హుజురాబాద్ నుంచి  ఈటల సమర శంఖం ?

రాష్ట్ర మంత్రి వర్గం నుంచి బర్తరఫ్’ అయిన ఆరోగ్య శాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్, భవిష్యత్ వ్యూహం ఏమిటి? ఈ ప్రశ్నకు ఆయన ఇంతవరకు ఎక్కడా, స్పష్టమైన సంకేతాలు ఇవ్వలేదు. కానీ, ఈ రోజు సొంత గడ్డ హుజురాబాద్ ‘ వేదికగా, ఈటల స్పష్టత ఇవ్వడమే కాదు, తెరాస లక్ష్యంగా శంఖారావం పూరించారు. ఈరోజు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ఆయన మీడియా మీట్ నిర్వహించారు. తెరాస నాయకులు, మంత్రులు, ముఖ్యంగా మంత్రి గంగుల కమలాకర్ తనపై ఎంతగా విమర్శలు చేసినా, ఇంతవరకు, ఎక్కడా పరుషంగా ఎవరినీ ఒక్క మాటైనా అనని ఈటల ఈరోజు, మంత్రి గంగుల పై విరుచుపడ్డారు. ‘బిడ్డా.. గంగుల గుర్తుపెట్టుకో అంటూ ఆయనకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అంతే కాదు, హుజురాబాద్ ప్రజలను వేధిస్తే వదిలేది లేదని అన్నారు. గంగుల గుట్టురట్లు అన్నీ బయట పెడతానని హెచ్చరించారు. ‘నీ పదవీ పైరవీ వల్ల వచ్చింది. నీ బెదిరింపులకు భయపడను. నా ప్రజలు నిన్ను పాతర పెడతారు’ అంటూ గంగులపై వరస అస్త్రాలను సంధించారు. 

అంతే కాదు, ఇంట గెలిచి రచ్చ గెలవాలనే, వ్యూహంతో తెరాస టికెట్ పై గెలిచిన హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి, అక్కడి నుంచే కొత్త భవిష్యత్ కార్యాచరణకు శ్రీకారం చుట్టే వ్యూహాన్ని ఈటల ఈ రోజు అవిష్కరించారు. నాగర్జున సాగర్’లో చేసినట్లు ఇక్కడ చేద్దామంటే, ప్రజలు పాతరేస్తారని తెరాస నాయకులకు గట్టి హెచ్చరిక చేయడం ద్వారా, ఎమ్మెల్ల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో పోటీకి ఈటల సిద్దమవుతున్నారు. అలాగే, అయన మొదటి నుంచి వినిపితున్న ఆత్మ గౌరవం నినాదమే, ప్రధాన అస్త్రంగా యుద్దానికి సిద్దమవుతున్న సంకేతాలు  కూడా, ఇచ్చారు. ఈ సందర్భంగా ఈటల  2006లో కరీంనగర్‌లో ఎంపీగా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ నాయకులు, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా.. ఎంత మందిని కొన్నా తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని గెలిపించారు. ఇప్పుడు హుజురాబాద్‌లో కూడా అదే జరుగుతుందని, అంటూ, ప్రస్తుత తెరాసను అప్పటి కాంగ్రెస్’తో పోల్చారు.అలాగే, ఆత్మగౌరవ బావుటా ఎగరేసేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నరని పేర్కొన్నారు.అలాగే, గంగుఅల్ సహా తనపై విమర్శలు చేస్తున్న నాయకులకు కూడా అయన గట్టి వార్నింగ్ ఇచ్చారు, తను సహనం పాటిస్తున్నానని, అదే  కోల్పోతే మాడి మసి అయిపోతారు’ అంటూ ఈటల మాజీ సహచరునిపై మిస్సైల్స్ ఫైర్ చేశారు. ఇంతవరకు వన్ సైడెడ్’గా సాగిన కేసీఆర్ వెర్సెస్ ఈటల వార్, ఇక ఇప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో ... చూడవలసి వుంది.