ఎవ‌రికీప‌ట్ట‌ని అనీల్ ఎక్క‌డున్నారు?

కొన్ని సంఘ‌ట‌నలు ఇబ్బంది పెడ‌తాయి. కొన్ని స్వ‌యంకృతాలూ జీవితాన్నే తారుమారు చేస్తాయి. మాజీ మంత్రి అనీల్ ది రెండ‌వ ర‌కం. మాజీ మంత్రిగా అయినా అంద‌రితో మంచిగా వుండాల్సిన‌వారు హ‌ఠా త్తుగా అజ్ఞాతంలోకి వెళ్లారు. మ‌రి ఎప్పుడు తిరిగివ‌స్తారు, నెల్లూరు సిటీలో పోటీ చేస్తారా లేదా అన్న‌ది  నెల్లూరు జిల్లాలో పెద్ద చ‌ర్చ. మంత్రి ప‌దవి పోయిన త‌ర్వాత ఏమ‌యిందో ఏమో ఫ్లెక్సీల గొడ‌వ తో పార్టీ పెద్ద‌ల ఆగ్ర‌హానికి గుర‌య్యారు.

ఆ త‌ర్వాత అజ్ఞాతంలోకి వెళిపోయారు.  అనీల్ ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అంటే ప‌డి చ‌చ్చేంత వీరాభిమాని. ఆ విషయం రుజువు చేసుకోవడానికి తుపాకీ ధ‌రించి అతిగా  వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌భుత్వం ఏర్ప‌డే వ‌ర‌కూ న‌చ్చిన ఆయన ప్ర‌వ‌ర్త‌న ఆ త‌ర్వాత పార్టీ పెద్ద‌ల‌కూ న‌చ్చ‌లేదు. ఆయన అతి ప్ర‌వ‌ర్త‌న ప్ర‌తిప‌క్షాల‌తోపాటు అధికార‌ప‌క్షంవారికి విసుగెత్తించింది.  ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం వ‌ర్గంవారికి అనిల్ వైఖరి బొత్తిగా నచ్చలేదు. అనీల్ మంత్రి ప‌దవి పోయిన త‌ర్వాత అంద‌రూ ఆయ‌న్ను టార్గెట్ చేయ‌డం తో మ‌ద్రాసుకు మ‌కాం మార్చారు. 

అస‌లే ప‌రిస్థితులు అనుకూలించ‌కపోవ‌డంతోపాటు ఆనం, కాకాణివ‌ర్గం ఒక‌టి కావ‌డం అనిల్ కు ఇబ్బందిక‌రంగా మారింది.  దీనితో అనీల్ ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి సోద‌రుడు విజ‌య‌కుమార్ రెడ్డితో జ‌త‌క‌ట్టారు.  నెల్లూ రులో ఆనం మ‌ద్ద‌తు వుంటే దేన్న‌యినా సాధించ‌వ‌చ్చ‌ని అనీల్ న‌మ్మ‌కం. నెల్లూరు సిటీలో గెల‌వవ‌చ్చ ని పావులు క‌దిపారు. కాకాణి గోవర్దన్బరెడ్డి మంత్రి అయ్యాక అనిల్ కు ఊహించని పరిణామాలు ఎదుర య్యాయి. అనం , కాకాణి వర్గం ఒకటి కావడం అనిల్ కు చెక్ పెట్టడం చకచకా జరిగిపోయాయి.  

ఈ విష‌య‌మై నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్ రెడ్డి మండి ప‌డ్డా రు. అనిల్ తో స్నేహం కటాఫ్ చేసి తన నియోజకవర్గం లొ ఎవరైనా తలదూరిస్తే తాను కూడా అన్నీ నియో జకవర్గం లొ కాలు పెట్టాల్సి వస్తుందని మీడియా సమావేశం పెట్టి మరీ వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఈ వార్నింగ్‌ అనీల్ తో పాటు మరి కొందరికి కుడా తగిలేలా చెప్పాడు దీంతో అనిల్ ఉక్కిరి బిక్కిరి అవుతు న్నాడట. 

ఆమద్య ప్లినరీ సమావేశా నికి వచ్చిన అనిల్ తాను వెంకటగిరి నుంచి పోటీ చేస్తానని ప్రచారం జరుగోతోందనీ,   అది అవాస్తవమని తాను నెల్లూరు సిటీ నుంచే పొటీ చెస్తున్నట్టు ప్రకటించుకొని మళ్లీ వెళ్లి పొయాడు. అనీల్ అజ్ఞాతం లోకి వెళ్ళ‌డానికి అస‌లు కార‌ణాలేమిట‌న్న‌ది   పార్టీవ‌ర్గాల‌కీ ఇదమిథ్థంగా తెలియ‌డంలేదు. ఎందుకంటే   అనీల్ మంత్రి ప‌ద‌వి పోయిన త‌ర్వాత ఆయ‌న్ను పెద్ద‌గా ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. మ‌రో వంక   ఏపీ ముఖ్య‌మంత్రి కూడా అనీల్ సంగ‌తి ప‌ట్టించుకోవ‌డం లేదు.