లే కనిపిస్తోంది.  ఈ కేసులో  త్వరలోనే వైసీపీ పెద్దలందరికీ  నోటీసులు అందబోతున్నాయా? అన్న ప్రశ్నకు జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఔననే జవాబే వస్తున్నది.  వైసీపీ మాజీ ఎంపీ,  విజయసాయి రెడ్డి  ఈ కుంభకోణంలో కర్త, ఖర్మ, క్రియ అన్నీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని తాను మొదటే చెప్పాననీ అంటున్నారు. అంతే  కాకుండా ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ తాను బయటకు లాగుతాననీ చెబుతున్నారు. తాను ఈ కేసుకు సంంబంధించినంత వరకూ విజిల్ బ్లోయర్ ను అని చెప్పుకుంటున్న విజయసాయి రెడ్డి అసలీ కుంభకోణానికి బీజం పడింది మాత్రం తన నివాసంలోనే అని అంగీకరిస్తున్నారు.  ఈ కుంభకోణం గురించి తనకు తెలిసిన ప్రతీ విషయాన్నీ పోలీసులకు, ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులకు అందజేస్తానని చెబుతున్నారు. ఎంత కాదనుకున్నా విజయసాయి రెడ్డి మాటలు వైసీపీ నేతలకు చెమటలు పట్టిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ పార్టీలో నంబర్ 2గా.. ఒకానొక దశలో డిఫాక్టో సీఎంగా కూడా వ్యవహరించిన విజయసాయిరెడ్డికి వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, కుంభకోణాల గురించి క్షుణ్ణంగా తెలుసునని పరిశీలకులు చెబుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీలో, వైసీపీ ప్రభుత్వంలో విజయసాయికి తెలియని విషయమంటూ ఉండే అవకాశం లేదు.  కనుక మద్యం కుంభకోణంలో ఆయన బయటపెడతున్న, పెడతానంటున్న ప్రతి విషయమూ సంచలనాలను రేకెత్తిస్తుందనడంలో సందేహానికి తావు లేదు.  గత రెండు మూడు రోజులుగా ఆయన ట్వీట్లు, మాటలూ చూస్తుంటే.. విజయసాయి అప్రూవర్ గా మారిపోయారా అన్న అనుమానాలు కలుగుతున్నాయని పరిశీలకులు అంటున్నారు.   ఈ కేసులో కర్త, ఖర్మ, క్రియగా వ్యవహరించిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అలాగే జగన్‌ కోటరీలో కీలకంగా వ్యవహరించిన ఏపీ ఇంటలిజన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా మరో కేసులో అరెస్టయ్యారు. గంటల వ్యవధిలోనే  ఈ ఇద్దరూ అరెస్టు కావడం కాకతాళీయమని భావించలేము. అలాగే ఇదే మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఏపీఎస్ బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరావు సహా పలువురిని విచారించారు. సిట్ వేగం చూస్తుంటే..ఒకరి వెంట ఒకరుగా   వైసీపీ పెద్దలందరినీ విచారణకు పిలవడానికి సిద్ధమైపోయినట్లే కనిపిస్తున్నది. ఇక ఈ కేసులో వైసీపీ పెద్దల విచారణకు విజయసాయిరెడ్డి వాంగ్మూలమే ఆధారమని పరిశీలకులు అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో నిందితులు, ఆరోపణలు ఎదుర్కొం టున్న వారూ అందరూ ఇప్పుడు సీన్ లోకి వచ్చేసినట్లే కనిపిస్తున్నది. రాజ్ కసిరెడ్డి అరెస్టుతో జగన్ వైసీపీ ముఖ్య నేతలతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో  అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు. ఈ సమీక్షలో ప్రధానంగా మద్యం కుంభకోణంలో ఇంకా ఎవరెవరు విచారణను ఎదుర్కొనే అవకాశం ుందన్న అంశపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.    ఇంత జరిగినా, జరుగుతున్నా.. వైసీపీ మాత్రం తమ ప్రభుత్వ హయాంలో మద్యం ఉత్పత్తి, అమ్మకాలూ అత్యంత పారదర్శకంగా జరిగాయని చెప్పుకుంటోంది. ఇప్పుడు తెలుగుదేశం నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించడం, సిట్ అరెస్టులు, విచారణలు అంటూ హడావుడి చేయడం అంతా రాజకీయ వేధింపుల్లో భాగమేనని ఆరోపిస్తున్నది. అయితే ఈ ఆరోపణలన్నీ వైసీపీలోని భయాన్నే చూపుతున్నాయనీ, వైసీనీ నేతల ప్రకటనలు, వ్యాఖ్యలు అన్ని మేకపోతు గాంభీర్య ప్రదర్శన కిందకే వస్తాయనీ పరిశీలకులు అంటున్నారు. విజయసాయి వాంగ్మూలం ఎఫెక్ట్ వైసీపీమీద గట్గిగానే పడిందనడానికి తాడేపల్లిలోని వైసీపీ కేంద్రకార్యాలయంలో జగన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడమే తార్కానమంటున్నారు. 
విజయసారెడ్డి అప్రూవర్ గా మారిపోయినట్లేనా? వైసీపీకి ఇక దబిడి దిబిడేనా? Publish Date: Apr 22, 2025 2:01PM

విజయసాయిరెడ్డి కొత్త అవతారం.. విజిల్ బ్లోయర్!

జగన్ కు అత్యంత విశ్వసనీయ సహచరుడు, వైసీపీ ఆవిర్భావానికి ముందు నుంచీ జగన్ తో కలిసి నడిచి, ఆఖరికి ఆయన అక్రమాస్తుల కేసులో కూడా సహనిందితుడిగా జైలు జీవితం కూడా అనుభవించిన విజయసాయి రెడ్డి ఇప్పుడు జగన్ కు పూర్తి వ్యతిరేకంగా మారిపోయారు.  వైఎస్ కుటుంబంతో  సుదీర్ఘ అనుబంధం, ఆ కుటుంబ ఆర్థిక వ్యవహారాలన్నీ చూసుకుంటూ వచ్చిన ఆడిటర్ అయిన విజయసాయి రెడ్డి ఇప్పుడు జగన్ హయాంలో కుంభకోణాల గుట్టుమట్లన్నీ విప్పుతానంటున్నారు. గత ఎన్నికలలో ఘోర పరాభవం తరువాత.. ఇంకా పార్టీకి ఏమైనా మిగిలి ఉన్న కొద్ది పాటి ప్రతిష్ఠనూ కూడా దిగజారుస్తానంటున్నారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంతో సంబంధం ఉన్న ఒక్కరినీ వదిలిపెట్టకుండా అందరినీ బయటకు లాగుతానని చెబుతున్నారు.  రాజ్ కసిరెడ్డి అరెస్టు అనంతరం సోషల్ మీడియా వేదికగా విజయసాయిరెడ్డి ఈ కుంభకోణంలో తనను తాను ఒక విజిల్ బ్లోయర్ గా అభివర్ణించుకున్నారు. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో ఆయన ఏపీ మద్యం కుంభకోణంలో తన పాత్ర కేవలం విజిల్ బ్లోయర్ పాత్రేనని చెప్పుకున్నారు. అయితే ఈ కుంభకోణంలో దొరికిన దొంగలు, ఇంకా దొరకకుండా ఉన్న దొంగలూ కూడా తమను తాము కాపాడుకోవడానికి తన పేరు లాగుతున్నారని ఆరోపించారు.  ఈ కుంభకోణంలో ఇంకా దొరక్కుండా తప్పించుకుని  తిరుగుతున్న దొంగల గుట్టుమట్లన్నీ తాను బయటపెడతానని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.  నిన్న మొన్నటి వరకూ జగన్ తోనూ, ఆ అధినేతగా ఉన్న వైసీపీతోనూ అంటకాగి బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి ఒక్క సారిగా యూటర్న్ తీసుకుని అందరి బాగోతం బయటపెడతానంటూ హెచ్చరికలు జారీ చేయడం వైసీపీ వెన్నులో వణుకు పుట్టిస్తోందనడంలో సందేహం లేదు.     అందుకే రాజ్ కసిరెడ్డి అరెస్టు అయిన వెంటనే.. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ అధినేత జగన్ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజకీయ వ్యవహారల కమిటీతో అత్యవసర భేటీ ఏర్పాటు చేశారు. ఇక్కడ మరో విషయమేంటంటే.. విజయసాయి రెడ్డి సిట్ దర్యాప్తులో పాల్గొన్న రెండు రోజుల వ్యవధిలోనూ మద్యం కుంభకోణం కేసులో ఎంపీ విజయసాయిరెడ్డిని సిట్ విచారణకు పిలిచింది. ప్రశ్నలు సంధించింది. దీంతో  విజయసాయిరెడ్డి వాంగ్మూలం ఆధారంగానే మిథున్ రెడ్డిని సిట్ విచారణకు పిలిచిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  అలాగే రాజ్ కసిరెడ్డే మద్యం కుంభకోణంలో కర్త కర్మ క్రియ అని విజయసాయి మీడియా ముఖంగా చెప్పిన తరువాతే ఈ కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి ప్రమేయం గురించి అందరికీ తెలిసింది. కాగా విజయసాయి రాజ్ కసిరెడ్డి పేరు చెప్పిన వెంటనే ఆయన రియాక్ట్ అయ్యారు. విజయసాయిరెడ్డి చరిత్రను తానూ బయటపెడతానంటూ ఓ వీడియో విడుదల చేశారు. దీంతో విజయసాయి రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి మద్యం కుంభకోణంలో ఉన్న ప్రతి ఒక్కరి బాగోతాన్నీ బయటపెడతానంటూ ట్వీట్ చేశారు. గతంలో సంగతి ఏమో కానీ.. ఇప్పుడు మాత్రం వజియసాయి రెడ్డి విజల్ బ్లోయర్ గానే పని చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విజయసారి నోరు విప్పితే.. జగన్ హయాంలో జరిగిన అవకతవకలన్నీ ససాక్ష్యాలతో బయటకు రావడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.  
విజయసాయిరెడ్డి కొత్త అవతారం.. విజిల్ బ్లోయర్! Publish Date: Apr 22, 2025 1:35PM

