Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తొలి దశ జనగణన షురూ!
posted on: Apr 1, 2026 5:26PM

దేశవ్యాప్తంగా 16వ జనగణన ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం అయ్యింది. తొలి దశలో భాగంగా గృహగణన కార్యక్రమాన్ని చేపట్టారు. స్వతంత్ర భారత చరిత్రలో ఎనిమిదోదైన ఈ సెన్సస్‌ను తొలిసారిగా పూర్తి డిజిటల్ రూపంలో నిర్వహిస్తున్నారు. జనగణనలో సేకరించే సమాచారం అత్యంత గోప్యంగా ఉంటుందని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్‌కుమార్ నారాయణ్ చెప్పారు.
ఈ వివరాలను ఏ ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థలతో పంచుకోరనీ, వీటిని న్యాయస్థానాల్లో సాక్ష్యాలుగా కూడా పరిగణించరని తెలిపారు. ఈ డేటా సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాదన్నారు. ఈ వివరాల ఆధారంగా ప్రభుత్వ పథకాల్లో ఎటువంటి కోత విధించడం లేదా కొత్తవి మంజూరు చేయడం కూడా జరగదని తెలిపారు.






