ఈ భోజ‌నం కుక్క‌లు కూడా తిన‌వు.. కానిస్టేబుల్ మండిపాటు

జైల్లో దొంగ‌కి తిండి సంగ‌తి ఎలా ఉన్నా, పోలీస్ లైన్స్ మెస్‌లో మాత్రం భోజ‌నం బ‌హు రుచిగా  ఉండా ల్సిందే. ఏమాత్రం ఉప్పు త‌గ్గినా, కూర‌లో కారం ఎక్కువ‌యినా, నాన్‌వెజ్ రుచిగా లేక‌పోయినా మండిప‌డ తారా, స‌ర్దుకుపోతారా? ఏమోగాని మ‌నోజ్ కుమార్ అనే కానిస్టేబుల్ మాత్రం తిండి చాలా దారుణంగా ఉం ద‌ని ఏకంగా ప‌ళ్లెం చూపుతూ క‌న్నీళ్ల‌ప‌ర్యంత‌మై అంద‌రికీ తెలిసేలా చేశాడు. 

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఫిరోజాబాద్ పోలీస్ మెస్‌లో రోటీలు, అన్నం, ప‌ప్పు పెడ‌తారు. కానీ  అవి  ఏమాత్రం రుచి క‌రంగా ఉండ‌డంలేద‌ని, ప‌ప్పు మ‌రీ నీళ్ల‌గా ఉంటోంద‌ని ఈ తిండిని  క‌నీసం కుక్క‌లు కూడా తిన‌వ‌ని గోడు పెడుతున్నాడు. దీన్ని గురించి ఎస్‌.పికీ ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నాడు కానిస్టేబుల్ మనోజ్‌. ప‌న్నెండుగంట‌ల డ్యూటీ త‌ర్వాత ఇలాంటి తిండి తినాల్సి వ‌స్తోంద‌ని క‌న్నీళ్ల‌ప‌ర్యంత‌మ‌ య్యాడు. 

ముఖ్య‌మంత్రి ఆదిత్య‌నాధ్ పోలీసు అధికారుల‌కు మంచి నాణ్య‌మైన ఆహారం అందేలా చూసేందుకు ప్ర‌త్యేకించి అల‌వెన్స్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ మెస్ లో మాత్రం తిన‌డానికి వీలులేని ఆహారాన్ని ఇస్తున్నార‌ని మ‌నోజ్ కుమార్ మండిప‌డ్డాడు. అస‌లు బ‌ల‌మైన తిండి తినక‌పోతే డ్యూటీ ఎలా చేస్తామ‌న్న‌ది ఆలోచిం చాల‌ని అన్నాడు. మెస్ కుంభ‌కోణంలో సీనియ‌ర్ సీపీ, డిసీపీ పాత్ర కూడా ఉంద‌ని ఆరోపిం చాడు. 

మొత్తానికి మ‌నోజ్ కుమార్ ఫిరోజాబాద్ పోలీస్ మెస్ భాగోతం బ‌య‌ట‌పెట్ట‌డానికే ఏకంగా వీడియో చేసి మ‌రీ నెటిజ‌న్ల దృష్టికి రావ‌డం గ‌మ‌నార్హం. ఇదిలాఉండ‌గా,  మెస్ వ్య‌తిరేకంగా చేస్తున్న నిర‌స‌న ప్ర‌ద‌ర్శ న ప్ర‌దేశం నుంచి మ‌నోజ్‌ను పోలీసులు వేరే ప్రాంతానికి త‌ర‌లించారు. కాగా మెస్ ఆహారం విష‌యాన్ని ప‌రిశీలించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఫిరోజాబాద్ పోలీసులు సిటీ సీఓను కోరారు.