చూయింగ్ గమ్ తినే అలవాటు ఉందా? ఈ షాకింగ్ నిజాలు తెలుసా?

చూయింగ్ గమ్ చాలా మందికి ఒక అలవాటుగా ఉంటుంది.  ఏ సమయంలో అయినా సరే చూయింగ్ గమ్ ను అలా నములుతూ ఉంటారు.  దీని వల్ల దవడలకు మంచి వ్యాయామం లభిస్తుందని,  ముఖానికి కూడా వ్యాయామం లభిస్తుందని అంటుంటారు.  క్రీడాకారులు,  ఆటగాళ్లు, డాన్స్ చేసేవారు.. ఇలా చాలామంది చూయింగ్ గమ్ ను తమ లైఫ్ స్టైల్ లో భాగం చేసుకుని ఉంటారు. అయితే చూయింగ్ గమ్ తినే అలవాటు ఆరోగ్యానికి మంచిదేనా అని పరిశోధనలు చేస్తే  చాలా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. చూయింగ్ గమ్ గురించి, చూయింగ్ గమ్ తినడం వల్ల కలిగే హాని  గురించి శాస్త్రవేత్తలు దిగ్భ్రాంతిని కలిగించే  విషయాలు వెల్లడించారు.  వీటి గురించి తెలుసుకుంటే.. చూయింగ్ గమ్ పరిశోధనలో  సగటున ఒక గ్రాము చూయింగ్ గమ్‌కు వందల నుండి వేల వరకు మైక్రోప్లాస్టిక్‌లు విడుదలవుతున్నాయని పరిశోధనలలో  కనుగొనబడింది.  ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సింథటిక్,  సహజ చూయింగ్ గమ్‌లలో ఒకే మొత్తంలో మైక్రోప్లాస్టిక్‌లు ఉన్నాయట. అలాగే ఒకే రకమైన పాలిమర్లు కూడా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనుషులు చూయింగ్ గమ్ ద్వారా మాత్రమే కాకుండా అనేక ఇతర మార్గాల ద్వారా కూడా మైక్రోప్లాస్టిక్‌లతో సంబంధంలో  ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో వివిధ పరిశోధనలలో మైక్రోప్లాస్టిక్ బయటపడటం తెలుస్తూనే ఉంది.  వివిధ ప్లాస్టిక్ ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా,  పర్యావరణంలోకి ప్రవహించే పెయింట్ ముక్కలతో ఇవి సంభవిస్తున్నాయి.  ఇవి ఆరోగ్యం పై అనేక ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి. శ్వాసకోశ, హృదయనాళ ప్రభావాలు.. వాతావరణంలో మైక్రోప్లాస్టిక్‌లు ఉండటం వల్ల  శ్వాస ద్వారా మైక్రోప్లాస్టిక్‌లను సంపర్కం చేసుకోవచ్చని ఒక అధ్యయనం వెల్లడించింది. గాలిలో తక్కువ సాంద్రత కలిగిన మైక్రోప్లాస్టిక్‌లకు దీర్ఘకాలికంగా గురికావడం వల్ల వ్యక్తి యొక్క సున్నితత్వం,  కణ లక్షణాలను బట్టి శ్వాసకోశ,  హృదయ సంబంధ వ్యాధులు వస్తాయట. జీర్ణక్రియ,  రోగనిరోధక శక్తి.. మైక్రోప్లాస్టిక్‌లు మానవ శరీరంలోని జీర్ణ,  రోగనిరోధక వ్యవస్థలతో సహా వివిధ వ్యవస్థలను ప్రభావితం చేస్తాయట. మైక్రోప్లాస్టిక్‌లు పేగు మైక్రోబయోమ్‌లో మార్పులకు కారణమవుతాయి. ఫలితంగా ప్రయోజనకరమైన,  హానికరమైన బ్యాక్టీరియా మధ్య అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది కడుపు నొప్పి, ఉబ్బరం,  ప్రేగు అలవాట్లలో మార్పులు వంటి వివిధ రకాల జీర్ణశయాంతర సమస్యలను కలిగిస్తుంది. పునరుత్పత్తి.. మైక్రోప్లాస్టిక్స్  పునరుత్పత్తిని కూడా ప్రభావితం చేస్తాయి. ఇది అనేక పునరుత్పత్తి లోపాలు, వంధ్యత్వం, గర్భస్రావం,  పుట్టుకతో వచ్చే వైకల్యాలకు కారణమవుతుంది.                          *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
చూయింగ్ గమ్ తినే అలవాటు ఉందా? ఈ షాకింగ్ నిజాలు తెలుసా? Publish Date: Apr 22, 2025 10:41AM

కమల దళంలో అంతర్మథనం.. కొత్త శకానికి శ్రీకారం?

