ఏసీ గదుల నుంచి పాలనకు చరమగీతం.. ప్రతి శుక్రవారం సమస్యల పరిష్కార దినం!

posted on: May 9, 2026 4:06PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఏసీ గదుల లో కూర్చిని పాలన సాగించే పద్ధతికి చరమగీతం పాడారు. ప్రతి శుక్రవారం క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కార దినంగా ప్రకటించడం ద్వారా అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు.  అమరావతిలో జరిగిన  కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ..  పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.   సింగపూర్ నమూనా నుండి స్ఫూర్తి పొందిన చంద్రబాబునాయుడు, సమస్యలను స్థానికంగా మండల స్థాయిలో పరిష్కరించాలని నొక్కి చెప్పారు.  

అధికారులు  క్షేత్రస్థాయిలో గడిపే సమయాన్ని గరిష్ఠంగా పెంచడానికి..  అన్ని అధికారిక వీడియో కాన్ఫరెన్సులు,  అంతర్గత సమావేశాలు ఇప్పుడు వారానికి ఒక రోజుకు పరిమితం చేశారు. కలెక్టర్లు ఇప్పుడు ప్రతి  నియోజకవర్గాన్ని నెలలో కనీసం నాలుగు సార్లు సందర్శించాల్సి ఉంటుంది.   అలాగే.. డిసెంబర్ 2027 నాటికి 10 లక్షల ఇళ్లను నిర్మించాలనే భారీ లక్ష్యాన్ని చంద్రబాబు అధికారులకు నిర్దేశించారు.  క్షేత్రస్థాయి ఉనికిని, హై-స్పీడ్ డిజిటల్ ట్రాకింగ్‌ను కలపడం ద్వారా.. అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పని చేయడం ఒక మేండటరీగా మార్చేశారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...