Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...డబ్బుతో దొరికిన మాజీ మంత్రి భార్య : జగన్ పార్టీ వాటానా?
posted on: Apr 18, 2014 11:58AM
.jpg)
మచిలీపట్నం లోక్‌సభ స్థానం నుంచి జగన్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మాజీ మంత్రి పార్థసారథి భార్య కమల గురువారం నాడు హైదరాబాద్‌లో 45 లక్షల రూపాయలతో పోలీసులకు దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ డబ్బు ఎక్కడిదని పోలీసులు ప్రశ్నిస్తే కమలమ్మ ఏవేవో కాకమ్మ కథలు చెప్పిన విషయం పోలీసులు నమ్మడం లేదు. పోలీసులే కాదు... మెడకాయ మీద తలకాయ వున్నవాళ్ళెవరూ ఈ కథలు నమ్మరు. మచిలీపట్నంలో ఎన్నికల ఖర్చు కోసమే ఈ డబ్బు హైదరాబాద్ నుంచి తరలుతుందని ఎవరైనా చెబుతారు. అయితే ఈ డబ్బు హైదరాబాద్‌లో కమలకి ఎక్కడిదనే ప్రశ్నకు, జగన్ పార్టీ ద్వారానే వచ్చిందనే సమాధానాలు వస్తున్నాయి. మచిలీపట్నం లోక్‌సభ స్థానం నుంచి మాజీ మంత్రి పార్థసారథిని ఎలాగైనా గెలిపించాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్టు సమాచారం. ఈ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జగన్ తన పార్టీ వాటాగా పలు విడతలుగా డబ్బును అందజేస్తున్నారని, గురువారం దొరికిన డబ్బు కూడా ఈ వాయిదాల్లో భాగంగా ఇచ్చినదేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


.jpg)