భారతీయ జనతా పార్టీలో ఏమి జరగుతోంది? జాతీయ అధ్యక్షుని ఎన్నికలో ఎందుకు ఇంత జాప్యం జరుగుతోంది? తెలంగాణ సహా అనేక ఇతర రాష్ట్రల్లో రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక ఎందుకు ముడిపడడం లేదు? అందుకు పార్టీ నేతలు చెపుతున్న కారణాలేనా లేక ఇంకా లోతైన కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే, కమల దళంలో జరుగతున్న పరిణామాల వెనక  లోతైన కారణాలే ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారంగా తెలుస్తోంది. నిజానికి పైకి కనిపిస్తున్నడానికి లోపల జరుగతున్న పరిణామాలకు పొంతనలేదని అంటున్నారు.  అవును ఢిల్లీలో చోటు  చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే..  భవిష్యత్ లక్ష్యాలు, భవిష్యత్ వ్యూహాలు ఆధారంగా ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలో అనివార్యంగా  చేపట్టవలసిన  పెను మార్పులపై లోతైన చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే  పైకి అంతా బాగుందన్నట్లు కనిపిస్తున్నా, అంతర్గతంగా అనేక అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, అందుకే ఒకదానితో ఒకటి ముడి పడిన కీలక నిర్ణయాల్లో జాప్యం జరుగుతోందని అంటున్నారు.  ఇటీవల  అటు ఢిల్లీలో ఇటు నాగాపూర్ లో అగ్రనేతల వరస సమావేశాలు కేవలం పార్టీ అధ్యక్షుని ఎన్నికకు పరిమతం కాదని.. అంతకు మించిన అంతర్మధనం జరుగుతోందని  విశ్లేషకులు అంటున్నారు.  ముఖ్యంగా  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాగపూర్ పర్యటన (మార్చి30) తర్వాత, చోటు చేసుకుంటున్న పరిణామాలు బీజేపీలో ఏదో జరుగుతోందనే అనుమానాలకు మరింత బలం చేకూర్చే విధంగా ఉన్నాయని, అంటున్నారు.  అలాగే  బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంబంధాల విషయంలోనూ పునఃసమీక్ష జరుగుతోందని విశ్వసనీయంగా తెలుస్తోంది.  ఆర్ఎస్ఎస్ వందేళ్ళ పండగను పురస్కరించుకుని, సంఘ్ పరివార్ ఎజెండాలో మిగిలి  ఉన్న అంశాలపై మరింత దృష్టి పెట్టాలని ఆర్ఎస్ఎస్ బావిస్తోందని అంటున్నారు .అందులో భాగంగా పార్టీ పైన, ప్రభుత్వం పైన కూడా నాగపూర్ ప్రత్యక్ష పర్యవేక్షణ ఉండేలా,  ఢిల్లీ పై నాగపూర్ పట్టు బిగిస్తోందని అంటున్నారు.  మళ్ళీ ఉప ప్రధాని?  ఈ నేపధ్యంలో  రానున్న రోజుల్లో ఇటు బీజేపీలో, అటు ప్రభుత్వంలో భారీ మార్పులు ఉంటాయని, అంటున్నారు. ఇందులో భాగంగా, గతంలో అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వంలో ఉన్న ఉప ప్రధాని పదవిని పునరుద్దరించే ఆలోచన ఉందని అంటున్నారు. వాజ్ పేయి ప్రభుత్వంలో హోం మంత్రిగా ఉన్న అద్వానీకి  2002లో ఆర్ఎస్ఎస్ ఆలోచన మేరకే   పదోన్నతి లభించిందనీ, ఇప్పడు కూడా, ఆర్ఎస్ఎస్ ఆలోచన మేరకే మళ్ళీ  ఉప ప్రధాని పదవిని పునరుద్దరించాలని  భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే..  అప్పటిలాగా ఇప్పడు కూడా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు పదోన్నతి లభిస్తుందా? ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్, నాగపూర్ ఎంపీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలలో ఒకరిని అదృష్టం వరిస్తుందా? అన్నది   తెలియాల్సి ఉందంటున్నారు.  నిజానికి, ప్రస్తుతం  బీజేపీ ముందున్న ప్రధాన సమస్య, ప్రధాన చిక్కు ముడి ఇదే అంటున్నారు. ఈ రోజు  ఉప ప్రధాని రేపటి  ప్రధాని? అవును. 2002లో ఉప ప్రధానిగా పదవిని చేపట్టిన అద్వానీ, 2004 ఎన్నికలలో  బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా తెరపైకి వచ్చారు. అటల్జీ ప్రధానిగా ఉన్న సమయంలోనే అద్వానీని బీజేపీ, ఎన్డీఎ కూటమి ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించింది. సరే.. ఆ ఏన్నికల్లో బీజేపీ సారధ్యంలోని ఎన్డీఎ బండి తిరగబడింది. కాంగ్రెస్ సారథ్యంలోని యుపీఎ అధికారంలోకి వచ్చింది. అద్వానీ, ఐదేళ్ళు ప్రతిపక్ష నేతగా కొనసాగారు. తిరిగి 2009 లోనూ ఆయనే ప్రధాని అభ్యర్ధిగా బీజేపీ బరిలో దిగింది. అయితే మళ్ళీ అదే ఫలితం ఎదురైంది. అద్వానీ మరోసారి బస్సు మిస్సయ్యారు.   అది వేరే విషయం.  అదలా ఉంచితే, ఇప్పడు మళ్ళీ అదే ఆనవాయితీ కొనసాగితే, ఈ రోజు ఉప ప్రధాని ఎవరైతే వారే రేపటి (2029) ప్రధాని అభ్యర్ధి అవుతారు. అందుకే. పార్టీలో  ఇంతటి అంతర్మథనం సాగుతోందని, పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే, ఆర్ఎస్ఎస్ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే, మోదీ సహా చాలా మంది సీనియర్లు తెరమరుగు అవుతారని, కొత్త తరం తెరపైకి వస్తుందనీ,  కమల దళంలో కొత్త శకానికి శ్రీకారం చుడుతుందని అంటున్నారు.
కమల దళంలో  అంతర్మథనం..  కొత్త శకానికి శ్రీకారం? Publish Date: Apr 22, 2025 9:48AM

కోటీశ్వరులు కావాలంటే సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలుసా?

  విజయం అంత సులువుగా ఎవరినీ వరించదు. జీవితంలో సక్సెస్ సాధించడం అనేది సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మీదనే ఆధారపడి ఉంటుంది. చాలా వరకు సొంతంగా ఎదిగి లక్షాధికారులు,  కోటిశ్వరులు అయిన వారి జీవితాలను పరిశీలిస్తే వారు సమయానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో తెలుస్తుంది. సక్సెస్ ఫుల్ పర్సన్స్ ను ఇతరుల కంటే భిన్నంగా ఉంచేది ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే గుణమే..  ఇంతకీ సక్సెస్ ఫుల్ పర్సన్స్ ఖాళీ సమయాన్ని ఎలా వినియోగించుకుంటారంటే.. సక్సెస్ ఫుల్ పర్సన్స్ తమకు లభించే ఖాళీ సమయాన్ని బంధాలు నిలబెట్టుకోవడం కోసం ఎంచుకుంటారు.  స్నేహితులు,  కుటుంబ సభ్యులు,  ఆత్మీయులతో మాట్లాడటం చర్చలు చేయడం,  ఆలోచనాత్మకంగా మాట్లాడటం ద్వారా సక్సెస్ ఫుల్ పర్సన్స్ కొత్త ఆలోచనలకు, కొత్త పనులకు శ్రీకారం చుడతారు. దీని వల్ల వారు ఎదుగుతూనే ఉంటారు. పుస్తకాలు చదవడం,  కొత్త విషయాల గురించి అణ్వేషించడం, అధ్యయనం చేయడం,  తమకు ఉన్న ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నించడం,  గొప్ప వ్యక్తుల మాటలు, ఇంటర్వ్యూలు చదవడం, చూడటం మొదలైనవి చేయడం ద్వారా కొత్త విషయాలను తెలుసుకుంటారు. వాటిని అవసరమైన మెరకు తమ జీవితంలో వినియోగించుకుంటారు. ప్రతి ఒక్కరికి కొన్ని అభిరుచులు ఉంటాయి. అయితే సక్సెస్ ఫుల్ పర్సన్స్ మాత్రం పెయింటింగ్,  సంగీతం,  గార్డెనింగ్, వంట వంటి వాటిని ఇష్టమైన అభిరుచులుగా మార్చుకుంటారు. వీటిలో సమయం గడుపుతారు.  ఇలా వారు గడిపే సమయంలో వారికి కొత్త ఆలోచనలు పుడతాయట.  మెరుగైన ప్రణాళికలకు బీజం పడుతుందట. ఆరోగ్యంగా ఉండటం ప్రతి ఒక్కరికి అవసరం.  ఆరోగ్యంగా ఉంటేనే జీవితంలో మంచి స్థాయికి వెళ్లినా దాన్ని అస్వాదించగలగరు. అందుకే యోగ,  జాగింగ్.  స్విమ్మింగ్ వంటి కార్యాచరణలతో పాటు జిమ్ చేయడం ఇంట్లోనే వ్యాయామం చేయడం వంటివి తమ రోజులో బాగం చేసుకుంటారు. కళల పట్ల ఆసక్తి ఉన్నవారు,  ఏదైనా కళలో ప్రవేశం ఉన్నవారి ఆలోచనలు చాలా మెరుగ్గా ఉంటాయి.  వీరి ఆలోచనా పరిధి విస్తృతంగా ఉంటుంది. సామాజిక విషయాల పట్ల ఎప్పుడూ చురుగ్గా ఉంటారు.  సామాజిక కార్యకలాపాలలో భాగస్వాములు అవుతుంటారు. వ్యక్తి వేగంగా విజయం వైపు నడవడానికి ఇవి చాలా సహాయపడతాయి. కొత్త ప్రదేశాలను సందర్శించడం చాలామంది అలవాటు.   ఇది చాలా మందికి కొత్త ఆలోచనలను,  కొత్త అనుభవాలను ఇస్తుంది.  ఈ అనుభవాల నుండి కొన్ని కార్యాచరణలు రూపుదిద్దుకుంటాయి.                                                   *రూపశ్రీ.
కోటీశ్వరులు కావాలంటే సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలుసా? Publish Date: Apr 22, 2025 9:30AM

ఆర్ఎస్ఎస్ అడుగు జాడల్లో హస్తం పార్టీ?

