బీజేపీలోకి వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్‌.. పోటీ చేసేది ఎక్క‌డంటే...

ఇప్పుడంతా బీజేపీదే క్రేజ్. దేశంలో క‌మ‌లం పార్టీదే హ‌వా. ప్ర‌ముఖులు ఎవ‌రైనా రాజ‌కీయాల్లోకి రావాలంటే బీజేపీనే బెస్ట్ ఆప్ష‌న్‌గా మారుతోంది. కాషాయ ద‌ళం సైతం అలాంటి వారిని రార‌మ్మంటూ ఆహ్వానిస్తోంది. ఎవ‌రొచ్చినా కాద‌న‌కుండా.. టికెట్ కూడా ఇచ్చేస్తోంది. తాజాగా, మాజీ క్రికెట‌ర్ వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ బీజేపీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. గ‌తంలో గౌతమ్‌ గంభీర్ బీజేపీలో చేరి.. ఢిల్లీలో ఎంపీగా గెలిచి.. పార్టీలో ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. గంభీర్ బాట‌లోనే పొలిటిక‌ల్‌గా లాంగ్ ఇన్నింగ్స్ ఆడేందుకు తెలుగువాడైన వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్ బీజేపీ కండువా క‌ప్పుకోబోతున్నారు.  

బీజేపీ జాతీయ నేతలతో వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్‌ ఇప్పటికే చర్చలు జరిపార‌ని తెలుస్తోంది. లక్ష్మణ్ ఎంట్రీకి, పార్టీ త‌ర‌ఫున పోటీకి.. అమిత్‌షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చార‌ని అంటున్నారు. హైద‌రాబాద్‌కు చెందిన ల‌క్ష్మ‌ణ్‌కు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఒక నియోజకవర్గం నుంచి బ‌రిలో నిలుపుతార‌ని చెబుతున్నారు. అయితే, ల‌క్ష్మ‌ణ్ పోటీ చేయ‌నున్న ఆ నియోజ‌క‌వ‌ర్గం ఏంట‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. 

క్రికెట్‌లో ఓపిగ్గా లాంగ్ ఇన్నింగ్స్ ఆడ‌టంలో ఎక్స్‌ప‌ర్ట్ అయిన ల‌క్ష్మ‌న్‌.. హైద‌రాబాద్ బీజేపీ టీమ్‌లో కేసీఆర్‌కు అగెనెస్ట్‌గా ఏవిధంగా పొలిటిక‌ల్ బ్యాటింగ్ చేస్తార‌నేది ఇంట్రెస్టింగ్ పాయింట్‌. ప్ర‌స్తుతం దుబాయ్‌లో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌కు వ్యాఖ్యాత‌గా ఉన్నారు వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్‌. 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలక‌గా.. ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టకు మెంటార్‌గా ఉన్నారు.