సూసైడ్ నోట్ సుడిగాలిలో... గాలి!
posted on Dec 7, 2016 5:03PM

గాలి జనార్దన్ రెడ్డికి ఎదురు గాలి బలంగానే వీస్తోంది! దాదాపు నాలుగేళ్లు హైద్రాబాద్, బెంగుళూరు జైలల్లో వున్న ఆయన కూతురు పెళ్లి గ్రాండ్ గా చేసి కట్నాలు చెల్లించుకున్నాడు. కాకపోతే, కట్నాలు ఇచ్చుకుని కష్టాలు కొని తెచ్చుకున్నాడు. ఇప్పటికే దేశమంతా నోట్ల కటకట నడుస్తోన్న ఈ తరుణంలో ఆయన వందల కోట్ల వివాహం ఎలా చేశాడని అంతటా చర్చ నడుస్తోంది. ఎలా మైనింగ్ డాన్ కి బోలెడంత వైట్ మనీ, కొత్త నోట్లు వచ్చాయని మాట్లాడుకుంటున్నారు. కాని, తాజాగా బయటపడ్డ ఒక సూసైడ్ లెటర్ రాజకీయంగా పెద్ద గాలి దుమారమే లేపేలా కనిపిస్తోంది!
కర్ణాటకలోని అడ్మినిస్ట్రేటివ్ క్యాడర్ కు చెందిన ఆఫీసర్ భీమా నాయక్. ఈయన డ్రైవర్ రమేష్ గౌడ. ఆయన అత్యంత విషాదంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాని, పురుగుల మందు తాగి ప్రాణాలు పోగొట్టుకున్న గౌడ ఒక లెటర్ రాశాడు. అందులో గాలి జనార్దన్ రెడ్డి మనుషులు తనని చంపేస్తామని బెదిరించారని పేర్కొన్నాడు. అందుకు కారణం, కర్ణాటక ప్ర్రభుత్వ బ్యూరోక్రాట్ అయిన భీమా నాయక్ డ్రైవర్ గా తనకు తెలిసిన రహస్యాలేనన్నాడు. ఇంతకీ, రమేష్ గౌడకు తెలిసిన రహస్యం ఏంటి? సూసైడ్ నోట్ లోనే చెప్పాడు... గాలి తన కూతురు పెళ్లి సందర్భంగా వంద కోట్ల పాత నోట్లని కొత్త వాటితో మార్చేసుకున్నాడు. ఈ అక్రమ మార్పిడికి గవర్నమెంట్ అధికారి భీమా నాయక్ సహకరించాడు. ప్రతి ఫలంగా 20శాతం కమీషన్ తీసుకున్నాడు. అంతే కాదు, గాలి జనార్దన్ రెడ్డిని ఆయన వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇప్పించమని కూడా కోరాడట. ఈ డీల్ వర్కవుట్ చేసుకునేందు కోసం జనార్దన్ రెడ్డి కర్ణాటక ఎంపీ శ్రీరాములుతో కలిసి భీమా నాయక్ ని అనేక సార్లు ఒక బెంగుళూరు హోటల్ లో కలిశాడట!
రాజకీయంగా పెద్ద దుమారం రేపనున్న ఈ వంద కోట్ల వ్యవహారమంతా డ్రైవర్ రమేష్ గౌడ తన లెటర్ రాసి చనిపోయాడు. ప్రస్తుతం పోలీసులు రమేష్ తన చావుకు బాధ్యుడుగా పేర్కొన్న అధికారి భీమా నాయక్ పై కేసు నమోదు చేశారు. అయితే, ముందు ముందు ఇది గాలి మెడకు కూడా తప్పక చుట్టుకునే అవకాశమే వుంది. నాలుగేళ్లు జైల్లో వుండొచ్చిన ఆయన ప్రస్తుతం ఏ పార్టీలోనూ కొనసాగటం లేదు. బీజేపి ఆయన్ని అనేక కేసుల నేపథ్యంలో పార్టీ నుంచి బహిష్కరించింది....