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అంటే  కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీకి ఉన్న అభిప్రాయం ఏమిటో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఒకటి రెండు సార్లు కాదు..   వందల సార్లు రాహుల్ గాంధీ ఐ హేట్ ఆర్ఎస్ఎస్ అని చాలా స్పష్టంగా చెప్పారు.  ఆఫ్కోర్స్, ఆయన అవే పదాలను, అదే క్రమంలో అని ఉండక పోవచ్చును, కానీ  ఎప్పుడు  ఎక్కడ, ఎలాంటి సందర్భంలో ఆర్ఎస్ఎస్ ప్రస్తావన వచ్చినా..  రాహుల్ గాంధీ తన వ్యతిరేకతను, ద్వేషాన్నీ ఎప్పుడూ  దాచుకోలేదు. నిజానికి  రాహుల్ గాంధీ బీజీపీ, మోదీలను ఎక్కువ వ్యతిరేకిస్తారా? ఆర్ఎస్ఎస్ ను ఎక్కువ వ్యతిరేకిస్తారా అంటే అనుమానం లేకుండా  ఆర్ఎస్ఎస్  అనే సమాధానమే వస్తుంది. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యతిరేకించే క్రమంలోనే ఆయన బీజేపీ,ఆర్ఎస్ఎస్ లతో పాటుగా దేశం పై కూడా  యుద్ధం ప్రకటించారు. అందుకే, ఆర్ఎస్ఎస్ ప్రస్తావన ఎక్కడ వచ్చినా.. ఎప్పుడు వచ్చినా  రాహుల్ గాంధీ అగ్గి మీద గుగ్గిలం అవడం చూస్తున్నాము.  కాగా  కొద్ది రోజుల కిందట, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సందీప్ దీక్షిత్ తో జరిపిన  సంభాషణలోనూ రాహుల్  గాంధీ అదే చెప్పారు. అంతే కాదు.. ఆర్ఎస్ఎస్ పట్ల తమకున్న వ్యతిరేకత తమ జీన్స్ లోనే ఉందని క్లారిటీ ఇచ్చారు. అవును.. మీ ముత్తాత జవహర్ లాల్ నెహ్రూ కలలో కనిపిస్తే..  మీరు ఆయన్ని ఏమి అడుగుతారు? అని సందీప్ దీక్షిత్  అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ, తాను అడిగే ప్రశ్నతో పాటుగా నెహ్రూ చెప్పే సమాధానం కూడా చెప్పారు.   మా ముత్తాత నెహ్రూ కనిపిస్తే.. నేను Tell me one thing that I never ever do  అంటే నేను జీవితంలో ఎప్పుడూ, ఎప్పటికీ ఏది చేయకూడదో చెప్పమని అడుగుతానని  సమాధానం ఇచ్చారు. అంతే కాదు, ఆ వెంటనే,తన ప్రశ్నకు  నెహ్రూ .. ఇచ్చిన సమాధానం కూడా చెప్పనా?  అంటూ  Never compromise with RSS   ఆర్ఎస్ఎస్ తో ఎప్పుడు రాజీ పడద్దు  అని నెహ్రూ చెప్పారని రాహుల్ చెప్పారు.  ఈ సభాషణను గమనిస్తే, రాహుల్ గాంధీకి ఆర్ఎస్ఎస్ పట్ల వ్యతిరేకత వెనుక జన్మజన్మల వైరం ఏదో ఉందనిపిస్తుంది. అలాగే.. ఆర్ఎస్ఎస్ పట్ల వ్యతిరేకత, ద్వేషం ఏస్థాయిలో వుందో,  అ ద్వేషం మూలాలు ఎక్కడ ఉన్నాయో కూడా స్పష్టంగా అర్థం అవుతుందని అంటున్నారు.   అయితే.. రాహుల్ గాంధీకి ఆర్ఎస్ఎస్ పట్ల ఇంత వ్యతిరేకత, ద్వేషం ఉన్నదన్న సంగతి అందరికీ తెలిసిందే.  అ యినా.. చిత్రంగా తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజాన్ మాత్రం..  కాంగ్రెస్ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని  సూచించారు. అవును..  చేవెళ్ల, జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల నేతలతో నిర్వహించిన  సమీక్షా సమావేశంలో ఆమె, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ఆదర్శంగా తీసుకుని,వారి పద్దతిలో పనిచేయాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.  అలాగే,ఆర్ఎస్ఎస్ ఎలా పనిచేస్తుందో కూడా ఆమె వివరించారు. ఆర్ఎస్ఎస్  సభ్యులు మనిషి మనిషినీ కలుస్తారు.  కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు కూడా అదే తరహాలో మనిషి మనిషినీ కలిసి ప్రభుత్వ పథకాలను, వాటి ద్వారా ఒనగూరుతున్న ప్రయోజనాలను వివరించాలని సూచించారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేవలం మీడియానో, సోషల్‌ మీడియానో నమ్ముకుంటే సరిపోదని అన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లి ముఖాముఖి  మాట్లాడాలని,  అప్పుడే ప్రజలు నాయకులకు, పార్టీకి, ప్రభుత్వానికి దగ్గరవుతారని చెప్పారు.  అయితే..  ఈ సూచనను, కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఎలా తీసుకుంటారు? ఎంత వరకు అమలు చేస్తారు? అనేది పక్కన పెడితే.. ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో నడవాలనే మీనాక్షి నటరాజన్ సూచనను రాహుల్ గాంధీ ఎలా తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారిందని అంటున్నారు. ఓవంక రాహుల్ గాంధీ, కాంగ్రెస్ లో ఉన్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ కోవర్టులను గుర్తించి  ఏరివేయాలని అంటుంటే, మీనాక్షి నటరాజన్  ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో నడవాలని కార్యకర్తలు, నాయకులకు చేసిన సూచనను ఎలా తీసుకోవాలని, కాంగ్రెస్ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది.  అయితే..  పార్టీ ముఖ్యనాయకులు మాత్రం  ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలేందుకు రాహుల్ గాంధీ ఒక్క నాటికీ అంగీకరించరని అంటున్నారు. అలాగే.. మీనాక్షి నటరాజన్  అనాలోచితంగా ఈ సూచన చేసి ఉండవచ్చునని అంటున్నారు. అన్నిటిని మించి,ఆర్ఎస్ఎస్  కార్యకర్తల  కమిట్మెంట్ తో పనిచేయడం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు మాత్రమే సాధ్యమని, ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందుకే, నటరాజన్ సూచనలను, అంత సీరియస్ గా తీసుకోవలసిన అవసరం లేదని కాంగ్రెస్ నాయకులే అంటున్నారు.
ఆర్ఎస్ఎస్  అడుగు జాడల్లో  హస్తం పార్టీ? Publish Date: Apr 22, 2025 9:11AM

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీస్సార్ ఆంజనేయులు అరెస్టు

ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును ఏపీ సీఐడీ అరెస్టు చేసింది. ముంబై నటి జత్వానీ కేసులో ఏపీ సీఐడీ అధికారులు ఆయనను హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. బేగంపేటలోని ఆయన నివాసంలో అదుపులోనికి తీసుకుని విజయవాడకు తరలించారు.  ప్రస్తుతం సస్సెన్షన్ లో ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు జగన్‌ హయాంలో  ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే.   ముంబై సినీ నటి జత్వానీ వైసీపీ నేత కుక్కల  విద్యాసాగర్‌పై  పెట్టిన కేసును ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేయడానికి గత జత్వానీపై కేసు బనాయించి, అక్రమంగా ముంబై నుంచి విజయవాడకు తీసుకు వచ్చి నిర్బంధించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు నటి జత్వానీ అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, అప్పుడు విజయవాడ సీపీగా ఉన్న కాంతిరాణాతాతా, డీసీపీగా ఉన్న విశాల్ గున్నీపై చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తును ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది.   ఇప్పుడు ఆ కేసులోనే పీఎస్సార్ ఆంజనేయులును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. 
ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీస్సార్ ఆంజనేయులు అరెస్టు Publish Date: Apr 22, 2025 8:56AM

