Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తమిళనాట ఉచితాల పోటీ!
posted on: Mar 25, 2026 10:26AM

మాములుగా ఉచిత పథకాలంటే ఎవరికైనా ఠక్కున గుర్తుకు వచ్చేది తమిళనాడే. ఈ ఉచితాల వ్యవహారం ఇక్కడ 1925 నాటి నుంచే మొదలైంది. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న మధ్యాహ్న భోజన పథకం మొదలైందే ఇక్కడ. ఇక 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే ఓటర్లను ఆకర్షించేందుకు పలురకాల ఉచితాల వల పన్నాయంటే పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు. ఆ ఫ్రీ స్కీమ్స్ వివరాలు ఎలాంటివి అని చూస్తే..
ఎడప్పాడి పళనిస్వామి తన అన్నాడీఎంకే మేనిఫెస్టోలో భారీ ఉచితాలను ప్రకటించింది. అవేంటో చూస్తే.. మహిళలకు నెలకు 2 వేల ఆర్ధిక సాయం, ప్రతి కుటుంబానికి ఒకసారి పది వేల రూపాయల సాయం, బియ్యం రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఉచిత రిఫ్రిజిరేటర్, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు.. ఇక ఉచిత బస్సు ప్రయాణం మహిళలతో పాటు ఇప్పుడు పురుషులకూ వర్తింప చేయడం. ఈ లెక్కన తమిళనాడు ఆర్టీసీ బస్సులో అందరికీ దాదాపు ఫ్రీ అన్నమాట. ఇదిలా ఉంటే ప్రతి నెలా ఉచితంగా కిలో పప్పు, లీటర్ వంట నూనె ఇస్తారు. ఇక వృద్ధాప్య ఫించన్ నెలకు 1200 నుంచి రెండు వేలకు పెంపు.
ఇక విజయ్ టీవీకే పార్టీ అయితే.. మహిళలకు నెల నెలా 2500, అన్న విజయ్ సాయం పథకం కింద పెళ్లి చేసుకునే మహిళలకు ఎనిమిది గ్రాముల బంగారం, పట్టు చీర ఇస్తానని ప్రకటించారు. గ్యాస్ సిలిండర్ల విషయానికి వస్తే.. ఏడాదికి ఆరు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని అన్నారు. పుట్టిన ప్రతి బిడ్డకూ బంగారు ఉంగరం, బేబీ వెల్కం కిట్, విద్యార్ధులకు ఉచిత ఉన్నత విద్య, రైతులకు పూర్తి రుణ మాఫీ.. అంటూ ఉచిత వరాల జల్లు కురిపించింది.
అలాగే అధికార డీఎంకే తన పాత పథకాలను ఒక పక్క కొనసాగిస్తూనే .. కొత్త హామీలపైనా దృష్టి సారించింది. ఒకపక్క రాష్ట్రాభివృద్ధి, ఉపాధి కల్పన ఇప్పటికే అమలవుతున్న మహిళా నిధి పెంపుదలపై తర్జన భర్జన పడుతోంది డీఎంకే. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే స్టీల్ పాత్రలు, చీరలు వంటి కానుకల పంపిణీ ద్వారా ఓటర్లకు చేరువయ్యే యత్నం చేస్తోంది. ఇక్కడ అన్నాడీఎంకే, టీవీకే మధ్య ఒక రకమైన ఉచితాల పోటీ నడుస్తోందనే చెప్పాలి.. మహిళలకు ఇచ్చే నగదు సాయం, గ్యాస్ సిలిండర్లు, పురుషులకు కూడా ఉచిత బస్సు, ఫ్రిడ్జ్, 8 గ్రాముల బంగారం అంటూ వీరు ఒకరికి మించి మరొకరు పోటీ పడుతున్నారు.
ఈ ఉచితాల ప్రభావం ఓటర్లపై ఎంత మేర ప్రభావం చూపిస్తాయో తేలాల్సి ఉంది. దానికి తోడు అన్నాడీఎంకే ఈ సారి ఎన్డీయేతో కలసి పోటీ చేస్తోంది. ఇటు ఉచితాలు, అటు కేంద్రంలోని బీజేపీతో కలసి చేస్తున్న పోటీ అన్నాడీఎంకేని గెలిపిస్తాయా? లేక విజయ్ ప్రభావంతో డీఎంకే మళ్లీ గెలుస్తుందా తేలాల్సి ఉంది.



.webp)


