Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మంత్రిపదవి వద్దన్న బాలకృష్ణ.. అభిమానుల నిరాశ!
posted on: Jun 10, 2014 1:12PM
.jpg)
నందమూరి బాలకృష్ణలో ఆయన అభిమానులు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావునే చూసుకుంటూ వుంటారు. ఎన్టీఆర్ సాధించిన ఘనతలన్నీ ఆయన కూడా సాధిస్తారన్న నమ్మకాన్ని పెంచుకుంటూ వుంటారు. కథానాయకుడిగా తండ్రి వారసత్వాన్ని విజయవంతంగా నెరవేర్చిన బాలకృష్ణ రాజకీయంగా కూడా తన తండ్రి అంతా స్థాయికి ఎదగాలని కోరుకుంటూ వుంటారు. నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆ ఆశలు మరింత పెరిగాయి. ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ మంత్రి కూడా అవుతారని అభిమానులు ఆశించారు. అయితే ఈనెల 8న ఆయన పేరు మంత్రివర్గంలో కనిపించలేదు. అది బాలకృష్ణ అభిమానులలో నిరాశ కలిగించింది. మంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా వున్నప్పటికీ బాలకృష్ణను మంత్రిగా చూడలేకపోతున్నందుకు వారు బాగా ఫీలయ్యారు. ఈ ఫీలింగ్ రాష్ట్రవ్యాప్తంగా వున్న అందరి అభిమానుల్లోనూ వుండి. తన అభిమానులు తాను మంత్రి కాలేదని ఫీలవుతున్నారని బాలకృష్ణ అర్థం చేసుకున్నట్టున్నారు. అందుకే తన పుట్టినరోజు నాడు మంత్రి పదవికి సంబంధించిన తన అభిప్రాయాలను బాలకృష్ణ స్పష్టంగా చెప్పారు. తనకు మంత్రి పదవి మీద ఆసక్తి లేదని పదవులు లేకుండానే సేవ చేయాలన్న ఉద్దేశంతో తాను వుంటానని చెప్పారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే మంత్రిపదవి కోరుకోకపోవడం బాలకృష్ణలోని పరిణతికి అద్దం పడుతోంది. కానీ, ఆయన అభిమానులు మాత్రం నిరాశ పడుతున్నారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా కొంత కాలం తర్వాత అయినా సరే బాలకృష్ణని మంత్రిగా చూడాలని ఆశపడుతున్నారు.



.png)