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ నోటీసులు

తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ విషయంలో నగదు లావాదేవీల వ్యవహారంలో ఈ నెల 27న విచారణకు రావాల్సిందిగా ఆ నోటీసులలో పేర్కొంది.  సురానా గ్రూప్, సాయి డెవలపర్స్ అడ్వర్టైజ్ మెంట్ల కు మహేష్ బాబు భారీ రెమ్యునరేషన్ తీసుకున్నారన్న సమాచారంపై ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అడ్వర్టైజ్ మెంట్లకు మహేష్ బాబుకు ఇచ్చిన రెమ్యూనరేషన్ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్లుగా ఈడీ అనుమానిస్తోంది.ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కంపెనీలకు మహేష్ బాబు చేసిన అడ్వర్టైజ్ మెంట్ల కారణంగా పలువురు పెట్టుబడులు పెట్టారని ఈడీ చెబుతోంది. రియల్ ఎస్టేట్ సంస్థల అక్రమాలలో మహేష్ బాబుకు భాగస్వామ్యం లేనప్పటికీ.. వాటికి సంబంధించిన ప్రమేషన్ లలో పాల్గొని అక్రమ పద్ధతిలో డబ్బులు తీసుకున్నందుకే ఈడీ ఈ నోటీసులు జారీ చేసిందని చెబుతున్నారు.   ప్రస్తుతం హీరో మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జులైలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇదే కాకుండా మహేష్ బాబు పలు బ్రాండ్ల యాడ్ లలో నటిస్తున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలలో ఒకరైన మహేష్ బాబుకు ఈడీ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది.  
సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ నోటీసులు Publish Date: Apr 22, 2025 8:20AM

తిరుపతిలో భక్తులను నిలువుదోపిడీ చేస్తున్న ఆటోవాలాలు.. మితిమీరిన వేగంతో ప్రమాదాలు

ఓ వైపు తిరుమల కొండపై భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మరో వైపు శ్రీవారి మెట్ల నడకమార్గంలో భక్తులు పొటెత్తుతున్నారు. ఇదే అదునుగా భక్తులను ఆటోవాలాలు నిలువుదోపిడీ చేస్తున్నారు. తిరుపతి బస్టాండ్ నుంచి శ్రీవారి మెట్లు వరకూ కేవలం 20 కిలోమీటర్ల దూరానికి పెద్ద మొత్తంలో సొమ్ములు దండుకుంటున్నారు. టైమ్ స్టాట్ టోకెన్లు తీయిస్తామంటూ భక్తుల నుంచి అదనంగా సొమ్ములు వసూలు చేస్తున్నారు.  వేసవి సెలవులు కావడంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు.ఇదే అదునుగా ఒక్కో ఆటోలో పరిమితికి మించి భక్తులను తరలిస్తూ ఆటోవాలాలు ప్రమాదాలకు కారణమౌతున్నారు. సోమవారం (ఏప్రిల్ 21) ఎనిమిది మంది భక్తులను అలిపిరి బస్టాండ్ నుంచి శ్రీవారి భక్తులతో వస్తున్న ఆటో ప్రమాదానికి గురైంది. ఆ ఆటోవాలా కేవలం 20 కిలోమీటర్ల దూరానికి ఆ ఎనిమిది మంది భక్తులకూ కలిసి నాలుగువేల రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా అతి వేగంగా ఆటో నడుపుతూ భక్తుల నుంచి ముందు వెళుతున్న వాహనాన్ని తప్పించబోయి జీపును ఢీకొట్టాడు. దీంతో ఆటోలో ఉన్న భక్తులు గాయపడ్డారు. వారిలో బెంగళూరుకు చెందిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటోవాలాల దోపిడీని పోలీసులు నియంత్రించాల్సిన అవసరం ఉందనీ, అలాగే పరిమితిని మించిన ప్రయాణీలతో, మితిమీరిన వేగంతో వెళ్లే ఆటో డ్రైవర్ల మీద చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. 
తిరుపతిలో భక్తులను నిలువుదోపిడీ చేస్తున్న ఆటోవాలాలు.. మితిమీరిన వేగంతో ప్రమాదాలు Publish Date: Apr 22, 2025 8:09AM

ఐఏఎస్ ప్రసన్న వెంకటేష్ కు ప్రధానమంత్రి పురస్కారం

ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెడిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ(ఏపీఎస్ డబ్ల్యేఆర్ఇఐఎస్) సెక్రటరీ, ఐఏఎస్ అధికారి ప్రసన్న వెంకటేణ్  దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక   ప్రధానమంత్రి పురస్కారాన్ని అందుకున్నారు.  2023 సంవత్సరానికి సంబంధించి ఈ పురస్కారాన్ని ఆయన ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా అందుకున్నారు.  సోమవారం (ఏప్రిల్ 21)   17వ సివిల్ సర్వీస్ డే సంధర్బంగా డిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన వికసిత్  భారత్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ప్రధాని నరేందర మోడీ.. పాలనలో ఉత్తమ పనితీరు కనబరిచిన ఐఏఎస్ లకు ఈ పురస్కారాలను ప్రదానం చేశారు.  ప్రసన్న వెంకటేష్ జనవరి 2022 నుంచి జూలై 2024 వరకు ఏలూరు జిల్లాకు తొలి కలెకర్ట్ గా పనిచేశారు. ఆ సమయంలో ఆయన ప్రజలకు అందించిన సేవలకు గాను ప్రభుత్వం ఈ అవార్డు అందజేసింది.  ఏలూరు జిల్లా కలెక్టర్ గా పనిచేసిన సమయంలో ప్రసన్న వెంకటేష్ ప్రభుత్వ పథకాలను విస్సతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల అమలులో భాగంగా మహిళలు, బాలికల్లో రక్తహీనత నివారణకు విశేష కృషి చేశారు.  సామాజిక బాధ్యత చొరవ కింద జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో ‘అక్షజ’ అనే కార్యక్రమంతో గర్భిణీలు, ప్రసూతి మహిళల ఆరోగ్య సంరక్షణకు చర్యలు తీసుకుననారు. ఆయన కృషికి గుర్తింపుగా ప్రధాన మంత్రి పురస్కారానికి ఎంపికయ్యారు.   దేశ వ్యాప్తంగా పది జిల్లాల కలెక్టర్లకు ప్రధాని చేతుల మీదుగా ఈ పురస్కారం అందజేశారు. ా పది మందితో ప్రసనన వెంకటేష్ ఒకరు. పురస్కారం అందుకున్న సందర్భంగా ప్రసన్న కుమార్  ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిచేందుకు  శక్తివంచన లేకుండా తాను కృషి చేస్తానన్నారు.
ఐఏఎస్ ప్రసన్న వెంకటేష్ కు ప్రధానమంత్రి పురస్కారం Publish Date: Apr 22, 2025 7:09AM

చెలామణిలో నకిలీ కరెన్సీ.. రూ.500 నోట్లతో జాగ్రత్త!

