Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పెట్టుబడుల వరద.. ఉద్యోగాల వెల్లువ.. లోకేష్ దక్షిణ కొరియా పర్యటన.!
posted on: Jul 9, 2026 11:51AM

ఆంధ్రప్రదేశ్ ను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్‌గా మార్చే లక్ష్యంతో ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన దక్షిణ కొరియా పర్యటన అద్భుత విజయాలను సాధించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడమే ధ్యేయంగా సాగిన ఈ పర్యటన ఏపీ యువతకు ఉపాధి అవకాశాల వెల్లువను తీసుకురానుంది. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు సూత్రాల 3ఎస్ మోడల్ తో పారదర్శక పాలన అందిస్తామని కొరియా దిగ్గజాలకు లోకేష్ భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో భాగంగా సియోల్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశాలలో ప్రపంచ స్థాయి కంపెనీల నుంచి వేల కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు ఖరారయ్యాయి.
వీటిలో ప్రధానంగా చెప్పుకోవలసింది.. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ శ్రీసిటీలో 5 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో తన మూడో భారతీయ ఉత్పాదక ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికే ఇక్కడ కమర్షియల్ ప్రొడక్షన్ ప్రారంభం కానుండగా, దీని ద్వారా పదిహేనువందల మంది ఐటీ, ఎలక్ట్రానిక్స్ నిపుణులకు ఉద్యోగాలు లభించనున్నాయి. అలాగే వైజాగ్ వేదికగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీపీ) ఏర్పాటు చేయాల్సిందిగా ఎల్జీ ప్రతినిధులను లోకేష్ కోరారు. అందుకు వారు సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా సెమీకండక్టర్ రంగంలో అగ్రగామిగా ఉన్న అపాక్ట్ వైజాగ్ వేదికగా ఏసిప్ టెక్నాలజీస్ భాగస్వామ్యంతో 468 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఈ కేంద్రం ద్వారా ఏడాదికి 96 మిలియన్ల సెమీకండక్టర్ పరికరాలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనితో పాటు ఏపీ యువతకు సెమీకండక్టర్ అసెంబ్లీ, ప్యాకేజింగ్ మరియు టెస్టింగ్ సాంకేతికతల్లో నైపుణ్య శిక్షణ అందించేందుకు అపాక్ట్ అంగీకరించింది.
ఆటోమొబైల్, స్మార్ట్ హెల్త్‌కేర్ విభాగాలలో కూడా ఏపీకి భారీ పెట్టుబడులు రానున్నాయి. ప్రముఖ కొరియన్ ఆటోమొబైల్ టెక్నాలజీ దిగ్గజం హ్యుందాయ్ మోబిస్ ప్రతినిధులతో లోకేష్ జరిపిన చర్చలు సఫలీకృతమయ్యాయి. తిరుపతి లేదా అనంతపురం పరిసనాలకల్లో.. ఈవీ కాంపోనెంట్స్, బ్యాటరీ సిస్టమ్స్ తయారీ యూనిట్‌తో పాటు రాష్ట్రంలో ఈవీ సెమీకండక్టర్ హబ్‌ను ఏర్పాటు చేయడానికి హ్యుందాయ్ హెబిస్ ముందుకు వచ్చింది. అలాగే రూ. 300 కోట్ల పెట్టుబడితో సరికొత్త స్మార్ట్ మెడికల్ ఫుట్‌వేర్ ఉత్పాదక రంగాన్ని ప్రారంభించేందుకు షూఆల్స్ సంస్థ ముందుకొచ్చింది. దీని ద్వారా రాష్ట్రంలో 3 వేలకు పైగా కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి. వీటితో పాటు సోలమ్ గ్రూప్ శ్రీసిటీలో 338 కోట్ల రూపాయల అంచనాతో ఈవీ ఛార్జర్ పవర్ మోడ్యూల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ సౌకర్యాన్ని వేగవంతం చేస్తోంది.
రాష్ట్రంలో స్టార్టప్ ఇకోసిస్టమ్‌ను పటిష్టం చేసేందుకు అమరావతి వేదికగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా వచ్చే ఐదేళ్లలో 20 వేల స్టార్టప్‌లను సృష్టించి, ఒక లక్ష ఉద్యోగాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు లోకేష్ ప్రకటించారు. వన్ ఫ్యామిలీ, వన్ ఎంట్రప్రెన్యూర్ అనే అద్భుతమైన విజన్‌తో కొరియా దేశపు ఇన్నోవేటివ్ స్టార్టప్‌లను ఏపీకి ఆహ్వానించారు. ఇందులో భాగంగా ఇండియా, కొరియా స్టార్టప్ కారిడార్, అలాగే ప్రత్యేక కొరియా డెస్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. అమరావతిని క్వాంటం మరియు ఏఐ క్యాపిటల్‌గా మార్చేందుకు సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్‌ను డేటా సెంటర్లు, ఏఐ సర్వర్ల ఏర్పాటుకు ఆహ్వానించారు. మొత్తంగా గత 24 నెలల్లో దాదాపు 240 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ కీలక ప్రగతి సాధించిందని, ఈ కొరియా పర్యటన రాష్ట్ర చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని లోకేష్ పేర్కొన్నారు.
Nara Lokesh South Korea Tour, AP Investments 2026, LG Sri City Plant, APACT Semiconductor AP


.webp)



