మాజీ 'మిస్‌ తెలంగాణ' సూసైడ్ అటెంప్ట్‌.. ఫేస్‌బుక్‌లో పోస్ట్‌.. పోలీసులు అల‌ర్ట్‌

ఆమె మాజీ 'మిస్‌ తెలంగాణ'. ఏం క‌ష్టం వ‌చ్చిందో.. ఎవ‌రు మోసం చేశారో తెలీదు కానీ.. సూసైడ్ చేసుకోవాల‌ని అనుకుంది. సెల‌బ్రిటీ కావ‌డంతో ఆమెకు సోష‌ల్ మీడియాలో చాలా మంది ఫాలోయ‌ర్స్ ఉన్నారు. ప్ర‌తీ చిన్న విష‌యం ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసే అల‌వాటు ఉంది. చిన్న చిన్నవే పోస్ట్ చేసే తను.. సూసైడ్ చేసుకునే అంత పెద్ద మేట‌ర్‌ను సోష‌ల్ మీడియాలో పెట్ట‌కుండా ఎలా ఉంటుంది? అదే ప‌ని చేసింది. తాను సూసైడ్ చేసుకుంటున్నానంటూ.. ఆన్‌లైన్‌లో పోస్ట్ పెట్టింది. క‌ట్ చేస్తే.. క‌థ సుఖాంతం. ఇంత‌కీ అస‌లేం జ‌రిగిందంటే...

హైద‌రాబాద్‌లో ఉండే మాజీ మిస్ తెలంగాణ.. త‌న ఇంట్లో ఆత్మహత్యకు ప్ర‌యత్నించారు. ఉరి బిగించుకున్న ఆమె ఆన్‌లైన్‌లో పోస్ట్‌ పెట్టారు. ఆ పోస్ట్ చూసిన ఆమె స్నేహితులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆమె ఇంటికి చేరుకొని రక్షించారు. అనంతరం ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. ఆమె ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి కార‌ణం ఏంట‌ని ఆరా తీస్తున్నారు. ల‌వ్ మేట‌రా? కెరీర్ అంశ‌మా? మ‌రేదైన ఇష్యూనా అనే దిశ‌గా ద‌ర్యాప్తు చేస్తున్నారు.