500 రూపాయల నోట్లపై కేంద్ర హోంశాఖ సంచలన ప్రకటన చేసింది.   నకిలీ నోట్ల విషయంలో ఎన్ఐఏ, డీఆర్ఐ, సీబీఐ, సెబీ సహా అనేక శాఖలను కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది. నకిలీ నోట్లకు ఒరిజినల్ నోట్లకు తేడా అస్సలు గుర్తించ లేకుండా ఉన్నాయనీ,  అప్రమత్తంగా ఉండానీ ఆదేశాలు జారీ చేసింది. చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ తో నకిలీ నోట్లు చెలామణి అయ్యే ప్రమాదం భారీగా ఉందని చెప్పింది. అలాగే ఇప్పటికే అలాంటి 500 నోట్లు సర్కులేషన్ లో ఉన్నాయని, అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ అలర్ట్ జారీ చేసింది. ఇక ఆర్బీఐ కూడా నకిలీ 500 రూపాయల నోట్ల విషయంలో ప్రజలను అప్రమత్తం చేసింది.  నల్లధనాన్ని (బ్లాక్ మనీ) రూపుమాపడం, దొంగనోట్ల బెడద లేకుండా చేయడమే లక్ష్యమంటూ 2016 నవంబర్ లో ప్రధాని మోడీ పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు. ఉరుములేని పిడుగులా మోడీ తీసుకున్న ఆ నిర్ణయం అప్పట్లో సంచలనం సృష్టించింది. అప్పట్లో మోడీ నిర్ణయంతో సంపన్నులు, పేదలు అన్న తేడా లేకుండా జనం నానా ఇబ్బందులూ పడ్డారు. గంటల తరబడి నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల ముందు క్యూలో నిలుచున్నారు. కొన్ని నెలల పాటు ప్రజలంతా నగదు చెలామణి విషయంలో అల్లాడిపోయారు. అయినా దొంగనోట్ల బెడద ఇక ఉండదన్న ఆశతో భరించారు.  అయితే మోడీ నాడు తీసుకున్న నిర్ణయం లక్ష్యాన్ని సాధించిందా? అంటే లేదని ఇప్పుడు స్వయంగా కేంద్ర ప్రభుత్వమే చెబుతోంది. మార్కెట్ లో పెద్ద సంఖ్యలో దొంగనోట్లు చెలామణిలో ఉన్నాయనీ, అప్రమత్తంగా ఉండా లని ప్రజలను హెచ్చరిస్తోంది. ఆర్భాటంగా దేశ ప్రజలందరినీ నానా అగచాట్లకూ గురి చేస్తూ నాడు తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఎలాంటి సత్ఫలితాన్ని ఇవ్వలేదు సరికదా.. దొంగనోట్ల బెడద మరింత తీవ్రమైందని కేంద్రం స్వయంగా చెబుతోందిప్పుడు.  నిజం ఆధునిక సాంకేతికతను ఉపయోగించి తయారు చేసిన నకిలీ 500 రూపాయల నోట్లు పెద్ద ఎత్తున చెలామణిలోకి వచ్చినట్లు కేంద్రమే స్వయంగా ప్రకటించింది.  ఇలా మార్కెట్లో చెలామణి అవుతున్న నకిలీ నోట్ల సంఖ్య ఎంతన్నది చెప్పడం కూడా కష్టమని పేర్కొంది. నకిలీ కరెన్సీ విషయంలో ప్రజలే అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.   నకిలీ, ఒరిజినల్ నోట్లను గుర్తించడం కష్టంగా మారిందనీ పేర్కొంది. ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖ కూడా పేర్కొంది. అత్యంత నాణ్యతతో అచ్చుగుద్దినట్లు ఒరిజినల్ నోట్లను పోలి ఉండేలా నకిలీ నోట్లను రూపొందించిన నేర ముఠాలు వాటిని పెద్ద ఎత్తున మార్కెట్ లోకి తీసుకువచ్చారని, నకిలీ, ఒరిజినల్ మధ్య చిన్న అక్షరమే తేడా ఉందనీ పేర్కొంది. ఒరిజనల్ నోట్లపై రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెల్లింగ్ కరెక్టుకు RESERVE BANK OF INDIA అని ఉంటుందనీ, అయితే నకిలీ నోట్లపై ఆ స్పెల్లింగ్ RASERVE BANK OF INDIA అని ఉంటుందనీ వివరించింది. అత్యంత నిశితంగా పరిశీలిస్తే తప్ప మామూలుగా ఈ తేడాను కనిపెట్టడం కష్టమనీ పేర్కొంది.  
చెలామణిలో నకిలీ కరెన్సీ.. రూ.500 నోట్లతో జాగ్రత్త! Publish Date: Apr 22, 2025 6:28AM

నకిలీ ఐడీతో విదేశాలకు పారిపోయే ప్రణాళిక.. భగ్నం..రాజ్ కసిరెడ్డి అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ మద్యం లిక్కర్ కుంభకోణం కేసులో సోమవారం అత్యంత కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసులో, ఇప్పటికి నాలుగు సార్లు నోటీసులు అందుకుని కూడా సిట్ విచారణకు గైర్హాజరై తప్పించుకు తిరుగుతున్న రాజ్ కసిరెడ్డిని ఏపీ పోలీసులు సోమవారం (ఏప్రిల్ 21) అరెస్టు చేశారు. ఆయనను శంషాబాద్ విమానాశ్రయంలో   అదుపులోనికి తీసుకుని విజయవాడకు తరలించారు. నకిలీ ఐడీతో విదేశాలకు పారిపోయేందుకు పక్కా ప్రణాళికతో ఆయన గోవా నుంచి మారు పేరుతో హైదరాబాద్ కు వచ్చారు. ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చిన రాజ్ కసిరెడ్డిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం విషయంలో అన్నీ తానై వ్యవహరించినట్లుగా రాజ్ కసిరెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. జగన్ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్న రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మారుపేరుతో గోవా నుంచి సోమవారం సాయంత్రం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు.  ఆయన గోవానుంచి రాజేష్ రెడ్డి అనే మారుపేరుతో వచ్చినట్లు తెలుస్తోంది.   ముందస్తు బెయిలు కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించడంతో ఆయన సుప్రీం ను ఆశ్రయించారు. అయితే అక్కడ విచారణ జరిగిందా? లేదా అన్న సంగతి తెలియదు కానీ, ఇన్నాళ్లూ గోవాలో తలదాచుకున్న రాజ్ కసిరెడ్డి ఇంకా అక్కడే ఉంటే అరెస్టు తప్పదన్న బయంతో మారుపేరుతో హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ నుంచి నకిలీ ఐడీతో విదేశాలకు చేక్కేయాలన్నది రాజ్ కసిరెడ్డి ప్లాన్ అని సిట్ పోలీసులు చెబుతున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో తనను అదుపులోనికి తీసుకున్న సందర్భంగా తాను మంగళవారం (ఏప్రిల్ 22) సిట్ విచారణకు హాజరౌతాననీ, అసలు అందుకోసమే తాను హైదరాబద్ కు వచ్చానని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తాను ఒక ఆడియో ద్వార తెలియజేసిన సంగతిని కూడా ఆయన సిట్ పోలీసులకు తెలిపారు. అయితే సిట్ అధికారులు మాత్రం మీ మీద నమ్మకం లేదనీ, మీరు విచారణకు హాజరౌతారని తాము విశ్వసించడం లేదనీ విస్పష్టంగా చెప్పి అదుపులోనికి తీసుకున్నారు.   రాజ్ కసిరెడ్డిని మంగళవారం (ఏప్రిల్ 22) విజయవాడ కోర్ట్లో హాజరు పరిచే అవకాశం ఉంది. ఆ తరువాత కోర్టు అనుమతితో ఆయనను తమ కస్టడీలోకి తీసుకుని విచారించే యోచనలో సిట్ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చినప్పుడే రాజ్ కసిరెడ్డి వచ్చి ఉంటే ఆయన అరెస్టు అయ్యే వారు కాదనీ, విచారణకు డుమ్మా కొట్టి అజ్ణాతంలోకి వెళ్లినందుకే సిట్ ఆయనను అరెస్టు చేసిందని న్యాయనిపుణులు అంటున్నారు.    
నకిలీ ఐడీతో విదేశాలకు పారిపోయే ప్రణాళిక.. భగ్నం..రాజ్ కసిరెడ్డి అరెస్ట్ Publish Date: Apr 21, 2025 10:25PM

మాజీ ఎంపీ గోరంట్లకు పోలీస్ కస్టడీ విధించిన మొబైల్ కోర్టు

    పోలీసు సిబ్బందిపై దాడికి పాల్పడిన కేసులో వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు  ఏప్రిల్ 23, 24 తేదీల్లో రెండు రోజుల పాటు మాధవ్‌ను పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు మొబైల్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ రెండు రోజుల పాటు గుంటూరు పోలీసులు గోరంట్ల మాధవ్‌ను అదుపులోకి తీసుకుని, కేసు వివరాలపై లోతుగా విచారించనున్నారు. మరోవైపు, ఇదే కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాధవ్ పెట్టుకున్న అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది.  వైసీపీ అధినేత వైఎస్ జగన్ సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో పార్టీ నుంచి సస్పెండై అరెస్టు కూడా అయిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ కుమార్ ను తరలిస్తుండగా గోరంట్ల మాధవ్ ఆయనపై దాడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు మాధవ్ ను అరెస్టు చేసి గుంటూరుకు తరలించారు. ప్రస్తుతం రాజమండ్రి జైలులో గోరంట్ల మాధవ్ రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.  
మాజీ ఎంపీ గోరంట్లకు పోలీస్ కస్టడీ విధించిన మొబైల్ కోర్టు Publish Date: Apr 21, 2025 9:27PM

ఏపీ గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ రిలీజ్

ఏపీ గ్రూప్-1 మెయిన్స్ రాత పరీక్షకు ఏపీపీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసింది. మే 3 నుంచి 9 వరకు మెయిన్స్ నిర్వహించనున్నారు. ఈ పరీక్షల కోసం రాష్ట్రంలోని 4 జిల్లా కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఏపీపీఎస్సీ పేర్కొన్నాది. అన్ని పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగుతుందని తెలిపింది. వీటికి సంబంధించిన హాల్ టికెట్లను httpps://psc.ap.gov.in అధికారిక వెబ్సైట్ లో నేటి నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చని ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ఏపీలో మొత్తం 81 గ్రూప్‌ -1 పోస్టుల భర్తీకి గతేడాది మార్చి 17న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 1,48,881మంది ప్రిలిమ్స్‌కు దరఖాస్తు చేసుకోగా.. 4,496మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు.  గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షను డిస్క్రిప్టివ్ టైప్‌లో నిర్వహిస్తామని, ప్రశ్నపత్రాన్ని ట్యాబ్‌ల్లో ఇవ్వాలని నిర్ణయించినట్టు సంగతి విదితమే
ఏపీ గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ రిలీజ్ Publish Date: Apr 21, 2025 8:52PM

రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు

  ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డిని ఏపీ సిట్ పోలీసులు శంషాబాద్ ఎయిర్‌‌ఫోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఆయన దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చినట్లు సమాచారం. తాను రేపు విచారణకు హాజరవుతానని వారికి ఆయన తెలిపారు. అయితే, హాజరవుతారో లేదోనని అనుమానంగా ఉందని, తమ వెంట రావాల్సిందేనని అక్కడి నుంచి పోలీసులు తీసుకెళ్లిపోయారు. మరికాసేపట్లో అతడిని విజయవాడ తరలించనున్నారు. మరోవైపు ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ గతంలో రాజ్‌ కసిరెడ్డి, హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం అందుకు అంగీకరించలేదు. తదుపరి విచారణను వారం రోజులపాటు వాయిదా వేసింది. ఈ క్రమంలో మంగళవారం తాను విచారణకు హాజరవుతానని రాజ్‌ కసిరెడ్డి ఇవాళ ఆడియో  రిలీజ్ చేశారు. అంతలోనే అతడిని ఏపీ సిట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఈ నేపథ్యంలోనే ఆయన సిట్ అధికారులనుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. ఆయన కోసం సిట్ బృందాలు గాలింపు చేపట్టాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌తో పాటు గచ్చిబౌలి, ఫైనాన్స్ డిస్ట్రిక్‌లో గాలించాయి. ఈ క్రమంలో అతడి నివాసానికి నోటీసులు అంటించాయి. అతడి కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న రాయదుర్గంలోని ఆరేట ఆసుపత్రితోపాటు రాజ్ కసిరెడ్డికి చెందిన ఈడీ క్రియేషన్స్ కార్యాలయంలో సోదాలు నిర్వహించాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్‌పై విధించిన పాలసీలు, సరఫరా విధానాలు, టెండర్ విధానాల్లో భారీ ఆర్థిక అక్రమాలు జరిగినట్లు సిట్ గుర్తించింది. ముఖ్యంగా, కొన్ని లిక్కర్ కంపెనీలకు ప్రభుత్వ నిబంధనలు మీరి మినహాయింపులు ఇవ్వడం, కొందరికి అనుచిత లాభాలు వచ్చేలా పాలసీ మార్చడం వంటి చర్యలు ఈ స్కాంకు బలమైన ఆధారాలుగా మారుతున్నాయి. ఈ వ్యవహారంలో రాజ్ కసిరెడ్డి ప్రధాన పాత్ర పోషించినట్లు సిట్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు Publish Date: Apr 21, 2025 8:16PM

రికార్డు స్థాయిలో బంగారం ధర.. తులం ఎంతంటే?

  బంగారం ప్రియులకు ఇది షాకింగ్ న్యూస్. ఇక పసిడి కోనుగోలు చేయాలంటే సామాన్య ప్రజలకు మరింత కష్టతరం అవుతోంది. రోజురోజుకి గోల్డ్ రేటు అకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా బంగారం ధరకి మరోసారి రెక్కలు వచ్చాయి. 10 గ్రాముల బంగారం ధర పన్నులతో కలిసి అక్షరాల లక్ష రూపాయిలను తాకింది. దేశంలో బంగారం ధర ఈ స్థాయిని అందుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సోమవారం ఉదయం రూ.98,350 ఉన్న24 క్యారెట్ల గోల్డ్ తులం రేటు సాయంత్రం 5.30 గంటల సమయానికి రూ.1,00,016కు చేరింది. శుక్రవారం ముగింపుతో పోలిస్తే దాదాపు రూ.2వేలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు 3,393 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా- చైనాల మధ్య వాణిజ్యం విషయంలో సయోధ్య కుదిరేంతవరకు ఇదే పరిస్థితి కొనసాగొచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.  ఇక పెరిగిన పసిడి ధరను చూసి సామాన్యులు గుండెలు బాదుకుంటున్నారు. ఇప్పట్లో తాము పసిడి కొనుగోలు చేయడం ఇక కలే అని వాపోతున్నారు. శుభకార్యాల సీజన్ ముందుండటంతో అసలు ఏం చేయాలో పాలు పోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  అమెరికా-చైనా సుంకాల యుద్ధం నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడి వైపు చూస్తున్నారు. బలహీనపడుతున్న డాలర్, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు బంగారం పెరుగుదలకు ప్రధాన కారణాలని విశ్లేషకులు భావిస్తున్నారు. హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,469గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,599గా నమోదైంది. విజయవాడలో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,475గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,605గా నమోదైంది.దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 89,613గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 97,743గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 89,465 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 97,595గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 89,461గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 97,591గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 89,455గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 97,585గాను ఉంది.
రికార్డు స్థాయిలో బంగారం ధర.. తులం ఎంతంటే? Publish Date: Apr 21, 2025 6:20PM

బాలినేని చాణక్యం.. జనసేన గూటికి మానుగుంట?

ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరావు వైసీపీకి రాజీనామా చేసి జనసేన గూటికి చేరారు. ఆయన చేరిక అప్పట్లో వివాదాస్పదంగా మారింది. ఆయన జనసేన చేరికను తెలుగుదేశం గట్టిగా వ్యతిరేకించింది. బాలినేని చేరిక సందర్కభంగా ఒంగోలులో పలు చోట్ల ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు ధ్వంసం చేశారు. ఇక అటు జనసేనలో కూడా అప్పట్లో ఆయన చేరిక పట్ల వ్యతిరేకత వ్యక్తమైంది.  వైసీపీ అధినేత జగన్ కు బంధువు కావడం, ఆయన చేరికతో వైసీపీ నుంచి పలువురు ఆయన అనుచరులు కూడా వచ్చి చేరే అవకాశాలు ఉండటంతోనే అప్పట్లో బాలినేనిని తెలుగుదేశం, జన సేనలు వ్యతిరేకించాయి. అయితే.. పవన్ కల్యాణ్ మాత్రం బాలినేనిని మాత్రమే చేర్చుకుంటున్నట్లు క్లారిటీ ఇవ్వడమే కాకుండా బాలినేని కోరినట్ల ఒంగోలులో భారీ సభ ఏర్పాటు చేసి మందీ మార్బలంతో పార్టీ తీర్ధం పుచ్చుకోవాలని భావించిన బాలినేనికి చెక్ పెట్టారు. ఒంగోలులో కాదు.. ఒక్కరుగా మంగళగిరి వచ్చి పార్టీ కండువా కప్పుకోండని తేల్చి చెప్పారు. దాంతో బాలినేని అప్పట్లో ఒక్కడుగానే మంగళగిరి వెళ్లి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. అయితే అప్పటి నుంచీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలలో తన అనుచరులందరినీ జనసేన గూటికి చేర్చాలన్న ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవలి కాలంలో ఆయన ఆపరేషన్ ఆకర్ష్ ను వేగవంతం చేశారు.  వైసీపీలో అసంతృప్త నేతలపై ఫోకస్ చేస్తున్న బాలినేని.. ఉమ్మడి ఒంగోలు జిల్లాలో  జనసేన బలోపేతమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.   వైసీపీలోని ఓ కీలక నేతతో  బాలినేని మంతనాలు సాగిస్తున్నారనీ, త్వరలో ఆ కీలక నేత జనసేన తీర్థం పుచ్చుకునే అవకాశాలున్నాయనీ అంటున్నారు.  గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతోపాటు పార్టీకి భవిష్యత్తు లేదన్న అంచనాతో కందుకూరు మాజీ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారని గట్టిగా వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ పరిస్థితి మరింత అగమ్యగోచరంగా తయారవుతోంది. కీలక నేతలు ఒక్కొక్కరుగా వైదొలగుతుండటంతో పరిస్థితి మరింత దిగజారుతోందని అంటున్నారు. ప్రధానంగా వైసీపీ నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతలు.. అక్కడ తమ ప్రాబల్యం పెంచుకునేందుకు తమ అనుచరులను వైసీపీకి రాజీనామా చేసి రమ్మంటూ ప్రోత్సహిస్తున్నారు.  గతంలో వైసీపీలో కీలకంగా పనిచేసిన మాజీ మంత్రి బాలినేని ఈ కోవలో అందరికంటే ముందున్నట్లు ప్రచారం జరుగుతోంది. జనసేనలో చేరినప్పుడే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీని ఖాళీ చేస్తానని ఆయన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.ఇప్పుడు ఆ దిశగా అడుగులేస్తూ కందుకూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డిని జనసేనలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెబుతున్నారు.  ప్రకాశం జిల్లాకు చెందిన మహీధర్ రెడ్డి సీనియర్ నేత. 1989లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన 2014 వరకు కాంగ్రెస్ లో కొనసాగారు. 2014లో వైసీపీలో చేరిన ఆయన కందుకూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2019లో వైసీపీ టికెట్ ఇవ్వకపోవడంతో పోటీకి దూరంగా ఉండిపోయారు. 2009 నుంచి 2014 వరకు రాష్ట్రమంత్రిగా పనిచేసిన మహీధర్ రెడ్డి తండ్రి ఆదినారాయణ రెడ్డి కూడా శాసనసభ్యుడిగా సేవలందించారు. తొలి నుంచి టీడీపీ వ్యతిరేక రాజకీయాలు చేస్తున్న మహీధర్ రెడ్డి ఈ కారణంగా గత ఎన్నికల ముందు తెలుగుదేశం నుంచి ఆహ్వానం వచ్చినా వెళ్లలేదని చెబుతున్నారు. వైసీపీ టికెట్ నిరాకరించినా, అందుకే ఆ పార్టీని వీడకుండా కొనసాగుతున్నారు. అయితే పార్టీ అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్న మహీధర్ రెడ్డి అధినేత జగన్ వైఖరి మారుతుందని ఇన్నాళ్లు వెయిట్ చేశారని అంటున్నారు.  కానీ  పార్టీ ఓడినా అధిష్టానం వైఖరి మారకపోవడంతో ఇప్పుడు ఆయన పార్టీ మారే ఆలోచన చేస్తు న్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు ప్రకాశం జిల్లాలో జనసేన కార్యకలాపాలు పుంజుకోవడం, భవిష్యత్తులో ప్రత్యామ్నాయ శక్తిగా అవతరిస్తుందన్న అంచనాకు తోడు బాలినేని ప్రోత్సాహంతో  మహీధర్ రెడ్డి జనసేనపై మొగ్గుచూపుతున్నారని అంటున్నారు.  ఆయన చేరికకు  జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఓకే చెప్పారని ప్రచారం జరుగుతోంది. వివాద రహితుడు, సీనియర్ నేత,  రాజకీయ కుటుంబ నేపథ్యం వల్ల మహీధర్ రెడ్డి చేరికను ఇతర భాగస్వామ్యపక్షాలు వ్యతిరేకించే పరిస్థితి లేదనీ,  త్వరలోనే మహీధర్ రెడ్డి జనసేన తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
బాలినేని చాణక్యం.. జనసేన గూటికి మానుగుంట? Publish Date: Apr 21, 2025 5:34PM

తెలుగుదేశం మహానాడుకు తొలి ఆహ్వానం ఎవరికో తెలుసా?

ఆవిర్భావం నుంచి తెలుగుదేశం కార్యకర్తల పార్టీయే. ఎన్ని సంక్షోభాలు ఎదురైనా పార్టీకి అండగా కార్యకర్తలు నిలబడి పార్టీని నిలబెట్టుకున్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం మాత్రమే. అదే విధంగా తెలుగుదేశం పార్టీ కూడా తొలి నుంచీ కార్యకర్తల సంక్షుమానికే పెద్ద పీట వేస్తూ వస్తున్నది అనడంలో సందేహం లేదు.  పార్టీ అధికారంలో ఉన్నప్పుడూ, విపక్షంలో ఉన్నప్పుడూ కూడా పార్టీ అధినాయకత్వం కార్యకర్తల పక్షానే నిలబడింది.  సాధారణంగా రాజకీయ పార్టీలు కార్యకర్తల గురించి ఆలోచించేదీ, మాట్లాడేదీ పార్టీ అధికారంలో లేని సమయంలో మాత్రమే. ఆ పద్ధతికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ భిన్నంగానే ఉంది.  పార్టీ మనుగడ, ఉనికికి కార్యకర్తలే ప్రధానమని భావిస్తూ వచ్చింది.   ఇందుకు తజా నిదర్శనం ఏమిటంటే.. తెలుగుదేశం పార్టీ కడప వేదికగా నిర్వహించనున్న పార్టీ పండుగ మహానాడుకు తొలి ఆహ్వానం పార్టీ కార్యకర్త కుటుంబానికి ఇవ్వాలని నిర్ణయించడమే. అది కూడా పార్టీ కోసం ప్రాణాలను త్యాగం చేసిన తోట చంద్రయ్య కుటుంబానికి మహానాడుకు తొలి ఆహ్వానం అంద జేయాలని నిర్ణయించింది. ఆ ఆహ్వానం కూడా  ఏ స్థానిక నేతతోనో పంపించడం కాకుండా.. మంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్వయంగా చంద్రయ్య ఇంటికి వెళ్లి అందజేయాలని నిర్ణయించుకున్నారు.   చంద్రయ్య ఎవరో కాదు. పార్టీలో సామాన్య కార్యకర్త. తన చివరి రక్తం బొట్టు వరకూ తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. ఆ పార్టీ కోసమే పని చేశారు. జగన్ రాక్షస పాలన సాగుతున్న కాలంలో వైసీపీ గూండాల చేతిలో హతమయ్యారు. చంద్రయ్య తెలుగుదేశం జెండా మోయడమే వైసీపీ గూండాలు ఆయనను హత్య చేయడానికి కారణం.  పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ పరిధిలోని గుండ్లపాడు గ్రామానికి చెందిన తోట చంద్రయ్య 2022 జనవరి 13న స్థానిక వైసీపీ నేతలు అత్యంత పాశవికంగా గొంతు కోసి హత్య చేశారు. గొంతు కత్తిమీద పెట్టి జై జగన్, జై వైసీపీ అంటే వదిలేస్తామన్నా కూడా చంద్రయ్య నోటి వెంట జై తెలుగుదేశం, జై చంద్రబాబు అన్న నినాదమే వచ్చింది.దీంతో వైసీపీ   మూకలు ఆయనను అత్యంత పాశవికంగా హత్య చేశాయి. ఈ ఘటన అప్పట్లో పెను సంచలనమే సృష్టించింది. చంద్రబాబు స్వయంగా తోట చంద్రయ్య అంత్యక్రియలకు హాజరై, ఆయన పాడె మోశారు.   ఇప్పుడు కడపలో నిర్వహించనున్న మహానాడును వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో నిర్వహించనున్నది తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ పండుగకు ఆహ్వాన పత్రికలు రెడీ అయ్యాయి. మొదటి ఆహ్వాన పత్రికను పార్టీ కోసం ప్రాణాలర్పించిన కార్యకర్త తోట చంద్రయ్య కుటుంబానికి ఇవ్వాలని తెలుగుదేశం నిర్ణయించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్వయంగా గుండ్లపాడు గ్రామానికి వెళ్లి తన స్వహస్తాలతో తోట చంద్రయ్య కుటుంబాన్ని మహానాడుకు ఆహ్వానిస్తారు.  తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే ప్రాణమనీ, అటువంటి కార్యకర్తల సంక్షేమం కోసం పాటుపడటం తన కర్తవ్యమనీ లోకేష్ ఎప్పుడూ చెబుతుంటారు. ఆ చెప్పడం మాటల వరకే పరిమితం కాదనీ, చేతలు కూడా అలాగే ఉంటాయనీ మరోసారి పార్టీ  కార్యకర్త కుటుంబానికి మహానాడు తొలి ఆహ్వానాన్ని అందించడం ద్వారా రుజువు చేస్తున్నారు నారా లోకేష్.  
తెలుగుదేశం మహానాడుకు తొలి ఆహ్వానం ఎవరికో తెలుసా? Publish Date: Apr 21, 2025 5:07PM